S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిద్రలేమితో మధుమేహం!

ఫ్ర: రాత్రిపూట మేలుకుంటే శరీరంలో షుగరు ఖర్చు అయిపోతుందని, నిద్రపోయే సమయాన్ని తగ్గించేస్తే షుగరు వ్యాధి అదుపులో ఉంటుందని మా మిత్రుడు చెప్తున్నాడు. షుగరు కంట్రోలుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి?
-కావూరి శ్రీనివాసరావు (ఖమ్మం)
*
జ: షుగరు వ్యాధి వచ్చాక తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొత్త డాక్టరుకన్నా పాత రోగి ఎక్కువ చెప్తాడు. అవన్నీ మనకు తెలియక కాదు. తెలిసే చాలా తప్పులు చేస్తుంటాం. తెలిసి చేసే తప్పుల్ని ప్రజ్ఞాపరాధా లంటారు. షుగరు వ్యాధి వచ్చాక ప్రజ్ఞాపరాధాలు ఎన్ని చేసినా, గుప్పిళ్లతోనో, దోసిళ్లతోనో మందులు మింగుతుంటారు కాబట్టి అవి పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. కానీ షుగరు వ్యాధి రావటానికి ముందు చేసే ప్రజ్ఞాపరాధాలే ప్రమాదకరమైనవి.
అల్పనిద్ర, అతి నిద్ర రెండో షుగరు వ్యాధికి కారణం అయ్యే అంశాలే! రేపెప్పుడో వచ్చే షుగరు వ్యాధిని ఇవ్వాళే వచ్చేందుకు అవి కారణం అవుతాయి. ఇవ్వాళ వచ్చే వ్యాధిని రేపటికి వాయిదా వేయగలిగేలా జాగ్రత్తలు తీసుకోవటంలో ప్రజ్ఞ ఉంటుంది. తీసుకోకపోవటంలో అపరాధం ఉంటుంది.
టీవీకి అంటుకుపోవడం వలన శరీర శ్రమ తగ్గిపోయి, స్థూలకాయం ఏర్పడటం, కేలరీల నిల్వలు పెరగటం, నిద్ర చాలక పోవటం, నిద్రాభంగం, గుడ్లగూబలాగా రాత్రిళ్లు మేల్కొని పగలు నిద్రపోవటం ఇవన్నీ షుగరు వ్యాధి పూర్వ రూపాలను తెచ్చిపెట్టే అంశాలు. రేపు వచ్చే షుగరు వ్యాధిని నేడే వచ్చేలా ముందుకు జరుపుతాయి.
ఫ్రాంటియర్స్ ఇన్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో తాజాగా జరిగిన ఒక పరిశోధన సాయంకాలం తరువాత మనం చేసే తప్పులు షుగరు వ్యాధిని తెచ్చిపెట్టేవిగా ఉంటున్నాయని నిరూపిస్తూ ఒక పరిశోధనా పత్రం ప్రచురించింది. ‘తునియరత్ అనోథాయి సంతవీ’ అనే శాస్తవ్రేత్త ‘మన సాయంకాలం తప్పులు - షుగరు వ్యాధి పూర్వ రూపాలు’ అనే పరిశోధనా పత్రంలో పేర్కొన్న విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. సంధ్యావందనం మంత్రంలో ‘యద్రాత్రియా పాపమకార్షమ్..’ అంటూ రాత్రిపూట చేసే పాపాల నుండి బయటపడాలనే ప్రార్థన గుర్తుకొస్తుంది. పగటిపూట ఎలాంటి జీవన వ్యవస్థలో మనం జీవించినప్పటికీ, సాయంకాలం తరువాత మన వ్యవహారాలన్నీ నాణ్యమైనవిగా ఉండాలనేది ఆయన పరిశోధనలో సారాంశం. దానర్థం పగటిపూట ఇష్టారాజ్యం అని కాదు. సాయంకాలం తరువాత తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని!
అమెరికాలో ప్రతీ ముగ్గురిలో ఒకరికి షుగరు వ్యాధి పూర్వ రూపాలున్నాయని ఒక సర్వేలో తేలింది. వీరిలో 90 శాతానికి తమలో షుగరు వ్యాధి పూర్వ రూపాలు నడుస్తున్నాయని తెలియదని ఈ సర్వే చెప్తోంది. పూర్వ రూపాలంటే రాబోయే వ్యాధి సూచనలు (ఔ్యజ్య్ఘూౄ ఒకౄఔఆ్యౄ జశజూజష్ఘఆజశ ఆ్దళ యశఒళఆ యఛి ఘ జూజఒళ్ఘఒళ). వాటిని గ్రహించటమే షుగరు వ్యాధి నివారణకు ముఖ్యసూత్రం. వ్యాధి వస్తోన్న వైనాన్ని గమనించి, అందుకు కారణమయ్యే వాటిని ఆపగలిగితే వ్యాధి కూడా ఆగుతుంది. వ్యాధి కారణాలు సాయంకాలం తరువాత మనం చేసే పనుల్లో ఎక్కువగా ఉంటున్నాయని ‘తునియరత్ అనోథాయి సంతవీ’ శాస్తవ్రేత్త చేస్తున్న హెచ్చరిక.
షుగరు వ్యాధి అని పేరు చెప్పటానికి అవకాశం లేకపోయినప్పటికీ, రక్తంలో షుగరు స్థాయి బోర్డరు దాటి కనిపించటం ఈ పూర్వ రూపాల్లో ముఖ్యమైంది. ఇది షుగరు వ్యాధికే కాదు, గుండె జబ్బుక్కూడా పూర్వరూపమే!
మన నాగరికతకు టీవీ ఒక చిహ్నం కావచ్చు. కానీ, టీవీని విపరీతంగా ప్రేమించి, వదిలి వెళ్లలేనంతగా దానిలో లీనమై పోవటం వలన రేపటి షుగరు వ్యాధి నేడే రావటానికి దారి తీస్తుందని ఈ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇల్లినాయిస్‌లోని చికాగో వైద్య కళాశాలకు చెందిన డా.సిరిమన్ ర్యూట్రాకుల్ అనే పరిశోధకుడు జరిపిన అధ్యయనంలో డయాబెటిస్ పూర్వ రూపాలున్న వ్యక్తులు గుడ్లగూబలా రాత్రిళ్లు మేల్కొంటే, వారి ‘బోడీ మాస్ ఇండెక్స్’ (బిఎంఐ)లో చాలా తేడా కన్పించిందనీ, షుగరు వ్యాధి పెరిగిందనీ గమనించారు. వ్యక్తి ఒడ్డూ పొడుగూ, శరీరంలో పెరిగిన కొవ్వు వీటి నిష్పత్తిని కొలవటాన్ని బిఎంఐ అంటారు.
ఈ పరీక్షల కోసం షుగరు వ్యాధి పూర్వ రూపాలున్న 64 ఏళ్ల వ్యక్తులు 2,133 మందిని పరిశీలించారు. ఈ వ్యక్తులు ఉదయాలూ, సాయంకాలాలూ ఎలా ఉన్నాయన్నది పరిశీలనాంశం.
అతినిద్ర - అల్పనిద్రల కారణంగా శరీర జీవన క్రియల మీద కలిగే ప్రభావం గురించి శాస్తవ్రేత్తలే కాదు, మనం కూడా ఆలోచిస్తున్నది తక్కువ.
ఒకప్పుడు చీకటి పడుతుండగా, సందె వెలుగు ఉండగానే దీపాలు వెలిగించుకునే వాళ్లు. సాయంత్రం 6-7 గంటలకల్లా దీపం చుట్టూ కూర్చుని అంతా ఒకేసారి భోజనాలు చేసేవారు. 8-9 గంటలకల్లా గురకలు పెట్టేవారు. కరెంటు దీపాలు వచ్చాక రాత్రి భోజనాలు 8-9కి మారాయి. టీవీ ఛానళ్లు పెరిగాక సామాజిక వ్యవస్థలో చాలా మార్పు వచ్చింది. పగలు కూడా దీపాలు వెలిగించుకునే గాలీ వెలుతురూ లేని గృహ నిర్మాణాలు పెరిగి, పగలుకు రాత్రికి తేడా తెలీకుండా పోయింది. భోజన సమయం రాత్రి 10-11కి మారిపోయింది. రాత్రి 12లోపు నిద్రకు ఉపక్రమించే వాళ్లు చాలా తక్కువమందేనంటే ఆశ్చర్యం లేదు. ‘ఆలస్యం నిద్ర - ఆలస్యం మెలకువ’లు షుగరు వ్యాధిని ముందుకు జరుపుతాయని గమనించాలి. మన దేశంలో ఇటీవలి కాలంలో షుగరు రోగుల సంఖ్య విపరీతంగా పెరగటానికి రాత్రి గుడ్లగూబల్లా మనం మారిపోవటమే కారణం.
రాత్రి జాగరణం వలన ఏర్పడే పగటి మైకాన్ని సోషల్ జెట్‌లాగ్ అంటారు. వారం అంతా మేల్కొని, వారాంతంలో అతి నిద్ర కూడా ఇలాంటిదే! మెలకువగా ఉండవలసిన సమయంలో నిద్రా స్థితి రావటం వలన పని సమర్థత దెబ్బ తింటుంది. ఒక విధంగా ఇది కెరీర్‌ను దెబ్బతీసే అంశం కూడా. డ్దజచిఆ జశ ఒళళఔ ఒష్దళజూఖళ నిద్రావేళల్లో మార్పుల వలన సోషల్ జెట్‌లాగ్ పెరుగుతుంది. అది అనారోగ్యకరంగా బిఎంఐ కూడా పెరిగేందుకు కారణం అవుతుంది.
బిఎంఐ తగ్గేందుకు తీసుకోవలసిన చర్యలు షుగరు వ్యాధిని అదుపు చేసేందుకు తోడ్పడేవిగా ఉంటాయి.
షుగరు వ్యాధి నాణ్యమైన జీవితాన్ని దెబ్బతీస్తుంది. రాత్రించరుల్లా జీవించటం వ్యాధి కారణమే అవుతుంది. భోజనం వేళల్ని, నిద్ర వేళల్ని సరిచేసుకోవటం లైఫ్ స్టైల్ మార్పుల్లో మొదటి విషయం. డయాబెటిస్ జోన్‌లో ఉన్నవాళ్లు అంటే, ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వాళ్లు తప్పనిసరిగా తన భోజన నిద్రావేళల్ని ఆరోగ్యవంతమైన మార్పు చేసుకోవాలి. షుగరు వ్యాధికి సమీపంగా ఉన్నవాళ్లు, వచ్చిన వాళ్లు రాత్రి 10 తర్వాత టీవీ చూట్టం మానేయటం మంచిది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com