S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెట్టు ముందా..?

చెట్టు ముందా? విత్తు ముందా?
ఇది కొన్ని యుగాల నుంచి ఎంతో మందిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న.
భగవంతుడు సృష్టించాడు విత్తుని. ఆ తరువాత అది చెట్టుగా ఎదిగింది. భగవంతుడు ఎలా వచ్చాడు.
ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు.
ఇలాంటి ప్రశ్నలు అనేకం. గుడ్డు ముందా? కోడి ముందా?
ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తున్నప్పుడు మరో ప్రశ్న ఈ మధ్య ఓ మిత్రుడు వేశాడు.
‘మనం ఏదైనా పని చేయాలంటే ప్రేరేపించే వాళ్లు ఉండాలి. ఏదైనా ఫలితం ఉండాలి కదా’
నిజమే ఫలితం గానీ ప్రేరేపకులు గానీ ఉండాలి. ఆ విధంగా వుంటే పని చేయవచ్చు. ఎలాంటి ప్రేరేపణ లేకుండా పని ఎలా చేస్తాం.
ఇది కూడా సరిగ్గా చెట్టు ముందా? విత్తు ముందా లాంటి ప్రశే్న.
మనం ఏదైనా పని చేస్తే ప్రేరేపణ వస్తుందా?
ప్రేరేపణ వస్తే పని చేస్తామా?
చెట్టు ముందా విత్తు ముందా అన్నదానికి జవాబు లేదు కానీ ప్రేరేపణ వుంటే ఏదైనా పని చేయడమా? పనిచేస్తే ప్రేరేపణా అన్న ప్రశ్నకు మాత్రం జవాబు వుంది.
ఏదైనా ప్రేరేపణ వుంటేనే పని చేస్తాం అన్న వ్యక్తులకన్నా పనిచేస్తే ప్రేరేపణ ఉంటుందన్న వ్యక్తులే జీవితంలో విజయాలని సాధిస్తారు.
ప్రేరేపణ కోసం వేచి వుండాల్సిన పనిలేదు.
పని చేస్తే ప్రేరేపణ వస్తుంది.
ఇది ప్రయత్నం చేస్తే తెలుస్తుంది.
వృథాగా కూచుంటే బోధపడదు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001