S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇమేజ్‌పై ‘శ్రద్ధ’లేదు!

వెండితెరపై అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి శ్రద్ధాదాస్ పోషిస్తున్న పాత్రలన్నీ గ్లామర్‌తో కూడుకున్నవే కావడం గమనార్హం. అయితే అలాంటి గ్లామర్ పాత్రలు పోషించి బాగా బోర్ ఫీలయిందట. తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీలాంటి భాషల్లో చిత్రాలు చేస్తూ కెరీర్‌పరంగా సంతృప్తికరంగానే వున్నా, ఇప్పటికీ తను అనుకున్న పాత్రలు మాత్రం రావడం లేనేలేదట. ఇలా ఎందుకు జరుగుతుంది అని శ్రద్ధను కదిలిస్తే మాత్రం బోల్డు కబుర్లు చెప్పుకొచ్చింది. ‘‘చాలా మంది తారలు ఇమేజ్ గురించి ఆలోచిస్తుంటారు. నాకు అలాంటి ఆలోచనే లేదు. హిందీలో ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, కన్నడలోమరో సినిమా, బెంగాలీలో ఓ చిత్రంతో పాటు తెలుగులో మరో రెండు అవకాశాలున్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే కెరీర్ పరంగా చూస్తే ఒకే ఇమేజ్‌కు బందీని కాదల్చుకోలేదు. నేను చేసిన సినిమా ఎలావుంది? అందులో నా పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? లాంటి వాటి గురించే నేను ఆలోచిస్తాను తప్ప నాకు ఎలాంటి ఇమేజ్ వుంది అని ఏ మాత్రం ఆలోచించను. తాజా చిత్రం ‘గుంటూర్ టాకీస్’లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ‘టింగో టింగో’ సాంగ్ తర్వాత నాకు చాలా ఐటెమ్‌గర్ల్‌గా అవకాశాలు వచ్చాయి. కానీ నేనే నో చెప్పాను. అలాగని వాటి దూరంకాను. మంచి బ్యానర్, మంచి సినిమా అనిపిస్తే తప్పకుండా చేస్తా’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..శ్రద్ధ!!

తగ్గని తమిళ మోజు!

ఎన్నో చిత్రాల్లో మరెన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన అందాలభామ హన్సికకు ఇప్పటికీ తమిళంపై మోజు తగ్గనేలేదట. తెలుగు, తమిళం బాగానే తెలిసినా ఇంకా మాట్లాడం కూడా ఈ అమ్మడికి చేతకాదు. చాలా మంది తారలు బాలీవుడ్‌లో నెగ్గుకు రావాలనుకుంటుంటారు. కానీ హన్సిక మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగానే కనిపిస్తోంది. ‘‘నాకు తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచి పాత్రలు లభిస్తున్నాయి. అగ్రహీరోలందరితో ఆడి పాడుతున్నాను. అంతేకాదు, తమిళ ప్రేక్షకులు నన్ను, నా చిత్రాలను ఎంతగానో ఆదరిస్తున్నారు. నాకు ఇంతకంటే ఏం కావాలి? నాకే కాదు, ఏ నటికైనా ఇంతకంటే మరేం వుండదు. ప్రస్తుతం తమిళంలో చేతినిండా చిత్రాలతో నా డైరీ నిండిపోయింది. ఇప్పటికే నాలుగైదు రెడీగా వున్నాయి. మరి కొన్నింటిని ఒప్పుకోవలసి వుంది. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా మంచి కథలు, పాత్రలు ఎంచుకుంటున్నాను. అందుకే తమిళంలో నాకు బాగా ఆదరణ పెరిగిపోతోంది’’అంటూ సెలవిచ్చింది. ఇక హన్సిక తమిళంలోనే సెటిలన్నమాట! ఏమంటారు?!

తెలివైనదే!
టాలీవుడ్‌లో నితిన్ హీరోగా వచ్చిన ‘హార్ట్ ఎటాక్’లో నటించిన ఆదాశర్మ గుర్తింది కదా! ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో వెండితెరకు దూసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ అటు తర్వాత ‘హసీతో ఫసీ’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రానా విక్రమ’, ‘గరం’, ‘క్షణం’లాంటి చిత్రాల్లో నటించింది. అయితే తొలి చిత్రం ‘1920’లో నటించాక అంత చాలెంజింగ్ రోల్ ‘క్షణం’లోనే లభించిందట. మంచి పాత్రలు ఎక్కడ లభిస్తే అక్కడ చేయాలనే రూలేమీ పెట్టుకోలేదంటూనే మరో పక్క మాత్రం బాలీవుడ్‌పై మోజును పెంచుకుంటూనే వుంది. తెలుగు, తమిళ భాషల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూనే తన కెరీర్‌ను మాత్రం బాలీవుడ్‌వైపే మలుచుకోవాలనుకుంటుందిట. అవునా..అని శ్రద్ధను అడిగితే-‘‘ నటి అన్నాక అన్ని భాషల్లో చేయాలి. నేనూ అంతే. నాకు అన్ని భాషల్లో నటించాలనుంది. మంచి అవకాశాలు ఎక్కడ లభిస్తే అక్కడ చేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. ఇందులో తప్పేమీలేదు కదా! అయితే బాలీవుడ్ అంటారా ఇప్పుడిప్పుడే నాకు అక్కడ కొంతమంది అవకాశాలు ఇస్తామని అంటున్నారు. ఎందుకు వద్దనుకోవాలి? చూద్దాం..ఏ వుడ్డు ఎలా కలిసివస్తుందో!!’’నంటూ ఎంతో తెలివిగా తప్పించుకుంది.

-సమీర్