S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలావుందీ వారం? ( ఏప్రిల్ 3 నుండి 9 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

స్థిరమైన నిర్ణయాలతో పనులు సాధిస్తారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొత్త పరిచయాలు అనుకూలిస్తాయి. సంయమనంతో గందరగోళ పరిస్థితుల్లోంచి బయటపడతారు. కోర్టు వ్యవహారాలందు విజయం సాధిస్తారు. వృత్తి, విద్య, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వైవిధ్యమైన కార్యాలందు ఇతరుల సంప్రదింపులతో విజయాన్ని సాధిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగులకు బదిలీలుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

అంకితభావం, ఆత్మతృప్తితో పనులను సాధిస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. వాహన సౌఖ్యం. ధనాదాయం ఖర్చులకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలందు అత్యాశకు పోవద్దు. స్ర్తి పురుషులు స్వీయ నిర్ణయాలతో పనులను పూర్తి చేస్తారు. చైతన్యవంతమైన ఆలోచనలతో భవిష్యత్‌కు బాటలు వేస్తారు. ఇతరుల ప్రమేయంతో పనులు చక్కబెట్టుకుంటారు. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)

మందకొడిగా సాగుతున్న పనులు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులందు అలసత్వం పనికిరాదు. ధార్మిక విషయాలందు ఆసక్తి పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగ, వాణిజ్య, వృత్తులందు ఆటంకాలున్నా అభివృద్ధి ఆశించవచ్చు. మనశ్శాంతి లోపిస్తుంది. ద్రవ్య లాభం. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సోదర వర్గాలతో బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. అనవసర పోటీతత్వం మంచిది కాదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

పనుల విషయంలో ఇతరుల జోక్యం తగ్గించండి. కళ, వృత్తి, రియల్ ఎస్టేట్ రంగాల వారు మన్ననలను పొందుతారు. ఆలస్యంగానైనా భాగస్వామ్యాలు ఒక కొలిక్కి వస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆర్థిక విషయాలు ఇతరులను ఆకర్షిస్తాయి. హామీలు ఇవ్వకండి. సంఘ, దైవ కార్యాలందు పాల్గొని గౌరవ మర్యాదలు పొందుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆలస్యంగానైనా లక్ష్యాలను చేరుకొంటారు. ఇతరులకు మార్గదర్శకత్వం వహిస్తారు. వాయిదా పద్ధతిలో పనులు పూర్తి చేయకండి. ఆధ్యాత్మిక, కుటుంబ వ్యవహారాలందు పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ధనం సర్దుబాటవుతుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. వృత్తి, ఉద్యోగ, వాణిజ్యాలు రాణిస్తాయి. పనులపట్ల తొందరపాటు తగదు. గృహ, స్థల మార్పులు, కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. విమర్శలకు దూరంగా ఉండండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

స్వీయ పర్యవేక్షణలో పనులు పూర్తి చేస్తారు. పట్టుదలతో, స్నేహితుల సహకారంతో పనులు, శుభకార్యాలు చేపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు ఆశించిన దానికన్నా అధిక ఫలాలందుకొంటారు. ఇంటా బయటా సమస్యలున్నా సరైన రీతిలో పరిష్కరించుకొంటారు. మాటకు విలువ పెరుగుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. పెట్టుబడి లాభిస్తుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ధన లాభం ఉంటుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

వ్యవహారాలు మీరనుకున్నట్లుగా పూర్తవుతాయి. శుభకార్యాలు కలసి వస్తాయి. ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందకరమైన వార్తలు వింటారు. మనోవాంఛ నెరవేరుతుంది. విమర్శలను పట్టించుకోవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారి కృషి ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఖర్చులున్నప్పటికీ ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. సంఘంలో ఉన్నత స్థితి పొందుతారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

పరిస్థితులు అనుకూలించడంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఖర్చులు అధికం. ధనాదాయం. వాహన కొనుగోలుకు అవకాశముంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక సమాచారం మీకు సంతోషాన్నిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)

బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఖర్చులు అధికం. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం. సంతానం ద్వారా ఆశించిన లాభాలు పొందతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. అవగాహనా లోపం లేకుండా కొత్త పనులు ప్రారంభించవద్దు. ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్య, వైద్య, కళారంగాల వారికి మంచి రోజులు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

స్వయంకృషితో పనులందు జయం లభిస్తుంది. ఆరోగ్య లాభం. ధన లాభం. వాహన సౌఖ్యం. ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు. ఇంటి మార్పులు, మరమ్మతులకు అవకాశం ఉంది. స్పెక్యులేషన్ అనుకూలం. సమాజంలో ఉన్నత స్థితిని పొందుతారు. సరైన పరిష్కార మార్గాల ద్వారా సమస్యలు సమసిపోతాయి. మొత్తం మీద ఈ వారం బాగుంటుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

స్థిరమైన నిర్ణయాలు ముందుకు నడిపిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులున్నా నెమ్మదిగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. స్పెక్యులేషన్ వాయిదా వేయటం మంచిది. విందు వినోదాలలో, తీర్థయాత్రలందు పాల్గొంటారు. ఔషధ సేవనం ద్వారా ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వాణిజ్య రంగాల వారికి లాభదాయకం. దైనందిన చర్యల పట్ల జాగ్రత్త అవసరం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు మిత్రులవుతారు. ఇతరుల మాటలను విని మోసపోకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలందు పాల్గొంటారు. ముఖ్య సమాచారం సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. స్పెక్యులేషన్లు స్వల్పంగా అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855