S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రెండు రత్నాలు ధరించవచ్చా? (గ్రహానుగ్రహం)

రెండు లేదా అంతకన్నా ఎక్కువ రత్నాలు ధరించే అంశం. మనవారు ఎన్నో విచిత్రాలు చూపుతున్నారు. కెంపు నీలం ధరింప చేయిస్తున్నారు. రెండు రాళ్లకు రవి, శని అధిపతులు. మరి శత్రువులను ఇరువురినీ కలిపి చేతికి ధరించడం ఎంతవరకు సమంజసం. అదే రీతిగా రవి శుక్రులు కలిస్తే మూఢమి, రవి గురువులు కలిస్తే మూఢమి. మరి మూఢమి సూచికమయిన ఆ రెండు రాళ్లను చేతికి ధరిస్తే పరిస్థితి ఎలాగ ఉంటుంది. వారి జీవితంలో ప్రతి పనీ మూఢమిగానే ఉంటుంది. ఎక్కడో ఖగోళంలో కాదు వాడి చేయి ప్రభావమే మూఢమి. ఇక కేరెట్‌ల లెక్క. ప్రతివారూ ఇన్ని కేరెట్‌లు తప్పకుండా ధరించాలి అని చెబుతారు. ఎక్కువ ఎందుకు ధరించరాదు? తక్కువ ఎందుకు ధరించరాదు అనే అంశం ఎవరైనా మహర్షులు చెప్పారా? మహర్షులు రాసిన గ్రంథాలు ఆధారంగా ఉన్నాయా? ఒకసారి కేరెట్‌ల గురించి చెప్పిన వారిని అడిగి చూడండి.
మరి రవి రాహువులు కలిస్తే గ్రహణం. కెంపు, గోమేధికం కలిపి గానీ విడివిడిగా గానీ ఒక చేతికి ఒకే వ్యక్తి ఒకేసారి ధరింపరాదు. మరి అదే రీతిగా కెంపు వైఢూర్యం, ముత్యం గోమేధికం, ముత్యం వైఢూర్యం ధరింపరాదు. ఇదే మాదిరిగా రవి చంద్రుల కలయిక అమావాస్య. కెంపు ముత్యం కూడా ధరింపరాదు. పరస్పరం శత్రు భావాలు వున్న గ్రహములకు సంబంధించిన రాళ్లు మరియు లగ్నాత్ 6,8,12 స్థానములతో సంబంధం వున్న గ్రహములకు సంబంధించిన రాళ్లను ధరింపరాదు. నక్షత్రాధిపతికి శత్రువు అయిన గ్రహమునకు సంబంధించిన రాయి ధరింపరాదు. మరి లగ్నాధిపతికి శత్రువు అయిన గ్రహమునకు సంబంధించిన రాయి ధరింపరాదు. ఇలా ఎన్నో నియమాలు ధారణ విషయంలో- మరి వైదీక సంప్రదాయం ప్రకారం కుడి చేతి చూపుడు వేలుకు తండ్రి బతికి ఉన్నవారు ఏ విధమయిన ఉంగరం ధరింపరాదు అంటారు. అలాగే తండ్రి చనిపోయిన తరువాత ఉంగరం వేలుకు ‘పితృ పవిత్రం దర్భముడి ఉంగరం’ చూపుడు వేలుకు కేవలం ప్లెయిన్ రింగ్ మాత్రమే ధరించాలి అని చెబుతారు. కారణం పితృ తర్పణం దృష్టిలో ఉంచుకొని ఈ నియమం చెప్పారు. కానీ నేడు 1995 నుండి రత్నాలు విరివిగా మారి చూపుడు వేలుకు పుష్యరాగం తండ్రి బతికి వున్నవారు కూడా ధరిస్తున్నారు. మరి ‘వైదీకాచారం’ అందరూ మరచిపోయారు కూడాను. ఇక వెండి ఆభరణాలు కేవలం ఆడవారు కాళ్లకు మాత్రమే ధరించేవారు. ఆంధ్రలో ఒక నానుడి ఉన్నది. ‘్ధరణ, భావన ఉన్నతంగా ఉన్నవారికే సౌభాగ్యం పెరుగుతుంది. మరి వెండి పాత్రలకు సంబంధించిన లోహం అందుకు మనవారు వెండి పాత్రలే గ్లాసులు, ప్లేట్‌లు, గినె్నలు, చెంబులు చేయించేవారు. బంగారం ఆభరణాలకు సంబంధించిన లోహము. అందువలన ఉన్నతమయిన లోహము బంగరమునకే ఆభరణములు చేయించే పనిచేసేవారు. కేవలం రుద్రాక్షలు, పూసలు వంటివి గట్టిదనం కోసం వెండి తీగెతో చుట్టేవారు కానీ వెండి ధారణ సబబు కాదు. పవిత్రత కోసమైతే ‘రాగి’ని ధరించవచ్చు. ప్రాథమిక ధర్మం తప్పిన తరువాత ఎవరు ఏం చేసినా అది మనకు ఆకర్షణగానే కనపడుతుంది. మనకు కష్టం వచ్చినపుడు అవి అన్నీ ఆచరించాలి అనిపిస్తుంది. అలాగే ఆచరించేటప్పుడు మహర్షులు వారి గ్రంథాలలో ఏం చెప్పారనే విషయం తెలుసుకోవాలి. లేదా ‘వైదీకాచారం’ తెలుసుకోవాలి. సుఖపడతారు. అదే రీతిగా శాస్త్రం గౌరవింప బడుతుంది.
...............................
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336