S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవించడమా...? వుండడమా?

ఈ ప్రపంచంలో
జీవించడమనేది చాలా అరుదైన విషయం. చాలామంది వుంటారు. అంతే! అన్నాడు ఆస్కార్ వైల్డ్.
ఇది నిజమా?
జీవించడానికి, వుండటానికి (లైవ్ ఆర్ ఎగ్జిస్ట్) మధ్య ఏమైనా భేదం వుందా? ఈ స్టేట్‌మెంట్ సరైందేనా?
ఈ స్టేట్‌మెంట్ చదవక ముందు, ఆరేడు సంవత్సరాల క్రితం ‘అచలనం’ అన్న కవిత ఒకటి రాశాను. ఆస్కార్ వైల్డ్ మాట చూసిన తరువాత నేను రాసిన కవిత గుర్తుకొచ్చింది.
ఆ కవితలో ఇలాంటి చరణాలు వుంటాయి.
‘....
గుర్గావ్ సంఘటన గానీ
గుండె పగిలిన వ్యక్తి గానీ
38 ఏళ్లు జైల్లో మగ్గిన ఖైదీగానీ
రోడ్డుకు బలైన నూతన వధూవరులు గానీ
ఎవ్వరూ వాళ్లని కదిలించరు.
ఈ ప్రపంచంలో చాలామంది వ్యక్తులు దేనికీ స్పందించరు. నిరాసక్తంగా ఉంటారు. తమ విషయం తప్ప ఏ విషయాలు తమకి అవసరం లేదని అనుకుంటారు. కానీ వాళ్లు అన్నీ చూస్తారు. అన్నీ చదువుతారు. అన్నీ వింటారు. కానీ దేనికీ స్పందించరు.
ఇలాంటి వ్యక్తుల గురించి ఇలా రాశాను-
కళ్ల ముందే మనిషి విస్తరాకు అవుతుంటే
కదలని వాళ్లు
మాటలని బంధించినా
మాట్లాడని వాళ్లు
ఈ రోజు చనిపోవడమేమిటీ?
బహుశా తల్లి గర్భంలోనే చనిపోయి వుంటారు.
జీవించడం అంటే స్పందించడం. ఇతరుల పట్ల దయతో వుండటం, ప్రేమించడం, అర్థం చేసుకోవడం. గొంతెత్తడం.
వుండటం అంటే-
వుండీ లేనట్టుగా వుండటం-
నిరాసక్తంగా ఉండటం-
వీళ్ల గురించి ఇంకా ఇలా రాశాను-
వాళ్లకీ ఓ పేరుంది
కానీ
ఏం లాభం?
దానికి ఏ గుర్తూ, గుర్తింపు వుండదు
వాళ్ల సమాధి మీద
‘పుట్టకుండానే చనిపోయిన వ్యక్తి’ అన్న
అక్షరాలు రేడియమ్‌లా మెరుస్తాయి.
వుండటం అంటే - పుట్టకుండానే చనిపోవడం.
మనం జీవిద్దామా?
వుందామా?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001