S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జయహో!

ఆమె అంటే
ఎందుకో ఎలానో
తెలీని అభిమానం

చూసిన కళ్లు
పదేపదే పాపలపై
కదలాడే ఆమెని
రెప్పలమాటున దాచేస్తున్నాయి

ఆమె రెటీనా నుండి
మనసు కేంద్ర లోలకంలో
అలాఅలా ఊగుతూ
స్థిర నివాసమేర్పరచుకుంది

అస్థిరం కాదిక
మరోమాటే లేదిక
ఆమెదే ఆ స్థానం
పదిలమిక
తొణకని మనసు

ఊహల జంపాల
ఇలలో స్వర్గపుటంచుల తాకేస్తూ
ఆమె అనుమతికై నిరీక్షణ
ఏకపక్షం వెర్రి కాకూడదులే

ఆమె ఆలోచించింది
సరిజోడు కాదనుకుంది
కాదన్నది ప్రేమని

సముదాయించుకున్నా
రెండు మనసుల కలయిక
రెండు హృదయాల ఏకం
సాధ్యం కాట్లేదని
నా దారి నాది
ఆమె దారి ఆమెది

జీవితంలో ఓ మజిలీ అంతే
కోల్పోయినా తాత్కాలికమే
మరో తెర తీయగా
తియ్యనైన మజిలీ సాక్షాత్కారం

గెలుపో ఓటమో కాదది
స్పందనల హోరులో తుఫాను
కాలమే మరిపించు
క్షణికావేశమొదిలేయ్
కొత్త బాణీ అందుకో
జయహో! జీవితం

-చెలమల్లు గిరిప్రసాద్ 94933 88201