S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూమర్స్.. నో ప్రాబ్లమ్!

బాలీవుడ్ భామలపై రూమర్స్ అనేవి మామూలే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రూమర్స్‌లో ఇరుక్కోని తారలు ఉండరంటే ఉండరు. అందులో ముఖ్యంగా అందాలభామలకు ఇవి తప్పనివే. అందులో ముందు వరుసలో ఉంది కత్రీనాకైఫ్. రోజురోజుకీ కత్రీనాపై రూమర్స్‌లు పుట్టుకొస్తూనే వున్నాయి. వీటిని ఏ మాత్రం లెక్కచేయని నటి అంటే కత్రీనానే! రూమర్స్‌పై మీ స్పందన అని కత్రీనాను కదిలిస్తే- ‘‘ప్చ్..డోంట్‌కేర్. నేను రూమర్స్‌ని ఏ మాత్రం లెక్కచేయను. బాలీవుడ్‌లో దూసుకొస్తున్న తారలు..బాగా పాపులర్ అయిన అందాలభామలపై ఇలాంటి పుట్టుకొస్తుంటాయి. అలా పుట్టించకపోతే వాళ్లకు కాలం గడవదు. వాళ్ల పని అదే మరి! మనపై వస్తున్న రూమర్స్‌ని పట్టించుకుంటే మన కెరీర్ ఇక అంతే! అందుకే వాటి ఎంత దూరంగా వుంటే అంత మంచిది’’ అంటూ తోటి నటీమణులకు కత్రీనా ఉచిత సలహాలు కూడా ఇస్తోంది. అదీ..సంగతీ!!

-సమీర్