S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కవిగా జాషువా

కవిగా జాషువా
నవయుగ చక్రవర్తియై
గుర్రంలా పరుగిడుతూ
ఆ పరుగులో పీడిత ప్రజల
పీడకలలను చూచి చలించి
హృద్య పద్యాలుగా మలిచి
మధుర శ్రీనాథుడైనాడు.

సాంఘిక దురాచారాల పిశాచాల
వికృత రూపాలకు కళ్లు చెమర్చి
గబ్బిలంలా వెంటపడ్డాడు
జలదరించిన జాషువా
కవికోకిలై కవితల నొక్కొక్కటిగా
జారవిడిచాడు
అన్ని తలలను తనవైపు తిప్పుకున్నాడు
అన్ని తలపులనూ కదిలించి
అందరి వాడైనాడు

‘్ఫరదౌసీ’ ‘ముంతాజ్‌మహల్’
‘కొత్త లోకం’ ‘బాపూజీ’ ‘నేతాజీ’
‘శిశువు’ ‘గౌతమి’
ఒకటేమిటి ఏడు ఖండకావ్య
సంపుటాలతో ఎన్నో పుటలు
పురివిప్పి నాట్యం చేశాయి
పల్నాటి యుద్ధం సినిమాలో
అంటరానితనంపై వ్రాసిన ఆయన
పద్యాలు అందరినీ అంటి
తలంటి మింటికెగసి పద్మభూషణుని చేశాయి

అందుకే ఈ జయంతులు
అందరి మనసుల్లో పూబంతులు
ఆయన కలల్ని సాకారం చేస్తే
సమాజానికి అభ్యుదయం
అందరి ఆశలకు అరుణోదయం

-షణ్ముఖశ్రీ.. 8897853339