S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాదం కాని నాదం

నాది ఆదాయ కవిత్వం
సముదాయ కవిత్వం
సముదాయించే కవిత్వం
సంప్రదాయ కవిత్వం
కానే కాదు

ఆధ్యాత్మికవేత్తను కాను
ఆధ్యాత్మికానందానుభూతిని
విభూతి ధారణతోనే తృప్తి చెందక
ఆషాఢభూతుల్ని గమనిస్తుంటాను
భవభూతి వంటి వారిని
అనే్వషిస్తుంటాను

కాలాన్నిబట్టీ అబద్ధాల్ని
అక్షరాలు చెయ్యలేక
మరో కవి హృదయాన్ని
బ్రద్దలు కొట్టి అతని
తత్త్వాన్నీ, కవిత్వాన్నీ
కబ్జా చెయ్యక
‘ఓ బొజ్జ గణపయ్య
నీ బంటు నేనయ్య’ అంటూ
బొజ్జనిండా నింపుకొన్న
సంకుచితత్త్వం లేని
భావజాలాన్ని
వాదం కాని నాదంతో
వినిపిస్తుంటాను
*

-షణ్ముఖశ్రీ.. 8897853339