S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నా.. పయనం

ఉదయంతోనే మొదలు
అస్తమయం వరకు
అలుపెరుగని
అవిశ్రాంతిని
మెతుకు బువ్వకోసం
జానెడు పొట్ట కోసం
రేయనకా..
పగలనకా...
చెమ్మగిల్లినా...
సొమ్మసిల్లినా...
ఆలిబిడ్డల
పేగుబంధాల
ప్రేమలకు లీనమై
శ్రమను మరిపే
సంతోషబలం ఊరే
మండే ఎండలో
నీడై తోడై దప్పిక తీర్చే ఆలి
రెక్కల కష్టాన్ని మానే్ప
బిడ్డ చిరునవ్వు
మూగ జీవాల సావాసంలో...
పొరుగిళ్ల ఆసరాలతో..
చెట్టు గుట్టల్లో...
గులకరాళ్ల సవ్వళ్లలో..
పల్లేరుగాయల దారుల్లో...
‘నా.. పయనం’
ఉదయంతోనే మొదలు
అస్తమయం వరకు!
*

-చింతా లక్ష్మీనారాయణ 9908830477