S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బేరం చెయ్యడం నేరం కాదా!

అమ్మేవాడు అడిగిన కన్నా
అదనంగా ఇచ్చేవాళ్లని
మెచ్చుకోవాలి మనం
బడాబడా షాపుల మాట కాదిది
బడుగు జీవుల గురించి...

దూర ప్రాంతాల నుంచి
కూరగాయలు, పళ్లు తట్టలెత్తుకొని
కావడి మోసుకొని
తక్కువ ధరకు అమ్మే
కష్టజీవుల గురించి...

ఆకలి దప్పుల అవసరార్థం
తక్కువ ధరకు అమ్మేవాళ్లకి
అదనంగా ఇచ్చే దాతలను
మెచ్చుకోవాలి మనం

కూరగాయలకు మాత్రమే
వర్తించదు ఈ మాట
పేదవాడు ఏ వస్తువు అమ్మినా
బేరం చేయడం నేరమేకాక
కొన్ని సమయాలలో
క్రూరమే అనిపిస్తుంది.

-రాచకొండ నరసింహశర్మ