S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రత్న ధారణ నియమములు

ప్రస్తుతం నడుచుచున్న దశ, అంతర్దశలనాదులతో వైరం వున్న గ్రహాలకు సంబంధించిన రత్నం ధరింపవలసిన ఆవశ్యకత ఉన్న యెడల... జాతకంలో గ్రహ బలములు యోగములు పరిశీలించి ధరించవలెను. అవయోగ గ్రహములకు సంబంధించిన రత్నములు ధరించుట శ్రేయస్కరం కాదు.
* నవరత్నములు అందరూ ధరింపవచ్చు. నవరత్నములు అష్టదళ పద్మ ఆకృతిలో కానీ అష్టకోణ రూపంలో కానీ చతురస్ర రూపంగా కానీ ధారణ చేయవచ్చు. లేదా డాలర్‌గా చేయించి మెడలో ధరింపవచ్చు. సంసారిక జీవనంలో ఉన్నవారు ఈ ఉంగరం తీసివేసిన తరువాత శయ్యను ఆశ్రయించుట మంచిది.
* పురుడు, మైల వంటివి తెలిసినప్పుడు ఈ నవరత్నముల ఉంగరమును ఆవుపాలతో శుద్ధు చేయించి మరల ధరించాలి.
* తరచుగా అభిషేకంలో ఈ ఉంగరం ఉంచి తదనంతరం మరల ధరిస్తూ ఉంటే విశేష ఫలితాలు అందుతాయి అని పెద్దల మాట.
* నవరత్న ధారణ అత్యావశ్యకంగా అనిపిస్తేనే ధరించాలి అనేది తప్పు. అందరూ ధరించవచ్చు. నవరత్నముల ధారణ అందరికీ మంచినే చేస్తుంది.
* మనం ధరించే రత్నం మంచిదా? కాదా? అనే విషయం బాగా గమనించి ధరించండి. రత్న పరీక్ష నమ్మకంగా చేయువారిని ఆశ్రయించండి. రత్నం ధారణ విషయం జాతకం ద్వారా చెప్పేవారు. అందరికీ రత్న పరీక్ష చేయడం వచ్చు అనుకోవద్దు. జాతకరీత్యా రత్నం నిర్థారిస్తారు కానీ రత్న పరీక్ష అందరూ చేయలేరు. రత్నం ధరించండి - కానీ రత్నం జీవితాన్ని మార్చదు. ప్రయత్నం ప్రధానం.
--

పి.జె. (గుంటూరు)
ప్రశ్న: ‘దుర్ముఖ’ ‘దుర్ముఖి’ ఈ రెంటిలో ఏ పదం సరైనది. మనం ఏ పదం వాడుకొని సంకల్పం చెప్పాలి?
జ: చిన్నతనంలో పెద్దబాలశిక్ష ఆధారంగా పిల్లలకు పాఠం చెబుతూ ‘దుర్ముఖి’ అని చెప్పారు. గత పంచాంగాలలో పంచాంగకర్తలు ‘దుర్ముఖి’ అని హెడ్డింగ్ పెట్టారు. కానీ ‘ప్రభవో విభవః శుక్లః ప్రమోదో ధ ప్రజాపతిః’ అనే శ్లోక ఆధారంగా చూస్తే ‘నందనో విజయశ్చైవ జయో మన్మథ దుర్ముఖౌ’ అని వినియోగించారు. సంస్కృత వ్యాకరణం ప్రకారం ‘దుర్ముఖ’ శబ్దం నిశ్చయమే. ‘దుర్ముఖి’ శబ్దం తప్పు. ‘దుర్ముఖౌ’ అని అకార పుంలింగ శబ్దం ఉపయోగించారు. దుర్ముఖః దుర్ముఖౌ దుర్ముఖాః శబ్దం. అందువలన ‘దుర్ముఖి’ అని మరి ఎందుకు వచ్చింది అని శోధిస్తే తెలుగులో పదంగా వినియోగం చేశారు. మరి పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞములు, దేవాలయ విధి నిర్వహణలు మొదలగునవి చేయు సందర్భంలో సంకల్పం చెప్పవలెను కదా. అప్పుడు అందరూ సంకల్పంలో ‘దుర్ముఖ’ నామ సంవత్సరే అని చెప్పాలి. అందరికీ నానుడి ‘దుర్ముఖి’ అని వున్నది. మరి పంచాంగంలో ‘దుర్ముఖ’ అని రాస్తే వీరు ఎందుకు ఇలా రాశారా అని అనుమానం వ్యక్తం చేస్తారు. వక్ర భాష్యం చెబుతుంటారు. అందుకే ‘అందరితో పాటు నారాయణా!’ అనే సామెత ఆధారంగా మనవారు ఈవి విధానం అమలుచేశారు. ఇక సంకల్పాలు సంస్కృతంలో చెప్పాలి. తెలుగులో చెప్పరాదు. ఈ కారణంగా చేసి చూస్తే అన్ని సంకల్పాలలో ‘దుర్ముఖ’ వాడండి. ‘దుర్ముఖి’ వద్దు. తెలుగు పంచాంగమునకు ‘దుర్ముఖి’ తప్పులేదు.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు) కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336