S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నా ఓటు

కంటిచూపు పోయిందని ఏడ్వటానికి
కన్నీరు రావటంలేదు
కంటిలో ఓటు వెలుగు నక్షత్రమంటూ
అమావాస్య ఆకాశాన్ని తలపిస్తున్నారు
*
గాడిద కూత మైకుల మోత
నిద్రరాని రాత్రి
రాయి విసురాలనే ఉంది కాని
ఓటు చేతిలోకిచ్చారు
*
అడుగు అడుగు ఓడిపోయానని
చెప్పకుండా-
ఓటును నా నోటికి అంటించారు
ప్రజాస్వామ్య భ్రమల సాగరంలో
బ్రతుకు కొట్టుకపోయింది
*
గాడిదలను కీర్తించటానికి కవిత్వమెందుకూ?
కుక్కల మెచ్చుకోవటానికి సంగీతమెందుకూ?
ఆవులు లేవు
బ్రతుకీడ్చే ఎద్దులు లేవు
పాలిచ్చే బర్రెలు లేవు
నా యింట నిండిన కాలనాగుకు
పాలుపోస్తున్న నా ఓటు
*

సిహెచ్.మధు 9949486122