S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాతృస్వరూపం

జన్మతః ప్రాప్తించిన సబలత్వం
కాలేదు బాధ్యతల నిర్వహణకు అవరోధం!
తనవారి సేవలో
నిరంతర శ్రామికురాలు!
లేని శక్తిని బంధపాశాల పోషణకై
సమకూర్చుకుంటుంది!
వంశాంకుర తపస్సాధనలో
ప్రాణాధిక నిష్ఠాగరిష్ఠ!
ఆత్మగౌరవ ప్రతిష్ఠకు
నిలువెత్తు దర్పణం!
అవమాన దుర్మదాంధ
చరిత్రకు
చరమగీతం!
శ్రమ తానే.. శక్తీ తానే
బలం తానే.. బలహీనత తానే
విశ్వమానవాళికి ఊపిరులూదే
మాతృస్వరూప బ్రహ్మ తానే!
జీవకోటి విధి రాతకు
రూపశిల్పి తానే!!

-డేగల అనితాసూరి.. 9247500819