S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారతీయం

ప్రకృతికీ - మనిషికీ నడుమ వంతెన కట్టిన సంస్కృతితో
దివ్య ప్రవాహంగా కొనసాగుతున్న అపార భాషా సంపదతో
అందరికీ ఆదర్శప్రాయమైన సంస్కారాలు మర్యాదలతో
మానవాళిని తీర్చిదిద్దే అంశాలకు ఆలవాలమైన నిధులతో
అభివృద్ధికి దోహదమయ్యే సర్వకులమత వృత్తుల సమ ప్రాధాన్యతతో
తిరిగిచ్చే నివేదనకు నిర్మాణమైన పురాతన దేవాలయాలతో
సాహిత్య సంస్కృతీ సంపదలైన పురాణేతిహాస కావ్యాలతో
అటవీ సీమలను అధ్యయన కేంద్రాలుగా మలచిన అద్భుత దర్శన శక్తితో
మేధస్సునీ తపస్సునీ అంకిత మొనర్చిన మహర్షుల నేలతో
పరిసరాలను పవిత్రమొనర్చే వేద నాద ఘోషతో
స్వస్థతను సమకూర్చే యజ్ఞ ద్రవ్యాల హోమధూమాలతో
చక్కని సూర్యోదయాల చల్లని వెనె్నల రాత్రుల యోగమయ జీవనంతో
ఆర్షవిజ్ఞాన స్పృహను కల్గి ప్రకృతితో మమేకమయ్యే విశాల చింతనతో
దేశ క్షేమానికీ ధర్మానికీ దెబ్బ తగలని పాలనతో
భోగలాలసతకు దూరమై సంప్రదాయ శిఖరానికి చేరుకున్న మానవ జాతితో
ఉపాసనా విద్యకు యజ్ఞ శక్తికీ మాతృస్థానమైన
గోకులం గురుకులం గోపురం కలిపి భారతీయం.

- భాగవతరత్న’ డా.వీపూరి వేంకటేశ్వర్లు 9885585770