S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రపంచానికి డెడెండ్ ఈ-69

దట్టమైన దేవదారు చెట్లు..
చుట్టూ గుంపులు గుంపులుగా రెయిన్ డీర్లు..
తీరం అంతటా చేపలు పట్టే పెద్ద పెద్ద ట్రాలర్లు..
ఈ ప్రాంతం తర్వాత సముద్రమే..
ఇక్కడి ప్రకృతే మనిషికి పాఠం నేర్పిస్తుంది..
ఇక్కడికి వస్తే ప్రపంచయాత్ర ముగిసినట్లే..
అదే ఈ-69 రహదారి..
ప్రపంచానికే డెడెండ్ చెప్పుకునే రహదారి.. వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలోని మారుమూల ప్రాంతాన్ని మిగతా ప్రపంచంతో కలిపే జాతీయ రహదారి ఈ-69. ఈ మార్గం ఉత్తర ధ్రువానికి దగ్గరగా అంటే ప్రపంచం ముగిసే తుది చివర వరకూ వెళ్తుంది. భూమిపై అత్యంత ఉత్తరంగా చివరి వరకూ వెళ్లే హైవే ఇది మాత్రమే.. దీనిని ‘ఇంజనీరింగ్ అద్భుతం’ అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో ఓ హైవే నిర్మించాలని శతాబ్దం కంటే ముందు అంటే 1909లో అనుకున్నారు. కానీ ఈ-69 హైవే పూరె్తైంది మాత్రం 1999లోనే. ఇది నార్వేలోని ఓల్డర్ ఫ్యోర్డ్‌ను, నార్డ్‌కాప్ ప్రాంతంతో కలుపుతుంది. పశ్చిమ యూరప్ తీర ప్రాంతం నుంచి వెళ్లే ఈ-69ను వైరుధ్యాలను కలిపే రహదారిగా వర్ణిస్తారు. ఇది శతాబ్దాల నుండి ఈనాటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వేరువేరుగా ఉన్న ఎన్నో ప్రాంతాలను ఇప్పటి ఆధునిక యూరప్‌కు కలుపుతుంది. ఇక్కడున్న వారికి మిగతా ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా హాయిగా, ఆనందంగా జీవించగలరు. వారికి ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు కొయ్యతో చేసిన పడవలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రహదారిలో ప్రయాణించాలనుకునేవారికి ప్రకృతిలో ఉన్న రకరకాల రూపాలను చూసే అవకాశం లభిస్తుంది. దారి పొడవునా కనిపించే కొండలు మిమ్మల్ని తనలోకి తీసుకోడానికి ముందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది. కోతలకు గురైన ఈ మార్గం అంతా మంచు గడ్డకట్టి ఉంటుంది. ఎన్నో లోయలు, ఎతె్తైన గుట్టలు కనిపిస్తాయి. ఈ-69 హైవేలో కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా కారు నడపడం నిషిద్ధం. గుంపుగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. వందల కిలోమీటర్ల పాటు సముద్ర తీరంపైనే ఈ రహదారిపై వెళ్తుంటే పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయేమో అనే అనుభూతి కలుగుతుంది.
చలికాలం, పర్వతాలపై తీవ్రంగా మంచు కురుస్తుంటుంది. చెప్పాలంటే ఉత్తరార్థగోళం అంతా చలి దుప్పట్లో కప్పుకుపోతుంది. ఈ చలిగాలులన్నీ ఉత్తర ధ్రువం నుంచి వీస్తుంటాయి. భూమికి పూర్తిగా ఉత్తరంగా ధ్రువం దగ్గరకు వెళ్లడమంటే చంద్రుడి దగ్గరకు వెళ్లొచ్చినట్టే అనుకోవాలి. యూరప్ ఖండం ఉత్తర ధ్రువానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఖండం చివరి ప్రాంతం నార్వేలో ఉంటుంది. ఈ ప్రాంతంలో మిగతా ప్రపంచానికి దూరంగా శతాబ్దాల నుంచీ చాలామంది జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్నవారంతా సముద్రంలోని చేపలు, తిమింగలాలు, పీతలు వంటి వాటిని పట్టుకుని బతుకుతుంటారు.
చేపల వ్యాపారం
ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఉండడం అంత సులభం కాదు. కానీ వేసవి సమయంలో పర్యాటకుల కోసం నార్డ్‌కాప్ వైపు వచ్చే రహదారిలోని చివరి 14 కిలోమీటర్లు 1956లో నిర్మించారు. ఈ-69 ఎక్స్‌ప్రెస్ వే డెడెండ్ దగ్గర ఓ సొరంగం ఉంది. దాన్ని సముద్రంలో నిర్మించారు. ఈ-69 ఈ భాగాన్ని మెగెరోయా అనే ద్వీపాన్ని కలుపుతుంది. ఈ సొరంగాన్ని 1999లో నిర్మించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో మిగతా దేశాల మత్స్యకారులకు ఇక్కడ చేపల వేటకు అనుమతి లభించినప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు చేపలు పట్టడానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ జనాభా తగ్గిపోతూ వస్తోంది. చేపలు వేటాడే గుంపులు కూడా తగ్గిపోతున్నాయి. ఇక్కడ చేపలు పట్టేవారు కూడా వాటిని వెంటనే ఐస్‌లో ప్యాక్ చేసి చైనా పంపించేస్తున్నారు. అక్కడి నుంచి వాటిని మిగతా ప్రపంచమంతా సరఫరా అవుతాయి. నార్వేలోని ఈ ప్రాంతం నుంచి కింగ్ పీతలను ఉత్తర యూరప్‌లోనే అత్యధికంగా ఎగుమతి చేస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ రేవుల్లో చేపలు పట్టుకునే పడవల వరుసలో కనిపిస్తాయి. ఈ-69లో చేపల వేట జరిగే అత్యంత కీలకమైన రేవు హాన్గింస్వాంగ్. దీన్ని ప్రపంచంలో అత్యంత ఉత్తరంగా ఉన్న ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడ మనకు రేవులో రంగురంగుల పడవలు కనిపిస్తాయి. చలికాలంలో ఇక్కడ కాడ్ చేపను, వసంతంలో సాల్మన్, కోల్ ఫిష్, శరత్కాలంలో హేడాక్ అనే చేపను పడుతుంటారు.
ఈ-69 రహదారిని 1930లో అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఇక్కడ స్థిరపడిన వారి చేపల వ్యాపారం మందగించింది. మొదట్లో నాప్‌కార్డ్ ప్రజలకు మాత్రమే సముద్రంలో వేటాడటానికి హక్కులు ఉండేవి. కానీ 30వ దశకంలో ఈ హక్కులను మిగతావారికి కూడా ఇచ్చారు. ఆ తర్వాత 1934లో ఈ ప్రాంతం వారంతా హానింగ్స్‌వాంగ్ అనే గ్రామంలో సమావేశం అయ్యారు. రేవు యాజమాన్యాలు అక్కడి వరకూ వచ్చేందుకు ఒక రహదారిని ఏర్పాటుచేయాలని భావించాయి. రహదారితో పర్యాటకులు కూడా వస్తారని, ఆదాయం పెరుగుతుందని వారు అనుకున్నారు. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేసవికాలంలో సూర్యుడు అస్తమించడు. అలాగే చలికాలం అంతటా చీకటే ఉంటుంది. స్థానికులు మిగతావారికి దూరంగా ఉండడానే్న ఇష్టపడతారు. పెద్దనగరాలు వారికి నచ్చవు. కానీ ఈ హైవే ఇప్పుడు వారికి ఒక లైఫ్‌లైన్‌లా మారింది.
డెడెండ్ ఇదే..
దట్టమైన దేవదారు చెట్లు, తీరం అంతటా చేపలు పట్టే పెద్ద పెద్ద ట్రాలర్లు ఉండే నార్డ్‌కాప్ ఈ-69 చివర్లో ఉంటుంది. ఇక్కడ రెయిన్ డీర్లు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటారు. ఈ ప్రాంతం తర్వాత సముద్రమే కనిపిస్తుంది. ఈ డెడెండ్ దగ్గర భూమిలోపల ఒక చర్చి, మ్యూజియం కూడా ఉన్నాయి. ఒకప్పుడు హైవేపై ఇక్కడికి వచ్చినవారు అక్కడితో తమ ప్రపంచయాత్ర ముగిసిందని భావించేవారు. నార్డ్‌కాప్‌లో ప్రకృతే మనిషికి పాఠం నేర్పిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ-69 రహదారి ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని చెబుతుంది. చలికాలంలో గడ్డకట్టిన బంజరు భూముల్లో వేసవిలో వచ్చే మొలకలు కొత్తజీవితంపై ఎప్పటికీ ఆశలు వదులకోకూడదని నిరూపిస్తుంది.

- సన్నిధి