నింద
Published Monday, 3 June 2019ప్రస్తుతం మనం వున్న పరిస్థితులకి కారణాలు ఎన్నో.
ఈ పరిస్థితి ఇలా వుండటానికి మనం ఎందరినో నిందించే అవకాశం వుంది.
చదువుకునే పిల్లలు తల్లిదండ్రులని నిందించవచ్చు.
భర్త భార్యని నిందించవచ్చు.
భార్య భర్తని నిందించవచ్చు.
ఉద్యోగి తన పై అధికారిని నిందించవచ్చు.
రైతు ప్రకృతిని నిందించవచ్చు.
సేవకుడు యజమానిని నిందించవచ్చు.
ఓటరు ప్రభుత్వాన్ని నిందించవచ్చు.
సహజంగా ఇది అందరూ చేస్తున్న పనే.
దీనికి కారణం ఎదుటి వాళ్లని నిందించడం చాలా సులువు.
సులువైన పనిని అందరూ చేస్తారు.
విజయం సులువుగా రాదు.
కష్టపడితేనే వస్తుంది.
సులువైన అడ్డదారిలో ప్రయాణం చేసే బదులు కష్టమైనా విజయం సాధించే దారిలో నడవడం మంచిదేమో.
మనం ఉన్న ఈ పరిస్థితి కారణం ఎవరైనా మనం బాధితులం కాకూడదు.
విజేతలం కావాలని అనుకోవాలి.
సులువైన పనిలో మజా వుండదు.
ఆనందం వుండదు.
కష్టమైన పనిలో విజయం సాధిస్తే ఆ మజానే వేరు.
ప్రయత్నించి చూడండి.