S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెద్ద, చిన్న పనులు

చిన్న పనులని మనం నిర్లక్ష్యం చేయకూడదు.
చిన్న విజయాలు మన కంటికి ఆనవు.
కానీ చిన్న పనులే పెద్ద విషయాలకి దారి తీస్తాయి.
రోజు ఒక పేజీ, రెండు పేజీలు చదవడం చాలా చిన్న పని. కానీ అలా నిలకడగా రోజూ చదువుతూ పోతే ఓ అధ్యాయం పూర్తవుతుంది. ఒక పేజీ చదివితే పెద్దగా ప్రభావం కన్పించకపోవచ్చు. కానీ ఓ అధ్యాయం చదివినప్పుడు దాని ప్రభావం తప్పక మన మీద ఉంటుంది.
ఒకరోజు నడిస్తే దాని ప్రభావం ఏమీ వుండదు. కానీ ఓ నెలరోజుల పాటు నడిస్తే ఫలితం కన్పిస్తుంది.
చిన్న విషయాలు
చిన్న పనులు
చిన్న చిరునవ్వు
ఓ చిన్న ఆశావహ దృక్పథం
ఎన్నో పెద్ద పనుల వైపు మనలని నడిపిస్తుంది.
అయితే అందుకు కావాల్సింది
ఆ పనులు
నిలకడగా
నిరంతరంగా
చేస్తూ వుండాలి.
అవి చిన్న పనులు కావొచ్చు.
కానీ నిరంతరం చేస్తూ వుండాలి.
చిన్న పనులని అనే బదులుగా
పెద్దచిన్న పనులంటే బాగుంటుందేమో.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001