S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవుడు దేవుడే!

మనిషి, యంత్రం ఒకేలాంటివి అంటారు
ద్విచక్ర వాహనానే్న తీసుకుంటే
ద్విపాద జీవి కడుపు లాంటిదే ఆయిల్ ట్యాంక్
ఇంజన్ గుండె, హేండిల్ చేతులు, చక్రాలు కాళ్లు
హారన్ గొంతు, లైట్లు కళ్లు
భాగాలన్నీ నరుడి అవయవాల ప్రతిమానాలే
కానీ, ఒకటే తేడా అదే మెదడు
మానవ సృజనజన్య పరికరాలు పరాధీనాలు
వాటిని ఎవరో ఒకరు నడపాల్సిందే
కానీ, భగవంతుడు సృష్టించినవి స్వయం ప్రవర్తితాలు
తరువులు లతలు స్వీయ కుసుమితాలు
కోయిల గానం స్వతస్సిద్ధము
నెమలి నాట్యం స్వాభావికము
లేడి పరుగులు అనన్య ప్రేరితాలు
ఎగిరే గువ్వ రెపరెపలు అనధీన సంధానములు
చేప ఈతలు స్వవశ సంఘటితాలు
దేవుడు చేసిన మనిషి అప్రమేయుడు
దైవ పరికల్పనా విధానాలు స్వేచ్ఛా సమాలోచనాలు
అవి తమంతట తాము నడుస్తాయ్
మనిషి మలచిన యంత్రం నిర్జీవ సాధనం
పరమాత్ముడు చేసిన మనిషి సజీవ చైతన్యం
దేవుడు దేవుడే!

-చిరమన వెంకట రమణయ్య 9441380336