S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ రోజు కోసం..

పేరుకుపోతోంది
పరాయితనం
సొంత రక్తంలో!
అంబరాన్ని
చుంబిస్తున్న స్వార్థం
క్షణక్షణం
బలప్రదర్శనకి
సన్నద్ధవౌతూనే ఉంది
ధన నామజపంతో
మోక్షసాధనకై వెంపర్లాడుతున్న
ప్రజానీకపు పరమావధి
మూల్గులేనన్న సత్యం
గ్రహించకపోవడం శోచనీయం
పేగుబంధాలు
రక్త సంబంధాలు
స్నేహబంధావ్యాలు
ఇవన్నీ సహజత్వానికి
ఎప్పుడూ పదామడల దూరమే!
కుంచిత మనస్తత్వాలతో
వెలకట్టలేని జీవితాలను
తమకుతామే వెలివేసుకుంటున్న
అభాగ్యులకు నా ఆవేదన
అర్థమయ్యే రోజున కదా
నేను గెలిచేది?
ఆ రోజు కోసం!!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262