S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వసంత లక్ష్మి

వసంత గానం చేస్తున్న వసంత లక్ష్మి ముఖచిత్రం చాలా బాగుంది. ఆంగ్ల ఆంధ్ర సంవత్సరాదుల భేదం చెప్తూ గత సంవత్సర వైఫల్యాలు, నూతన సంవత్సర తీర్మానాలను సమీక్షించుకోవలసిన ఆవశ్యకతను ఓ చిన్న మాటగా బాగగా వివరించారు. గోపాలంగారి ‘కళ - కలకల’ గురించి మాటల గలగల విని (చూసి, చదివి) కిలకిల నవ్వుకున్నాం. అనూహ్య మలుపులతో క్రైం కథ బాగుంది. అబద్ధం చెప్పి హంతకుడిని ట్రాప్ చేసిన ముసలమ్మని మెచ్చుకోవలసిందే! పాట పాడేది ఆడ కోకిల కాదు మగ కోకిల అన్నారు. అలాగే నాట్యం చేసేది ఆడ నెమలి కాదు- మగ నెమలి! అందువల్ల నాట్య మయూరి కాదు నాట్య మయూర(0) అనాలి!
-పి.శాండిల్య (కాకినాడ)
ఉగాది
ముందే వచ్చిన ఉగాదిలాగ ఆదివారం అనుబంధం మమ్మల్ని ఎంతగానో అలరించింది. ఖర్జూరం, కొబ్బరి నుండి కూడా బెల్లం తయారుచేస్తారని, మిరప - కాయ కాదు, పండు అని, క్షీరదాల్లో మనిషి తప్ప మరే జీవి మిరప ముట్టదని తెలుసుకొని ‘హా’శ్చర్యపోయాం. చింతపండుతో స్వీట్లా? భలే! మనం కోల్పోయినవే స్వర్గాలు అంటూ డైరీ గురించి ప్రస్తావించి చెప్పిన ‘సండే గీత’ అలరించింది. వచ్చేది కొద్ది జీతమే అయినా.. ఆ రోజుల్లోనే హాయిగా ఉండేది. కాస్తో కూస్తో మిగిలేది. మరి ఇప్పుడో? నిజమే. స్వర్గం చేజారిపోయింది.
-ఆర్.సత్య (కరప)
ఎన్ని వింతలో!
సీజన్‌ని బట్టి ముక్కు రంగులు మార్చుకునే చిలుకలు కాని సముద్రపు చిలుకలు పఫిన్స్, ఆహారాన్ని కడిగి తినే మంచు కోతుల గురించి చదివి ఆశ్చర్యపోయాం. ప్రకృతిలో ఎన్ని వింతలో కదా! అనగనగా ఓ కథ ఉంది. వినే నాథుడే లేడు! అని చెప్పిన ‘సండే గీత’ హృదయాల్ని కలచివేసింది. ఈనాటి పిల్లలే కాదు పెద్దలు కూడా ఎవరి లోకంలో వారు ఉండిపోతున్నారు. ఏం చేస్తాం? ఇది ఒంటరి ప్రపంచం.
-కె.ప్రవీణ్ (కాకినాడ)
జాడలేని జలం
‘ఈ వారం స్పెషల్’లో ‘జాడలేని జలం’ అంటూ నీటి కోసం పడే పాట్లను గూర్చి చక్కగా తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరంలోనే ‘జల దినోత్సవం’ సందర్భంగా ‘జలం కోసం.. జలం చేత’ అనే నినాదంతో ముందుకు సాగే ప్రయత్నం చాలా బాగుంది. ‘సండే గీత’ ‘అనగనగా..’ అంటూ పూర్వకాలంలో పెద్దలు చిన్న పిల్లలకు మంచిమంచి నీతివంతమైన కథలు చెప్పేవారు. ప్రస్తుత కాలంలో కథలు చెప్పేవారు లేరు. వినేవారు అంతకంటే లేరు. అంతా కంప్యూటరే అని చక్కగా తెలియజేశారు. ఇది యథార్థం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
కానుక
‘ఉగాది వసంత గానం నవ జీవనయానం’ పాఠకులకు ఉగాది కానుక. ఉగాది పేరెలా వచ్చింది? పరమాత్మకు యుగానికి సంబంధం, ఉగాదిగల విశేషార్థాలు సవివరంగా తెలుసుకున్నాం. సకల జీవులపై వసంత రుతువు ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో గ్రహించాం. ఉగాది రోజున పాటించాల్సిన వివిధ నియమాల గురించి చక్కగా వివరించారు. పంచాంగ శ్రవణం వల్ల కలిగే శుభ ఫలితాలు, ఉగాది పచ్చడిలోని ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం. పండుగ చేసుకున్నాం.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
లోకాభిరామమ్
‘పాత-కొత్త’ శీర్షికన గోపాలంగారి వ్యాసాన్ని చదివి ఆశ్చర్యపోయాం. ఆయన రాసింది అక్షర సత్యం. నేను ఒకసారి ఓ దేవాలయానికి వెళ్లి హారతి పళ్లెంలో ఒక రూపాయి నాణెం వేశాను. ఆ పూజారి కోపగించుకొని.. ఆ నాణెన్ని తిరిగి ఇచ్చేశాడు. నాకు అర్థం కాలేదు. మీ వ్యాసాన్ని చదివింత్తర్వాత ఆ పూజారి భావం అర్థమైంది. ‘చప్పుడు కాకండా వేయటం అంటే ఇదే మరి.’
-కైప నాగరాజు (అనంతపురం)
టుస్పాడ్ మ్యూజియం
ఆదివారం అనుబంధంలో ‘మేడమ్ మేరీ టుస్సాడ్’ మ్యూజియంలో తయారైన సినీ నటులు, అగ్రనేతలు, ప్రఖ్యాత క్రీడాకారుల బొమ్మలు చూస్తే.. ఆ కళాకారిణి నైపుణ్యం ఎంతటిదో అర్థమవుతుంది. బొమ్మకు జీవకళ తెచ్చే శక్తి బ్రహ్మ తరువాత శిల్పికే ఉంటుంది. టుస్సాడ్‌ను మహా శిల్పిగా పేర్కొనవచ్చు. ‘మీకు తెలుసా?’ శీర్షికన అందిస్తున్న సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వారం తెల్ల ఏనుగులు, చారల వరాహం, నీటి ఏనుగులు చూస్తే ఆశ్చర్యం వేసింది. ప్రపంచంలోని అన్ని జంతువులను, వాటి స్వభావ లక్షణాలను చక్కగా అందజేస్తున్నారు.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
విలన్స్..
మల్లాదిగారి ‘విలన్స్, స్కౌన్‌డ్రల్స్...’ కథలు చదువుతూంటే మమ్మల్ని మేమే మైమరచిపోతున్నాం. క్రైం కథల్ని కూడా ఇంత అందంగా రాయ్యొచ్చునా? అనిపించింది. ‘పదకొండేళ్ల పగ’ మమ్మల్ని ఎంతగానో అలరించింది. ప్రతి కథ దేనికదే వెరైటీగా సాగుతోంది. అలాగే ‘అక్షరాలోచనాలు’లో ‘వాసంత విలాసం’ కవిత బాగుంది. ‘మరీ మరీ మననం’ అంటూ నారాయణరెడ్డిగారి కవిత మరింత బాగుంది.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)