S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెట్టుబడి

కొన్ని పెట్టుబడుల విలువ మనకు తెలియదు. దాన్ని పెట్టుబడిగా చాలామంది భావించరు. దాన్ని ఖర్చుగా చాలామంది భావిస్తారు. మరి కొంతమంది వృథా ఖర్చుగా భావిస్తారు.
అలాంటిది పుస్తకాలు కొనడం.
మనం కొన్న పుస్తకాలు పెట్టుబడిగా మారాలంటే మంచి పుస్తకాలు కొనాలి. కొనడమే కాదు. వాటిని చదవడం
చదవడం వల్ల మన జీవనశైలి మారే అవకాశం వుంది. మనకు కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం వుంది.
పుస్తకాలు మరీ ఖరీదుగా ఏమీ వుండవు.
తెలుగు పుస్తకాలు మరీ తక్కువ ధరలో దొరుకుతాయి.
చదవడానికి ఖర్చు లేదు
కొనే స్తోమత లేకపోతే లైబ్రరీలకు వెళ్లి చదవవచ్చు.
చదవడం వల్ల ఉపయోగాలు ఎన్నో.
ప్రతి పుస్తకం వల్ల ఇలాంటి ఉపయోగాలు వుంటాయని చెప్పలేం. మనం పుస్తకాలు చదువుతూ వుంటే ఏదో ఒక పుస్తకం వల్ల మనకు ఉపయోగాలు లభిస్తాయి.
ఏదో ఒక పుస్తకంలో మనకు ఏదో ఒక ధ్వని లభించవచ్చు. అది మన జీవితానే్న మార్చవచ్చు.
ఆదివారం ఫుట్‌పాత్‌ల మీద లెక్కలేనన్ని పుస్తకాలు మనకు కన్పిస్తాయి.
పలకరిస్తాయి.
ఓ తెలుగు కవి ఇలా అంటాడు.
‘చాన్నాళ్లకి
కలిసిన స్నేహితుల్లా
ఫుట్‌పాత్ మీది పుస్తకాలు
పలకరిస్తాయి
ఆ పలకరింపుల్లో
ఎన్నో అనుభూతులు’
ఒక పుస్తకం చదవడం వల్ల ఒక కొత్త ఆలోచన వస్తే అంతకు మించి గొప్ప పెట్టుబడి మరేమి వుంటుంది?
అందుకే-
మంచి పుస్తకాలు కొనండి.
కొన్న పుస్తకం తప్పక చదవండి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001