S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫుట్‌పాత్ పుస్తకం

హైదరాబాద్‌లో సంవత్సరానికి ఒకసారి జరిపే పుస్తక ప్రదర్శన వచ్చేసింది. పుస్తకాలు ఇష్టపడే వ్యక్తులకి డిసెంబర్ చివరి వారం ఓ పండుగలా అన్పిస్తుంది. చాలా పుస్తకాలని, పుస్తకాల షాపులని ఒక్క దగ్గర చూసే అవకాశం దీనివల్ల లభిస్తుంది. ఇలాంటి ప్రదర్శనని మిగతా నగరాల్లో కూడా జరుపుతున్నారు. అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా జరిపితే బాగుంటుందేమో. ఎందుకంటే పుస్తకాలు కొనని వ్యక్తులు కూడా ఈ ప్రదర్శనకు వస్తారు. వచ్చిన వ్యక్తులు ఏదో ఒక పుస్తకం కొనుక్కుంటారు. పుస్తకాలు చదివే అభిరుచి ఇట్లా పెరిగే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం జరిగే పుస్తకాల ప్రదర్శనతో నిమిత్తం లేకుండా హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి ఆదివారం అబిడ్స్, సుల్తాన్‌బజార్ లాంటి ప్రదేశాల్లో పుస్తక ప్రదర్శన క్రమం తప్పకుండా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇతరులు చదివిన పుస్తకాలు ఎక్కువగా దొరుకుతాయి. వాటితోపాటూ కొత్త పుస్తకాలు కూడా దొరుకుతాయి. అయితే అవి - దొంగతనంగా ముద్రించిన పుస్తకాలు. మార్కెట్లో వాటి ధర ఎక్కువగా ఉంటుంది కనుక చలామంది ఈ పైరేటెడ్ పుస్తకాలని కొంటూ ఉంటారు.
ఈ పుస్తకాల షాపుల వాళ్లకి పుస్తకాల విలువ తెలుసు. రచయితల గురించి కూడా తెలుసు. వాళ్లని చూస్తే ఎక్కువగా చదువుకున్న వ్యక్తుల మాదిరిగా అన్పించరు. కానీ కొంతమంది పుస్తకాల్లోని సారాంశాన్ని కూడా చెప్పి మనం వాటిని కొనే విధంగా చేస్తారు.
పుస్తకాలే కాదు. రకరకాల పత్రికలు కూడా అక్కడ కన్పిస్తాయి. మనల్ని ఆకర్షిస్తాయి.
గొప్ప వాళ్లు చదువుకొని వదిలేసిన పుస్తకాలు అక్కడ దర్శనమిస్తాయి. గొప్పవాళ్లకి, పెద్దవాళ్లకి గౌరవంతో ఇచ్చిన పుస్తకాలు కూడా అక్కడ కన్పిస్తాయి.
అతని దగ్గర అయిపోయిన పుస్తకాలు కూడా ఆ రచయితకి అక్కడ కన్పిస్తాయి. ఫుట్‌పాత్ పుస్తకం గురించి ఓ తెలుగు కవి ఇలా అంటాడు-
‘చాన్నాళ్లకి కలిసిన స్నేహితుల్లా
ఫుట్‌పాట్ మీది పుస్తకాలు పలకరిస్తాయి
ఆ పలకరింపుల్లో ఎన్నో అనుభూతులు
కొన్ని పుస్తకాల హృదయాలు
తెల్లగా నవ్వుతూ కన్పిస్తే
మరికొన్ని పుస్తకాల హృదయాలు
ఎవరికో ఆదరంగా
ఇచ్చిన పేర్లు నింపుకొని
చూడు-
వీళ్లు నాకిచ్చిన గౌరవం అంటూ
హృదయ ఘోష విన్పిస్తాయి’
ఆ విధంగా కన్పించినా బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరు చదివే అవకాశం దానివల్ల లభిస్తుంది కదా?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001