S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టోపీ...హిస్టరీ

టోపీ... అందానికి, రక్షణకు, హోదాకు, స్టైల్‌కు సంకేతంగా చెప్పుకునేవారు. టోపీ వాడకం చాలా పురాతన సంప్రదాయం. 3000 సంవత్సరాల క్రితంనుంచే వీటిని వాడేవారు. ఇటలీ-ఆస్ట్రేలియాల మధ్య పురాతత్వ తవ్వకాల్లో దొరికిన ఓ శిల్పం (వెనస్ ఆఫ్ బ్రస్సెమ్‌పౌయ్)లో ఇద్దరు మహిళలు టోపీ పెట్టుకున్నట్లుంటారు. ఆ శిల్పం కనీసం 25వేల సంవత్సరాల క్రితందిగా భావిస్తున్నారు. అంటే అప్పటికే వీటి వాడకం ఉందని చెప్పుకోవచ్చు. గాంధీ టోపీ, జిన్నా టోపీ, కౌబాయ్, బేస్‌బాల్, క్రికెట్, ట్రెల్‌బీ, ట్రాపర్, బౌలర్, బల్‌మోడల్ ఇలా రకరకాల టోపీలు ఉన్నాయి. పోప్ ధరించే టోపీకి ప్రత్యేకమైన పేరుంది. అలాగే చెఫ్‌లు వాడేవి కొన్ని, మెజీషియన్‌లు వాడేవి వేరు. టోపీలకు ఉన్న పేర్లు, మోడల్స్, రూపురేఖలు అన్నీఇన్నీకావు. టోపీల తయారీలో బ్రిటన్‌కు చెందిన రెండు కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు, డబ్బు సంపాదించాయి. అన్నట్లు అబ్రహం లింకన్ వాడిన టోపీ మోడల్‌కు మంచి క్రేజ్ ఉండేది. నిక్సన్ తరువాత టోపీని మరే అధ్యక్షుడూ (అమెరికా) వాడటం లేదు.

ఎస్.కె.కె.రవళి