S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇది వెక్కిరింపుకాదు..శుభాకాంక్ష

నాలుకను ఇలా బయటకు పెట్టి నవ్వితే మనదగ్గర వెక్కిరించినట్లు, లేదా చిలిపిగా అల్లరి చేస్తున్నట్లు చెప్పుకుంటాం కదా. కొన్ని దేశాల్లో ఇలా నాలికతో వెక్కిరిస్తే...ఇక వారిమధ్య స్నేహబంధం చెరిగిపోయినట్లేనని భావిస్తారు. టిబెట్‌లో మాత్రం ఇలా చేస్తే అభినందించినట్లు, శుభాకాంక్షలు చెప్పినట్లు భావిస్తారు. మంచిని కోరుతున్నట్లు చెప్పడానికి అక్కడ ఇలా నాలుకబయటపెట్టి నవ్వుతారు. ఇది టిబెట్ సంప్రదాయం. అన్నట్లు మనిషి నాలుకకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి తెలుసా. మనిషి వేలిముద్రల్లాగానే నాలుకలూ ఎవరికివారికి భిన్నంగా ఉంటాయి. రూపు, ముద్ర ఏ ఒక్కరికీ ఒక్కలా ఉండవు. నాలుకపై లాలాజలం లేకపోతే మనిషికి రుచి తెలీదు. తడిగా ఉన్నప్పుడే రుచిమొగ్గలు పనిచేస్తాయి. అస్తిపంజరంతో సంబంధం లేకుండా మనిషి శరీరంలో పనిచేసే కండరం నాలుక మాత్రమే. పదివేల రుచిమొగ్గలుండే మనిషి నాలుకలో మూడొంతులు కన్పించేట్టు, మిగతా ఒకభాగం లోపలివైపు ఉంటుంది. రుచిమొగ్గల్లో 8000 రుచిని గ్రహిస్తే, 2వేలు మెదడుకు ఆ విషయాన్ని చేరవేస్తాయి. నాలుక రంగుని బట్టి మనిషి ఆరోగ్యాన్ని అంచనావేయొచ్చు. నాలుకలో ఉండే ఎనిమిది కండరాలు అది ఎటుపడితే అటు కదలడానికి ఉపయోగపడతాయి. పళ్లను శుభ్రం చేసే నాలుకపై లక్షల సంఖ్యలో బాక్టీరియా ఉంటుంది. మగవారిలోకన్నా ఆడవారి నాలుక కాస్త చిన్నదిగా ఉంటుంది. ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద నాలుక ఉన్న జీవి...నీలి తిమింగలం. దీని నాలుక ఓ పెద్దఏనుగంత ఉంటుంది. బరువుకూడా పదిపదిహేను టన్నులకు పైగానే ఉంటుంది.

ఎస్.కె.కె.రవళి