S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాటకు పల్లవి

మనోహరమైన ఆ పాటలు వింటూంటే మధురమైన మరో లోకంలో తేలిపోతూంటాం. కోకిలమ్మలు.. చిగురాకుల తోరణాలు.. సన్నాయిలా సాగే చిరుగాలి... వసంతం.. వనంలో సందడి.. పూల సోయగాలు, తలంబ్రాలు.. పున్నమి.. తొలి రేయి.. ఈ దృశ్యాలన్నీ మన కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. తరాలు గడిచినా ఈ పాటలోని స్వర మాధుర్యం నిత్యనూతనం.. ఇంతటి కమ్మనైన గీతాల్ని ఆలపించిన ‘గానకోకిల’ గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.. కొన్ని తరాల పాటు శ్రోతలను ఉర్రూతలూగించిన ఆమె కొత్తతరం గాయకులకు స్ఫూర్తి ప్రదాత. ఇలా ఎంతో చక్కటి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
లోకాభిరామమ్
దేవుళ్లకు గడ్డం, మీసాలు ఎందుకు ఉండవు? అన్నది వేధించే ప్రశ్న. గుర్రాలను, కుక్కలను అందరమూ అదే పనిగా చూస్తూంటాము. వాటి బొమ్మ గీయ పూనుకుంటే, ఏ కొంచెం తేడా వచ్చినా అందరూ గోల చేస్తారు. భీమునికి, రావణాసురునికి మీసాలు పెడతారు. దుర్యోధనునికీ మీసాలుంటాయి. గడ్డం మాత్రం ఉండదు. సినిమాలో మాత్రం ధర్మజునికి గడ్డం పెడతారు.. ఇలా సాగిన ‘మీసాఖ్యానం’ చదువుతూన్నంత సేపు నవ్వు ఆపుకోలేక పోయాం. స్వీయ అనుభవాల సారాన్ని కళ్లకు కట్టినట్లు అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాగే ప్రతి వారం ప్రముఖ శాస్తవ్రేత్తలను గురించి విశేషాలు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు.
-డి.వి.తులసి (విజయవాడ)
కళ-కలకల
‘లోకాభిరామమ్’లో ‘కళ-కలకల’ వ్యాసం చదువుతూంటే నాకథలాగే ఉంది. రవివర్మ వేసిన బొమ్మల కేలండర్ ఇతరుల వద్ద చూసి బాగా నచ్చితే వారిని అడిగి తీసుకున్నాను. 2,3 సం.లు చాలా జాగ్రత్తగా ఇంటి గోడ వేలాడుతూ మనోల్లాసాన్ని కలిగించింది. ఆ తర్వాత్తర్వాత అది ఎక్కడ మిస్సయిందో అంతుచిక్కలేదు. ఇలాగే ప్రతి ఇంట్లోనూ ఏదో సందర్భంలో ఇలాంటి ‘కేలండర్’ ప్రస్తావన వచ్చే ఉంటుంది.
-మరకా సూర్యనారాయణరెడ్డి (పులివెందుల)
విలువైన వ్యాసం
గంధర్వ గాయని, సినీ సంగీత ప్రపంచానికే గర్వకారణమైన పి.సుశీలమ్మకు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన సందర్భాన్ని పురస్కరించుకొని అందించిన అమూల్యమైన వ్యాసం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంది. లాలి, జోల, భక్తి, వీణ, మధుర గేయాలతో మమ్మల్ని అలరించిన ఈ గాయని నేపథ్యం, సినీ రంగ ప్రవేశం, చరిత్ర, వీరు పాడిన విలువైన ఎన్నో గీతాల గురించి సవివరంగా తెలిపినందుకు ధన్యవాదాలు. భారతదేశంలోని గొప్ప గాయనీమణులు ఇద్దరిలో ఒకరు మన తెలుగు గాయని కావడం మన అదృష్టం. ఇంతటి చక్కటి, విలువైన ఆర్టికల్‌ని అందించినందుకు కృతజ్ఞతలు.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
ప్రత్యేక కథనం
నవజీవన యానం ప్రత్యేక కథనంలో ‘ఉగాది’ పండుగ ప్రాశస్త్యాన్ని చాలా చక్కగా వివరించారు. కాలం యొక్క నిజ స్వరూపం, ఆదిశంకరుల హితబోధ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. జీవన ప్రయాణంలో తోటి మానవులను ఏకాత్మతా భావంతో దర్శించి, మానవ సేవలో మాధవసేవను దర్శించి, సర్వజీవ, మానవ సౌభ్రాతృత్వ భావనతో, పరమేశ్వరుని ఆరాధనలో కాలం గడపాలన్న రచయిత సందేశం అద్భుతం, ఆచరణీయం.
-సి.పి. (కోటివీధి)
గీతాసారం
కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ‘గీతాసారం’ మాకెంతో నచ్చింది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి దుఃఖ సముద్రాన్ని సంతోషంగా ఈదటం ఎలా అనే పుస్తకం రాసే అర్హత లేదు. భగవద్గీత ఉండగా అటువంటి పుస్తకం రాయాల్సిన అవసరం లేదన్న జ్ఞానోదయం కలగడం, శోక రాహిత్యమూ, ఆనంద ప్రాప్తియేగా గీత ప్రధాన లక్ష్యం.. అన్న మాటలు మా గుండెల్లో నాటుకొన్నాయి. అలాగే ‘అవీ-ఇవీ’ శీర్షిక ‘వినదగు’ బాగుంటున్నాయి.
-గుండు రమణయ్య (పెద్దాపూర్, కరీంనగర్)
నవజీవనం
యుగాదులు వస్తూ పోతూ తిరిగి అవే అరవై ఏళ్ల కొక్కసారి పునర్దర్శనమిస్తూంటాయి. ఈ ప్రవాహంలో కాలం దొర్లిపోతూంటుంది. కాలం అపరిమితమైనది. ఇందులో జీవితం చాలా పరిమితమైనది. ఈ చిన్ని జీవిత కాలంలో ఎన్ని నేర్చుకున్నా అది సింధువులో బిందువుకన్నా తక్కువే. కక్షలతో, స్పర్ధలతో వెళ్లబుచ్చే జీవితం వ్యర్థం. మనిషి పోయినా చేసిన మంచి పనులనే భావితరాల వారు పాటించినా, లేక గుర్తు చేసుకున్నా ఆ మనిషి పుట్టుకకో విలువ కలుగుతుంది. ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా ఆచరణలో పెట్టకపోవడానికి కారణం మానసిక దౌర్బల్యమే. మొక్కవోని ధైర్యం, పట్టుదలతో నిస్వార్థ జీవితాన్ని గడుపుతూ నవజీవనానికి నాంది పలుకగలమని ప్రతినబూనడమే దుర్ముఖ నామ సంవత్సరానికి ఆహ్వానం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
మీకు తెలుసా?
‘మీకు తెలుసా?’ శీర్షికన అనేక విషయాలు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఎస్‌ఎంఎస్‌ల పేరిట అర్థంపర్థం లేని సమాచారం పంపుతూ తమదేకాక ఇతరుల విలువైన కాలాన్ని వృధా చేసేవారిపై ‘సండే గీత’ చక్కని వాతలు పెట్టింది.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)