S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వినిపించని రాగాలు

ఆనందించాలంటే కవిత్వాన్ని
అర్థం చేసుకోవాలి కవితాత్మను
గుప్పించాలంటే వర్ణనలను
ఆవిష్కరించాలి మనసును...

చెట్టుకు నీరు పోయని వ్యక్తికి
రాలిన పువ్వు మీదా ఏం జాలి?
పక్షులకు ధాన్యం చల్లని వాడికి
ఈకల మెత్తదనం ఎట్లా తెలుస్తుంది...

ఐమాక్స్‌లు చూసి - హైటెక్‌లో జీవిస్తూ
అబ్బురపడే నవ నాగరికతకు
బురదలోని గుడిసెల పునాది
ఎంత లోతుందో అవగతవౌతుందా?

నా బాధను అర్థం చేసుకోని వాడికి
పౌరాణికుడిగా ఎంత పేరొస్తేనేం...
నా భాషను స్వప్నంలోనూ చదవని వాడికి
విశ్వ సాహిత్య గాథలు ఎన్ని తెలిస్తేనేం...

గుండెను గుండెతో ముడిపెడదామని చూస్తుంటే
రక్తం పాదరసమై జారిపోతున్నది.
భావాలను స్వభావాలతో మెలిపెట్టాలంటే
పీట ముళ్లు పడి ఉరిత్రాడవుతున్నది.

ఒక లిప్తకాలం స్థిరమైన మైత్రి కోసం
గూళ్లు వదలిన పక్షుల్లాగా
ఎంతకాలం ఈ విహాయస విహారం
ఎదురుతెన్నుల ఆప్తనదీ తీరం.

-్భండారు ఉమామహేశ్వరరావు