S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనమూ: శనిగ్రహమూ

నాకూ మీకూ మధ్య దూరం ఎంతయినా కావచ్చు.. సాన్నిహిత్యం ఎంతయినా కావొచ్చు.. ఇలా దూరం, సాన్నిహిత్యాలే కాక అనేక అంశాలు వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా సంయోగం చెంది మనపై ప్రభావం చూపుతుంటాయి. నాపైన మీ ప్రభావం ఉన్నట్టుగానే, మనపై భూగోళ ప్రభావం, భూగోళంపై ఇతర గోళాల ప్రభావమూ ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.. నాపైన మీ ప్రభావం, మీపైన నా ప్రభావం ఉన్నట్టుగానే మన కుటుంబ సభ్యుల, స్నేహితుల, సన్నిహితుల, సామాజికుల ప్రభావమూ తప్పటంలేదు. అలాగే చుట్టుపక్కల పరిసరాల ప్రభావం, వాతావరణ ప్రభావం, పగలూ రాత్రీ ప్రభావం, నిప్పూ నీరూ ప్రభావం, ఎండా వానా ప్రభావం.. ఇలా ఎనె్నన్నో ప్రభావాలు మనల్ని పురోగమింప చేస్తుంటాయి, తిరోగమింప చేస్తుంటాయి. కొన్ని మంచి ఫలితాలను అందిస్తుండగా, ఇంకొన్ని చెడు ఫలితాలను అందిస్తుంటే, మరికొన్ని తటస్థ ఫలితాలను అందిస్తున్నాయి. ఇక వాటితో మనకున్న అనుబంధాన్ని బట్టి, వాటిపై మనకున్న వ్యామోహాన్ని బట్టి కూడా వాటి ప్రభావాలు మనపై ఉంటున్నాయి.
భౌగోళికంగా, ప్రాపంచికం మన మధ్య దూరాలు కొన్ని వేల మైళ్లు మాత్రమే. అయినా మన చిరు రూపంపై, మన జీవన విధానంపై ఎన్ని రకాల ప్రభావ దాడులు.. అయినా ‘పొత్తు’ కుదుర్చుకుని జీవన యాత్ర సాగిస్తూనే ఉన్నాం. ఇలాగే మన ఆత్మ అస్తిత్వాన్ని ఖగోళ యాత్రతోను సార్థకం చేసుకోవాలి. ఈ యాత్రా పరిణామంలో మనం భౌగోళిక ప్రకృతితోపాటు ఖగోళ ప్రకృతితోను స్నేహించవలసిందే.. సంయోగించవలసిందే.. సన్నిహితం కావలసిందే.. సాన్నిహిత్యంతో జీవించవలసిందే.. జీవన యోగాన్ని ‘యోగజీవనం’ చేసుకోవలసిందే! ‘ఆత్మ సంపన్నం’ చేసుకోవలసిందే!!
యోగ సాధనతో భౌతిక దూరాలను అధిగమిస్తూ ఖగోళానికి చేరువ కావలసిందే.. ఖగోళంలోని గ్రహాల ప్రభావాలతో ఈ దేహం ‘కొంగ్రొత్త’గా పరిణమిస్తూ మన ఆత్మను ఆ ఖగోళంలో ‘ఆది’ తత్వంతో సంయోగింప చేయాల్సిందే. సూర్యుడు మనల్ని భగ్గుమనిపిస్తాడనో, చంద్రుడు పరిణమిస్తూ మన ఆత్మను ఆ ఖగోళంలో ‘ఆది’ తత్వంతో సంయోగింప చేయాల్సిందే. సూర్యుడు మనల్ని భగ్గుమనిపిస్తాడనో, చంద్రుడు మన జీవితాన్ని చల్లబరుస్తాడనో, శని మనల్ని పట్టి పీడిస్తాడనో భయపడుతూ, వ్యాకులపడుతూ పరితపించటానికి కాదు మనం ఈ జన్మకు వచ్చింది? మన ‘మానవ అవతార రహస్యం’ మట్టిని, మింటిని ‘ఏకం’ చేయటం. భూగోళాన్ని, ఖగోళాన్ని ఒక్కటి చేయటం. వాన వస్తుందని ముందు జాగ్రత్తలు తీసుకోవటం లేదూ.. ‘గొడుగు’ క్రిందికి చేరితే ఎండనూ, వాననూ సమానంగా ఎదుర్కొంటూ మన పనులను చక్కబెట్టుకోవచ్చు.. ‘గురువు’ అండ కూడా గొడుగు లాంటిదే. గురువు అంటేనే కొండంత అండ. మన సూర్య మండలంలో అతి పెద్ద గ్రహ మండలం సూర్యుడు.. సూర్యుడు తర్వాత పెద్ద గ్రహం గురుడు.. గురువు తర్వాత పెద్ద గ్రహం శని. మన భూగోళం అంతటి 108 భూగోళాలను పక్కపక్కన పెడితే ఎంత విస్తీర్ణవౌతుందో అంత విస్తృతమైంది సూర్య గ్రహం. ఇక గురుగ్రహమైతే భూమి కంటే 11.2 రెట్లు పెద్దది. శని గ్రహమైతే మనం ఉంటున్న భూమికంటే 9.5 రెట్లు పెద్దది. ఇక చంద్రుడైతే భూగోళం కంటే 80 శాతం చిన్న.. దాదాపుగా భూమిలో నాలుగో వంతు.
అసలు, ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, సౌర కుటుంబంలోని గ్రహాల బరువులో 92 శాతం శని, గురువులదే! భూమి కంటే గురుగ్రహం 318 రెట్లు పెద్దదయితే, శనిగ్రహం 95 రెట్లు పెద్దది. సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలున్నప్పటికీ శని, గురు గ్రహాలు అధిక ప్రభావవంతాలన్న మాట!
శనిగ్రహానికి మనకు మధ్య దూరం దాదాపు 88 కోట్ల మైళ్లు. మనకూ బృహస్పతికీ మధ్య దూరం 48.4 కోట్ల మైళ్లు. సూర్యుడికీ మనకూ మధ్య దూరం 94.5 కోట్ల మైళ్లు. ఈ లెక్కన మనకు దూరంగా వున్న గ్రహాలు సూర్యుడు, శని.. ఆ తర్వాత గురుడు. బహు దూరాలలో ఉన్న సూర్యుడు, శని మన జీవితాలపై అధిక ప్రభావం చూపిస్తుంటారు. అయినా వీరిద్దరి ప్రభావాలను మెత్తపరచగలది గురుడు. అందుకే గురువు మన జీవితాలకు యోగ కారకుడు. గురు సన్నిధిలో అన్ని గ్రహాలూ మోకరిల్లాల్సిందే.. కారణం గ్రహాలను ఆజ్ఞాపించగల రహస్యం గురువు దగ్గరే ఉంటుంది.. మన మాస్టర్ సి.వి.వి.గారు గ్రహ రహస్యాలను భృక్త రహిత తారక రాజయోగ మార్గంలో ఆవిష్కరించటం వల్ల యోగ సాధనతో మనం గ్రహ తాకిడులకు దూరం కాగలుగుతున్నాం.
శనిగ్రహం: వాస్తవాలు, కథలు
మనం ఈ దేహంతో భూమిపై జీవించినట్లుగా శనిగ్రహంపై జీవించలేం కాని శనితో స్నేహిస్తూ ఇక్కడి జీవితాన్ని మరింతగా మెరుగుపరచుకోగలం.. ఉన్నతిని సాధించగలం. ఆత్మకు ఈ విశ్వంలో సృష్టి సృజనకు అవసరమైన అస్తిత్వాన్ని అందించగలం. శని గ్రహం పసుపు వర్ణంలో ఉన్నట్టుగా మన జీవితమూ పసుపు పారాణి కాగలదు.. శని గ్రహానికున్నా బంగారు వలయాలలా మన జీవితమూ బంగారు వలయమవుతుంది.
అసలు, సౌర కుటుంబంలోనే ‘శని’ రెండవ అతి పెద్ద గ్రహం అయినప్పటికీ కొన్ని పదుల చంద్రులతో, కొన్ని వేల వలయాలతో అందమైన గ్రహం ఇదొక్కటే. అతి ముఖ్యంగా ఏడు వలయాలతోపాటు అనేక వేల వలయాలతో చూడముచ్చటగా ఉంటుంది. అంతే కాదు తొమ్మిది భూగోళ వ్యాసాలను పక్కపక్కన పెడితే ఎంతవుతుందో అంత పెద్ద వ్యాసం శని మండలానిది. ఒక్క శనిగ్రహ వ్యాసం మాత్రమే ఇంత ఇక శని వలయాలను లెక్కబెడితే అతి భారీ గ్రహం కిందే లెక్క. ఇన్ని ప్రత్యేకతలున్న శని మండలంలో కాలమానం ప్రకారం ఒకరోజు అంటే 10.7 గంటలే. అంటే శని ఒక్క సూర్య ప్రదక్షిణకు 30 సంవత్సరాలు పడుతుంది. అతి పెద్ద ఈ శని గ్రహం వాయు గోళమే.. పైగా భయంకర వేడిగాలుల మయం. 53 చంద్రులతో చిరు సౌర మండలంలా భాసిల్లుతుంటుంది. ఇన్ని వలయాలతో, చంద్రులతో సుందరంగా కనిపించే శని గ్రహం సూర్య ప్రదక్షిణం ముగిసే సమయానికి, అంటే 30 ఏళ్లకు ఒకమారు వలయాలు లేకుండా మనకు కనిపిస్తుంది.. కారణం మనం భూమిపై నుండి చూస్తుండటమే!
శనిని (కొందరు రోమ్ మతస్థులు భగవంతుడిగా పరిగణిస్తారు) ‘గాడ్ ఆఫ్ టైం’గా (కూడా) కొందరు పేర్కొంటారు. వంశాన్ని పెంచేవాడిగా, సంపదలను శాంతిని ప్రసాదించేవాడిగా, పాడి పంటలను ఒసగేవాడిగా కూడా పరిగణిస్తుంటారు. ఇలా శని ఏలుబడిని సువర్ణ్ధ్యాయంగా ప్రశంసిస్తుంటారు.
* * *
సూర్య పుత్రునిగా శనిని చెప్పుకుంటాం. సౌర కుటుంబంలోని సూర్యుడ్ని సంపూర్ణంగా తిరిగి రావటానికి శనికి 30 ఏళ్లు పడుతుంది. ఇది జ్యోతిష్కుల లెక్క. ఈ భ్రమణంలో శని ఒక్కొక్క రాశిలోను 2.5 ఏళ్లు ఉండటం వల్ల పూర్ణ భ్రమణాన్ని 30 ఏళ్లుగా తేల్చారు. ప్రతీ భ్రమణంలోను కనీసం 2.5 ఏళ్లు అనేక ఆటంకాలు, అవరోధాలు జీవన ప్రయాణంలో ఎదురవుతుంటాయని ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే శనిగ్రహం అంటే భయపడుతుంటారు. నిజానికి శని మోకాలు అడ్డు పెట్టేది మనల్ని జాగరూకం చేయటానికే.. మనల్ని అప్రమత్తం చేయటానికే. పసిపిల్లలు పడ్డ వెంటనే అటూ ఇటూ చూడకుండా, ఆత్మన్యూనతకు గురి కాకుండా లేచి తమ ఆటపాటలలో నిమగ్నం అవుతున్నట్లే మనమూ అహంకారాలు, అభిజాత్యాలకు పోకుండా ముందడుగులు వేయగలిగితే శని మనకు స్నేహితుడే అవుతాడు.. మార్గదర్శి అవుతాడు.. యోగకారకుడే అవుతాడు. యోగ సాధకులకి శని మహర్జీవితాన్ని అందిస్తాడు. గమ్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు లేస్తుంటే మనల్ని ఉన్నత పథాన నిలిపేది శని.

-విశ్వర్షి 93939 33946