S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శనితో స్నేహిద్దాం... కాలాతీతం అవుదాం

మన జీవిత ప్రయాణం పనె్నండు రాశుల మధ్య సాగుతుంటుంది. ఒక్కో గ్రహం ఒక్కో రీతిన ఒక్కో రాశిలో ప్రయాణిస్తుంటుంది. అంటే వాటి ప్రయాణ కాలంలో మార్పు అన్న మాట. చంద్రుడి ప్రయాణకాలం ఒక్క నెల మాత్రమే అయితే సూర్యుడిది సంవత్సర కాలం. అంగారకుడు రెండేళ్లు ప్రయాణం కొనసాగిస్తుంటే బృహ్పతికి పనె్నండేళ్లు కావాలి. ఇక, శనికయితే దాదాపు ఇరవై ఎనిమిదేళ్లు. అంటే సగం జీవితమో, మూడో వంతు జీవితమో శని ప్రభావంతోనే సాగుతుంది. మన పరిణామ వికాసంలో అధిక భాగస్వామ్యం శనిదే! అలాగని మనం కంగారుపడాల్సింది ఏమాత్రం లేదు... అయినా కంగారు పడుతున్నామంటే మనకు శని గురించి సరైన అవగాహన లేదనే.
శని జ్ఞానప్రదాత. మన అభివృద్ధి కారకుడు. మనం ఉన్నతంగా ఎదుగుతున్నామంటే శని ప్రభావం వల్లనే. శని ప్రభావం ఉన్న దశని నాలుగు భాగాలు చేస్తే ప్రతి ఏడు సంవత్సరాలకు మన అభివృద్ధిలో మార్పు కనిపిస్తుంది... అవగాహనలో మార్పు కనిపిస్తుంది... స్పృహలో మార్పు కనిపిస్తుంది... జీవన పరిణామంలో మార్పు కనిపిస్తుంది. కారణం శని మనకు జ్ఞాన ప్రదాత కాబట్టి. మన ఎదుగుదలలో శని ప్రాబల్యం ఎక్కువ శాతం.
శని గ్రహాన్ని మనం రిలీజియస్ ప్లానెట్ అంటుం టాం... అంటే ఆధ్యాత్మిక గ్రహమని. అలాగే యోగులకు, తపస్సంపన్నులకు ఇష్టగ్రహం శని. అంటే వీరి దృష్టిలో శని యోగకారకుడు. యోగిస్తే శని మహారాజయోగాన్ని అందిస్తాడు... క్రమశిక్షణ తప్పితే జీవితం నుండే తప్పిస్తాడు. అంటే మృత్యుకారకుడు కూడా.
మనల్ని నెమ్మదిపరుస్తూ బాధ్యత వహించేలా చేసేది శని గ్రహమే. తల్లిదండ్రుల విషయంలో మనం బాధ్యతగా ఉంటున్నామన్నా, కుటుంబపరంగా మనం బాధ్యతగా వర్తిస్తున్నామన్నా శని చల్లని చూపు వల్లనే. అలాగే గొప్పలు పోయేవారి వద్ద శని అనుకూలంగా ఉండడు. శుచీశుభ్రతలున్న చోట శని ఆరోగ్యాన్నిస్తుంటాడు. అంటే ఒక విధంగా శని ఆరోగ్య ప్రదాతే కానీ మృత్యుకారకుడు కాదన్న మాట. వయసు మీరిన తర్వాత మృత్యువాతపడి ఆ భారాన్ని శనిపై మోపితే ఎలా?! కాబట్టి శని మనకి పుష్టిని చేకూర్చేవాడే. యోగాన్ని అందించే వాడే.
...శత్రువులపై విజయాన్ని
అందించేవాడు...
జాతక కుండలినిలో శనిది ఆరవ స్థానం. ఆనందాన్నిచ్చే వాడు, సంపదను, కీర్తిని ఇచ్చేవాడు. లక్ష్యానికి చేర్చేవాడు. ఉద్యోగాన్నిచ్చేవాడు. నిలకడగాను, నిదానంగాను వర్తించేటట్టు చేసేవాడు. వివేకానికి పనిచెప్పిన వాడు. ఆలోచనకు ముందుండేవాడు. అయితే శని ఇన్ని విధాల యోగించాలంటే ఎనిమిదవ స్థానంలో ఉండటం ముఖ్యం.
శని సరైన స్థానంలో ఉంటే అనుకున్నది సాధించే విషయంలో రాత్రింబవళ్లు కష్టించి అయినా సరే అనుకున్నది సాధించగలం. అలాగే నిర్మాణాత్మకంగాను, పట్టుదలగాను లక్ష్యం వైపు దూసుకెళ్లటం సాధ్యమవుతుంది. అందరి మనసుల చూరగొనటమూ సాధ్యమవుతుంది. సునిశిత పరిశీలన, న్యాయబద్ధంగా వ్యవహరించటమూ శని బలం వల్లనే. పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వారిలోను, నాయకులుగా ఉన్న వారిలోను శని బలమైన ప్రభావాన్ని చూపుతుంటాడు.
అలాగని శని వల్ల చెడు పరిణామాలు లేవని కాదు. జన్మకుండలినిలో శని సరైన స్థానంలో లేకపోతే అనేకానేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. జీవితంలో రాణించటానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఫలితాలు సాధించడంలో జాప్యాలు ఎక్కువ. నిరాశానిస్పృహలకు ఇట్టే గురవ్వటం జరుగుతుంటుంది. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే.
...శని: ‘యోగ’కారకుడు....
శనిని భూగ్రహం అంటున్నాం... ఒక అవనితార అంటున్నాం. అంటే శని మనకు హితుడు, సన్నిహితుడు అనే కదా. మనది ఆనందమయ జీవితం కావటానికి కావల్సిన శాంతిని, ప్రశాంతతని చేకూర్చే వాడు శని. ఒక ధ్యానజగత్తులోను, గిక విశ్వంలోన తిష్ట వేసేలా చేసేవాడు శని. గిక ‘చక్ర’భ్రవణంలో అన్నిటి కంటే పైనున్న చక్రస్థనీయుడు శని. చూడండి... శక్తిపాతంలో శని పాత్ర ఎంత ఉన్నతమైందో! మన జీవనయానంలో ఒక్కో చక్రం మన ప్రయాణ మలుపులను, స్థితులను తెలుపుతుంది. కింది చక్రప్రయాణం జనరల్ కంపార్ట్‌మెంట్ ప్రయాణం లాంటిది. అస్థిమితం, చిరాకు, తొడతొక్కిడి తొలుచక్ర స్థానంలో ఉంటూనే ఉంటాయి. ఈ తొలిచక్రంలో ఉత్పన్నమయ్యే శక్తి కోరికలను గుర్రాలెక్కిస్తుంది... కామనలకు, కామానికి కామా పెడుతూనే ఉంటుంది.
అయితే ఆరవ చక్రస్థానంలో శని ద్వారా సంక్రమించే శక్తి అంబరాన్ని తాకుతుంటుంది. అంతటి మహాశక్తిపాతానికి కారకుడు శని అన్న మాట. అంటే అన్నింటి కంటే పైనున్న చక్రస్థానం శనిది అన్న మాట. గిక పరిణావంలో ఉన్నత ప్రధాన ఉత్తమ లోకాలకు చేర్చేది శని. అందుకే యోగ సాధకులకు, ధ్యానపథగాములకు శని ఇష్ట సఖుడు. సాధనతో కాలం వెంట పరుగులు పెట్టిస్తూనే కాలాతీత స్థితికి చేర్చేవాడు శని. అంటే యోగమార్గంలో నిరంతర సాధనతో కాలాతీత స్థితికి చేరుకోవాలంటే శనికి సన్నిహితం కావలసిందే!

-విశ్వర్షి 93939 33946