S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేనెక్కిన రైలు ‘పల్టీ’ కొట్టింది!-94

‘‘నరుఢా! ఏమి నీ కోరిక?’’ అంటూ పాతాళభైరవి సినిమాలోలాగా ఒక యక్ష కన్య ‘డింగ్’మని ప్రత్యక్షమై అడుగుతుందని నేను అనుకోలేదు గానీ - ఊరు, డిపార్ట్‌మెంట్ మారిపోతున్నప్పుడు అయినా - కొంచెం సమయం, సదుపాయం దొరుకుతాయని నేను అనుకున్నాను.
జనవరి 14, సంక్రాంతి సెలవు ఇచ్చారు మాకు. పదమూడు రాత్రికి నాకు హవురా మెయిల్‌కి ఫస్ట్‌క్లాస్ టికెట్లు రిజర్వ్ చేయించి, పదో తేదీ నాడు, వాత్సల్యంగా పిలిచి, మెహర్బానీగా జి.యముడు కుంచిత పాదం గారు’’ - ఇగో మహా ప్రసాదం స్వీకరించు’’ అన్నట్లు, టికెట్ నా చేత బెట్టాడు.
సంక్రాంతి ఇంట్లో స్పెండ్ చేసి, 15న గాంధీనగర్ ఆఫీసులో రిపోర్ట్ చెయ్యమన్నాడు.
ఎడిటోరియల్ హాలులోకి వెళ్తే, అక్కడ పెద్దలంతా ఏం నాయనా! నీకు ట్రాన్స్‌ఫర్ మీద పోడానికి పదమూడవ తారీఖు - అమావాస్య లాంటి ముహూర్తమే దొరికిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు.
ప్రకాశరావుగారు అప్పటికే బెజవాడ వెళ్లిపోయాడు...
తిరిగి జి.యమ్ రూమ్‌లోకి పరిగెత్తాను. నవ్వేశాడు. అరవ్వాళ్లకి అమావాస్య దివ్యమైన రోజు. పదమూడవ తేదీ లక్కీ నెంబర్. ‘‘అసలు నువ్వు డైలీలో జాయిన్ అయిన రోజు కూడా అమావాస్యే, తెలుసా?’’ అన్నాడు కుంచిత పాదం గారు. హాలులో వాళ్లకి ఏమీ తెలియదు. వాళ్లు నిన్ను ‘‘ఏమార్చుతున్నారు’’ అన్నాడు. (మోసం చేస్తున్నారు అని అర్థం)
‘‘రైలు బోల్తా కొట్టినా, కొడుతుందేమో గానీ నాకేం కాదులే’’ అన్నాను నేను. తిరిగి ‘‘హాలు’’లోకి వెళ్లి... దీనే్న అంటారు ‘‘కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దైర్ షాడోజ్’’ అని. మవుంట్ రోడ్ మీద తేజండ్ లైట్స్ ఏరియాలో రోడ్డు వారకి ‘బాంబూ హవుస్’ అని ఒక చిన్న వెదురుబొంగుల కుటీరం రెస్టారెంట్ ఉంది. అక్కడ ఆండీ విలియమ్స్ పాట - నెంబర్ ఫిఫ్టీ ఫోర్ హవుస్ విత్ బాంబూ డోర్’’ పాట రికార్డు పెడతాడు. ‘ఎక్స్‌ప్రెస్సో’, కాఫీ ఇస్తాడు. ఓ పాతిక మంది కన్నా ఎక్కువ మంది పట్టరు అందులో. అదో మోజు నాకు. నా ఫ్రెండ్స్‌కే...
నేనూ, సభాపతీ పోయి అక్కడ కూర్చున్నాం. నాన్నగారు, నా ‘ఉత్తరాలు’ అన్నీ తీసి రెండు గోతాముల నిండా, పుస్తకాలు ‘వీక్లీ’కి మూటలుగానూ కట్టించేశారు. అన్నీ మంజుశ్రీ, వాకాటి, మొదలు - జయదేవ్, శంకుల దాకా అందరూ కలం వీరు రాసినవే! మిగతా ఫర్నిచర్ గట్రా లేదు. ఆ రోజుల్లో ‘వాకర్’ సూటుకేసులు (వీలర్‌లు) లెదర్ సూటు కేసులూ లేవు. ‘హోల్ డాల్స్’ ఉండేవి. ఆంధ్రా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ల షేర్స్ అకౌంట్స్ - పార్ట్ టైమ్‌గా చూసే వారు నాన్నగారు. వాళ్ల ట్రంకు పెట్టెల్లో ఫైల్సు పెట్టేవారు. అలాంటి ట్రంకుల్లో రెండింటిలో నా లెటర్స్, బుక్స్ సర్దుకున్నాను. అవే నా ఆస్తి.
సభాపతికి ఇదంతా చెబుతూ ‘హవుస్ - విత్/బేంబూ/డోర్’’ పాట మరోసారి పెట్టమన్నాను. ఈ ‘పర్ణశాల’కి పోదాం,’’ అంటే, మా రాంప్రసాద్, ‘‘వద్దులే బుహారీ టాప్ ఫ్లోర్‌కి పోదాం’’. ‘‘్ఫంగర్ చిప్స్’’ తిందువుగానీ రా’’ అనే వాడు ఎప్పుడూ... కారణం ‘‘బాంబూ’’.
* * *
మెరీనా బీచ్, పాన్‌గల్ పార్క్, అమెరికన్/కాన్సొలేట్ వారి ‘‘అద్దాల మేడ’’ మీది నుంచి కనబడే అందాల మవుంట్ రోడ్ దృశ్యాలు - పాండీబజార్ వాకింగ్‌లూ ‘చిత్ర’ సినిమా పత్రిక ఆఫీసులో సినిమా గాసిప్‌లు మీనన్ అంగడిలో (పాన్‌షాపు) స్ట్రాబెర్రీ, టమోటా జ్యూస్‌లు - ఇవన్నీ గతస్మృతులై పోతాయి.
డిపార్ట్‌మెంట్‌లో ప్రకాశం మా సారుకి ‘‘ఫేర్‌వెల్ పార్టీ’’ అంటూ నన్ను సాగనంపే సన్నాహం మొదలుపెట్టారు. కానీ రాధాకృష్ణగారు నవ్వేశార్ట. వై?’ స్కూల్ ఫార్మాలిటీస్?’’ అన్నాడుట. అయినా మా వాళ్లు పక్కనే ఉన్న ‘‘మాడరన్ కేఫ్’’లో చిన్న ‘టీ’ (కాఫీ) పార్టీ పెట్టారు. వారపత్రిక యొక్క బుల్లి డిపార్ట్‌మెంట్ అనుయాయులు. ‘శిరాకృ’ గారు జి.ఎమ్. రాక తప్పలేదు. ప్రకాశం పక్కనే ‘‘మాధవా!’’ (మాధవరావుని నేను అలాగే పిలిచేవాణ్ని).
‘‘ఎడబాటంటే ఎందరో ముల్లూ’’ అన్నట్లుగా ఉన్నారు అంతా. ‘‘వీరాజీకి వారసుడు వాశిరాజు ఇక మీదట’’ అన్నాడు. జి.యమ్ ఆ వెంటనే-
‘‘మరి వాశిరాజు పోతే, హూరుూజ్ ది సక్సెస్సర్?’’ అన్నాడెవరో. తక్షణం రాధాకృష్ణగారు ‘‘ఉన్నాడుగా!’’... ఇదుగో’’ అంటూ మాధవరావుని సంకేతించాడు. ‘‘ప్రకాశం మొహం చిన్నబోయింది. కానీ ఇదే సంఘటన మళ్లీ ‘‘కమింగ్ ఈవెంట్స్ - క్యాస్ట్ దైర్ షాడోజ్’’ అయింది.
ప్రకాశం చిత్రమైన పరిస్థితుల్లో వెళ్లిపోయాడు. మాధవరావు, కనకాంబరరాజులు మాత్రం - వీక్లీతో, బెజవాడకి 1973లో మారినప్పుడు వచ్చారు. నాకు మళ్లీ ‘‘వీక్లీ’’ కొలువు.
‘‘చిత్రంగాదా? జీవితం...’’ ఉద్యోగం లేకపోతే గడవదు. పైగా ‘ఉద్యోగం పురుష లక్షణం’ అంటారు
కానీ ఉద్యోగం ఒక బందిఖానా.
ఎన్.టి.ఆర్. తన చక్కని స్వదస్తూరీతో నాకు రాసిన లెటర్‌కి బదులు ఇవ్వకపోగా ‘‘గుడ్ బై! ‘‘మనూరి’’కి పోతున్నాను’’ అనేనా. చెప్పాలా? వద్దా?...
మా క్రింది అంతస్తు రూమ్ నెం.9లో మద్ది సుదర్శనంగారి రెండో అబ్బాయి సుబ్బారావు ఉంటున్నాడు. చెప్పానుగా నాన్నగారి ‘్ఫ్యన్’ అతడు. అతనికి ‘జమున’ అంటే పిచ్చి - ఓసారి, ఆ స్టార్‌తో నేను, అతణ్ని మాట్లాడించాను. సో... నాకు తను బాకీ తీర్చాలి. అతని రూమ్‌లో నుంచి ఎన్.టి.ఆర్.ని ఫోన్ మీద పట్టుకుని ‘‘గుడ్ బై’’ చెప్పాను.
కొంచెం చలించినా, అంటే, తన మాట చెల్లనందుకు చలించినా, సర్దుకుని ‘‘మనూరేగా?... అక్కడ కలుద్దాం. బ్రదర్ ఈలోగా నా ఆతిథ్యం, మా ఇంట స్వీకరించాలి. రండి ప్రియమైన వీరాజీగారూ!’’ అన్నాడు డ్రమటిక్‌గా. అయితే, అందులో ఆత్మీయత నూటికి నూరు పాళ్లూ ఉన్నది కానీ తాను మర్నాటికి గానీ ‘ఫ్రీ’ కాడు. నేను మర్నాడే రైలు ఎక్కేయాలి.
సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పకున్నా అంతే...
నాకు నవ్వొచ్చింది, ఏడుపూ వచ్చింది. ‘‘మద్రాసునీ’’ నాకు నచ్చిన అరవ్వాళ్ల కల్చర్‌నీ వదిలేస్తున్నాను అనుకున్నాను.
నాన్నగారక్కడే ఉండిపోయి, నేను అమ్మనీ కుటుంబాన్ని ఇక్కడికే తెచ్చేసుకుని మైలాపూర్‌లో చిన్న ఇంట్లో, మేడ మీద గదిలో నవలలూ, కథలూ రాయాలనీ...
కానీ ‘‘తొలి మలుపు’’ నవలలోని మాటలు నేను రాసినవి నాకే ఎడా పెడా చెంపలు వాయించినట్లు గుర్తుకు వచ్చాయి. ‘‘అనుకున్నది అనుకున్నట్లు అవ్వకపోవడమూ - అనుకోనిది అకస్మాత్తుగా అవటమూ ఇదే జీవితం!
విశాఖ సంద్రం, మద్రాసు సముద్రం ఓ తీరం వెంబడి కలుస్తాయి గానీ బెజవాడ జీవితం, మద్రాసు జీవితం కలిసేటందుకు అటువంటి తీరం ఏదీ లేదు. ‘‘నీ సామాన్లు మీ ‘అప్పా’ బుక్ చేస్తున్నారులే. అది ‘‘బిల్లు’’ పెట్టు మీ ఐ విల్ పే యూ, యంగ్ మ్యాన్!’’
‘‘నీకు అందా (తా) మంజి (చి) జరుగుమ్ (జరుగుతుంది) అంటూ చెప్పాడు జి.ఎమ్.గారు. నా దగ్గర అంటించుకున్న ‘తెలుగు’లో చెప్పి భుజం తట్టాడు. కుంచితపాదం గారు (దొడ్డు మనిషి).
జీవన వైకుంఠపాళీలో ఇప్పుడు ఇది ‘‘పెద్ద పాము మ్రింగినట్లా? నిచ్చెన దొరికినట్లా?’’ పెర్రీమాసన్ (ఎర్ల్‌స్టాన్లీగార్డనర్ సృష్టించిన వండర్‌ఫుల్ డిటెక్టివ్ బాయ్ అన్నట్లు ‘‘లెటజ్ క్రాస్ ద బ్రిడ్జెస్ వెన్ వుయ్ కమ్ టు దెమ్’’ అన్నారు. నాన్నగారు.. ఆయనో వేదాంతి.
ఆంధ్రా ఇన్సూరెన్స్ బిల్డింగ్ వాచ్‌మెన్ నరసయ్య కుటుంబం, మంగమ్మ సంతానం ముగ్గురూ చలించిపోయారు. పెద్ద కొడుకు ‘వెంకటి’ స్కూల్ ఫైనల్‌కి వచ్చాడు. మంగమ్మ మాట మీద స్టేషన్‌కి వచ్చి దిగబెట్టాడు నన్ను. నాకు ఓ చిన్నదంతం ఏనుగు బొమ్మలు తాపడం చేసిన ‘పేపర్ వెయిట్’ని బహూకరించాడు. అది నా దగ్గర పాతికేళ్ల దాకా ఉన్నది. ఈ కుర్రవాడే ఆనక సివిల్ ఇంజనీర్ అయినాడు. ‘‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’’కి ఉదాహరణ.
మద్రాసు సెంట్రల్ స్టేషన్ భలే ఉంటుంది. వంతెనలు, మెట్లు, గేట్లు వగైరాలు అడ్డం రావు. పెరేడ్ గ్రౌండ్‌లో సైనికులు నిలబడ్డట్లు వరుసగా ఉన్న ప్లాట్‌ఫామ్స్ మీద రైలు బండ్లు వచ్చి ఆగుతాయి. కాకపోతే ప్లాట్‌ఫామ్స్ ఇరుకు. రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు వదిలిపెట్టే ఆఖరి రైలు మద్రాసు (ఆంధ్రా) హౌరా మెయిల్.
మా వర్కరులంతా పూలూ, పండ్లూ పట్టుకుని నేనెక్కవలసిన కంపార్టుమెంట్ దగ్గరికి ముందే చేరారు. నేనెక్కాల్సిన ఫస్ట్‌క్లాస్ భోగీని ఆనుకునే ఏ.సి. భోగీ (ఒక్కటే ఉండేది) ఉన్నది. దీంతో అక్కడ వి.వి.ఐ.పి. బలగం జాస్తీ అయినారు. మెయిల్‌కి కాకినాడ భోగీ ఒక్కటే రిజర్వేషన్ లేకుండా ఎక్కడానికి వీలు అయినది. దాన్నిండా తెలుగు యువకులే. నా కంపార్ట్‌మెంట్ మీద మిసెస్ అండ్ మిస్టర్ ఏ. నాగేశ్వరరావు అనీ నా పేరు కిందన ఉంది. జనాలు ‘‘రెండూ ప్లస్ రెండూ - నాలుగు’’ అనుకున్నారు. కానీ ఆ జంట పేర్లు వేరు. గుంటూరుకు చెందిన, ఒక దంపతుల పేర్లు అవి. అయినా, నా పేరు కూడా పాఠకుల నోళ్లలో నలిగిందేగా?
నా కంపార్ట్‌మెంట్ ముందు రద్దీ ఇనుమడించింది. బెజవాడ ఎడిషన్ అసిస్టెంట్ సర్క్యులేషన్ మానేజర్‌గా ట్రైనింగ్ అయిన కె.శేషగిరివు ‘‘కాకినాడ భోగీలో ఉన్నాను సార్! గూడూరులో వచ్చి కేకేస్తాను’’ అంటూ పలకరించాడు. ‘‘ప్రకాశం’’ అన్నగారు ‘‘మరిచిపోకండి మమ్మల్ని’’ అంటూ నా చేతులు అందుకోవడంతో అందరూ ఏవేవో అందమైన, ఆనందప్రదమైన ‘టానిక్’లాగ పనిచేసే మాటలతో గిఫ్ట్ పాకెట్లతో నన్ను ముంచెత్తుతుండగా గొప్ప ‘కో ఇన్స్‌డెన్స్’
అమెరికన్ సమాచారం ఎడిటర్ బి.ఎస్.ఆర్. కృష్ణ, ఆంధ్రా ఛాంబర్ అధ్యక్షులు జె.వి. సోమయాజులుగారు అదే మెయిల్‌లో బెజవాడకి పోతున్నారు. సోమయాజులుగారు ఆగి, పలకరించి ముందుకు పోగా బి.ఎస్.ఆర్.గారు వెనక్కి, నా వీడ్కోలు సందడిలో పాల్పంచుకుంటూ ఉండిపోయాడు. ఆయన, టి.టి.ఇ.ని ఆపి, ‘‘నా కంపార్ట్‌మెంట్‌లోనే వీరాజీని కూడా అకామిడేట్ చేయకూడదూ? లేదా నన్ను ఇక్కడికి తోసెయ్యరాదూ?’’ అంటూ అడిగాడు - కృష్ణగారు.
‘‘ఎందుకు సార్? రైలు ఔటర్ దాటేసరికి మీరు నిద్రలోకి జారిపోతారు. మళ్లీ బెజవాడ స్టేషన్ లేపే దాకా లేవరు.’’ అంటూ తప్పుకున్నాడు టి.టి.ఇ.
అప్పర్ బెర్త్ మీదున్న శ్రీమతి ఏ.ఎన్.ఆర్. కిందికి రాగా ఆమె ఎదుటి బెర్త్ మీద ‘నా’ పండ్లు, పూలగుచ్ఛాలు వీక్లీ ఫైల్స్ మూటలు వగైరలతో ఉండగా రైలు కదిలింది.
‘‘అయ్యో! నేను దిగడం మర్చిపోయానే’’ అన్నది మనసు. ఫక్కున నవ్వాను. ‘‘నాగేశ్వరరావు’’గారన్నాడు. ‘‘ఆంధ్ర పత్రిక వర్కర్స్‌కి కూడా మీరంటే ఇష్టం. అదే ఆశ్చర్యం! మీరు కమ్యూనిస్టులా?’’
‘‘అంటే మీ ఉద్దేశం? కమ్యూనిస్టులు అయితే గానీ వర్కర్‌లు ప్రేమించరా?’’ అన్నారు. త్వరగానే వాళ్లు నిద్రలోకి జారుకున్నారు. నా మనస్సు వెనక్కి మూడు వందల ముప్ఫై ఏడు బై పంతొమ్మిదికి జారుకుంది. రోజూ నిద్ర మధ్యలోనే లేస్తే కొండంత అండగా తనకి నిద్ర పట్టక బీడీ కాల్చుకుంటూ పడుకున్న నాన్నగారూ నిర్విరామంగా కిటికీలో నుంచి వెలుతురు కొరడాలు ఝళిపించే పెద్ద లైట్ హవుసూ...రోజూ లేస్తూనే ముందు, బాల్కనీలకో రాంగానే ఆంధ్రపత్రిక బిల్డింగ్ దర్శనం ఇవన్నీ గతం గతః
చిన్న చినుకు అలసట కారణంగా... అంతలో ‘‘్ఢ’’మ్మని ఏదో ప్రేలిటన్లు చప్పుడు.. క్షణం... క్షణం అలా ఊపిరి ఆగిపోయి అంతలో గుండెల్లో పిడుగులు అనుమానం లేదు. రైలు మీద పిడుగు పడి ఉంటుంది. జనం ‘హాహా’కారాలు..
పై బెర్తు మీంచి కింద పడ్డాననీ నా తల ముక్కలయిందనీ అనిపించింది. కానీ, కింది బెర్తు మీద ఉన్న పండ్లూ, పూలదండలూ ఇవి నా తలని ‘‘వొళ్లోకి తీసుకుని’’ కాపాడేయని గ్రహించాను. పగిలింది. ‘‘ఏపిల్స్...గానీ, నా తల కాదు. చిన్న మెదడుకు దెబ్బ తగిలిందన్నట్లు అయింది.
రైలు భోగీలు అమాంతం ఉన్న పళాన పక్కకి ఒరిగిపోతున్నాయి. బయట నుంచి కీచురాళ్ల రొద. మేఘావృతమైన నింగి నుంచి జారుతున్న గుడ్డి వెనె్నల. అర్ధరాత్రి దాటింది. ఒరిగిపోతున్న రైలుపై నుంచి, తలుపు తోసుకుని లోపలికి దూకిన తెలుగు కుర్రాళ్లు కేకలు.
‘‘వీరాజీగారూ... వీరాజీగారూ... నాగేశ్వర్రావుగారూ... మేం ఉన్నాం... భయం వద్దు...’’ అంటూ కేకలతో ఇవతలి వేపు నుంచి తలుపు గుంజి తీశారు.
జరిగింది ఏమిటి? గూడూరు దాటాక - గుండ్లకొమ్మల దగ్గరగా రైలు - గూడూరు దాటాక - మనుబ్రోలు - బిట్రగుంటల మధ్య (గుండ్లకమ్మల) వద్ద పడిపోయింది. ప్రమాదం చిత్రమైనది. రైలు బండీకి ఉన్న చివరి అయిదు భోగీలు ‘కప్లింగ్’లు తెగి పల్టీ కొడుతుండగా మిగతా రైలుని ఈడ్చుకుంటూ ఇంజన్, రెండు కిలోమీటర్లు దాటాక ఆగింది. కూలిన భోగీలలో ‘’్భవదీయుడు’ ఉన్నాడు. చిన్న చిన్న దెబ్బలు తడుముకుంటూ నిజంగా మన కుర్రాళ్లంతా వచ్చి కాపాడకపోతే పూర్తిగా, భోగీ ఒరిగి పోయాకా మమ్మల్ని బయటకి లాగాల్సి వచ్చేది. మునిగిపోతున్న ‘నౌక’ లాగ ఒక్కో భోగి ఒరిగిపోతుండగా నా సామాన్లు రైలులో నుంచి కిందికి అంతా కలిసి లాగేశారు. కళ్లు తిరుగుతున్నాయి. కానీ ఇంత మంది వచ్చి ఆదుకోవడంతో నాలోని ‘‘జర్నలిస్ట్’’ మేల్కొన్నాడు. ఈలోగా, అట్నుంచి, మెయిల్ భోగీల నుంచి సోమయాజులుగారు, బి.ఎస్.ఆర్.గారు టార్చిలైట్లు ఫ్లాష్ చేసుకుంటూ మా వేపే వస్తున్నారు.
‘‘్భయం లేదు వీరాజీ! మేం వచ్చేశామయ్యా!’’ అన్నారు బి.ఎస్.ఆర్. సోమయాజులుగారన్నాడు. ‘‘విశ్వనాథం అదృష్టవంతుడు... యూ ఆర్ ఆల్ రైట్’’ అంటూ అలా ఆదుకున్నారు.
శేషగిరిరావు అన్నాడు. ‘‘మీ బుక్స్ మూటలూ అవీ నా భోగీలోకి లాక్కుంటాం. ఆనక బెజవాడలో మీ ఇంటికి తెచ్చేద్దాం లెండి’’ అని.
ఒరిగిపోతున్న భోగీలలో ఎవరూ లేరు ఇక. ఏ.సి. భోగీలో మహిళ తలకి గాయంతో గగ్గోలు పెడుతోంది. నాకు వొళ్లు గీరుకుపోయిన చోట్లకి టించర్ తగిలించారు. గార్డు భూషాణం లాంటి పెట్టె లాంటిది తేగా అందులోంచి టెలిగ్రాఫిక్ ఏంటెన్నా తీసి పై నుంచి సాగుతున్న టెలిగ్రాఫ్ టెలిఫోన్‌ల తీగెలకు తగలించే ప్రయత్నం మొదలెట్టారు.
నేనూ రంగంలోకి దిగాను. అనుకోకుండా పూర్ణానందం పేటలోని ఆంధ్రప్రభ ఎక్స్‌ప్రెస్ ఆఫీసుకి తగిలి టెలిఫోన్ మోగింది. మా తమ్ముడు సుబ్బారావ్ నైట్ డ్యూటీలో ఉంటే - వాడికి సమాచారం ఇవ్వాలని నా తాపత్రయం!

(ఇంకా బోలెడుంది)

వీరాజీ 92900 99512