S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పనిముట్టు

చిరునవ్వు అందరిలో వుంటుంది. అందరితో కూడి చిరునవ్వు బిగ్గరగా నవ్వాలంటేనే కష్టం. బిగ్గరగా నవ్వాలంటే పాత స్నేహితులైనా ఉండాలి. లేదా కుటుంబ సభ్యులైనా ఉండాలి.
చిరునవ్వుకి, గట్టిగా నవ్వడానికి మధ్యన బేధం..
మొన్నీ మధ్య మిత్రుడు సంజీవరెడ్డి ఫోన్ చేస్తే కాసిన్ని జోకులు వేసుకొని బిగ్గరగా నవ్వుకున్నాం.
నాలుగు సంవత్సరాల క్రితం జీవితాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆనందపడినాడు. బాధ పడినాడు. అప్పుడు మిత్రులందరూ హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలలో వుండేవాళ్లం. రోజూ ఉదయం ఇందిరా పార్క్‌లో ఉదయపు నడకను కొనసాగించేవాళ్లం. అది ఒక నడక మాత్రమే కాదు. ఎన్నో విషయాలు మా మధ్యన దొర్లేవి.
అవి రాజకీయాలు కావొచ్చు సినిమాలు కావొచ్చు. కోర్టుల విషయాలు కావొచ్చు. కాలేజీ ముచ్చట్లు కావొచ్చు. ఒకరి మీద ఒకరి జోకులు. కొన్నిసార్లు కఠినమైన జోకులు కూడా వుండేవి. అయినా ఎవరూ బాధపడేవాళ్లు కాదు. బాధపడినా అది కొంతసేపు మాత్రమే ఆ తరువాత అంతా మామూలే.
కొద్దిరోజులకి సంజీవరెడ్డి సోమాజిగూడలోని కొత్త ఫ్లాట్‌కి మారిపోయాడు. ఆ తరువాత సత్యంరెడ్డి ఇనార్బిట్ మాల్ దగ్గరికి వెళ్లిపోయాడు. రాజేందర్, కిషోర్, ధనంజయ్, అజయ్‌రెడ్డి, రాజవౌళి శర్మలు మిగిలిపోయారు. ఓ రెండు సంవత్సరాల క్రితం నేనూ అక్కడి నుంచి మారిపోయాను.
ఇందిరా పార్క్ చిన్నబోయింది.
ఆ రోజులు గుర్తుకు వచ్చినప్పుడల్లా మేమంతా చిన్నబోయేవాళ్లం.
ఫోన్‌లో సంజీవరెడ్డి గుర్తు చేసింది ఇదే విషయం.
ఎప్పుడో చిన్నప్పటి విషయాలు కాదు. నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలే అద్భుతంగా కన్పిస్తున్నాయి.
బిగ్గరగా నవ్వుకోవాలంటే చిరకాల స్నేహితులని కలుసుకోవాల్సిందే.
కలువకపోయినా మాట్లాడుకొని నవ్వాల్సిందే.
ఎందుకంటే చిరునవ్వు అనేది క్లిష్ట పరిస్థితులకి ప్రతిస్పందన అయితే నవ్వు అనేది టానిక్ లాంటిది.
గడిచిన రోజులని తలుచుకోవడమే కాదు. వర్తమానంలోనూ ఆనందంగా గడపాలి.
బిగ్గరగా నవ్వడం అందుకు ఓ పనిముట్టు..

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001