S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యోగ కారకులు సూర్య, శనులే

మాస్టర్ సి.వి.వి. ఆవిష్కరించిన ‘‘్భృక్త రహిత తారకరాజ యోగం’’ అంటేనే సంపూర్ణంగా ‘డైరెక్ట్ లింక్’. అంటే విశ్వంలోని ఏ అంశతోనైనా మాస్టర్ యోగసాధన ద్వారా ప్రత్యక్ష సంబంధ బంధాలే తప్ప ఎటువంటి డొంక తిరుగుడు వ్యవహారాలకు, షార్ట్ కట్స్‌కి అవకాశం లేదు. అందుకే మాస్టర్ యోగాన్ని ‘డైరెక్ట్ లైన్’ అనీ అంటుంటాం.
* * *
‘విశ్వం’ ‘నేను’ బింబ ప్రతిబింబాలు. విశ్వం నుండి నేను ఒక ‘అంశ’గా సృష్టి పరిణామంలో ‘మానవ అవతారం’ అవుతుంది. సాధారణంగా మనం ఆథ్యాత్మిక పరిభాషలో ‘ఆత్మ’ అంటుంటాం. ‘పరమాత్మ’ అంటుంటాం. నిజానికి గికంగా ఆత్మ కంటే ‘ఆది పరిణావం’ ‘అంశ’. అంటే మానవాత్మ తొలిగా ‘అంశ’గా విశ్వం నుండి బయలుదేరిందన్న మాట. ఆ అంశనే కాంతి మండలాల గుండా కాల వాహినిలో భాగస్తురాలై వాయులీన ఖగోళంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నక్షత్ర గ్రహ మండలాదుల సంపర్కంతో కొంత ‘ఖగోళ ధూళిని’ తనకు చేర్చుకుంటుంది. ఆ ఖగోళ ధూళితో కూడిన అంశ భూగోళ పరిధిలోకి ప్రవేశించి, విశ్వంలోని ‘అంశ’ మన దేహంలో అసంపూర్ణంగానే క్రియాత్మకమవుతోంది. ఈ అసంపూర్ణ ప్రాణ జీవ కార్యకలాపాలకు మూల కారణం శని.
శనిని సైతం ప్రభావపరచగలది సూర్య శక్తి. శనికి తండ్రి సూర్యుడే కదా. అంటే శక్తి ధామం సూర్యుడన్న మాట. ఆ సౌరశక్తి మనల్ని చేరటానికి పూర్వం విశ్వాన్ని ఆక్రమించి ఉన్న ఈథర్ గుండా చేరవలసి ఉంటుంది. సౌరశక్తి మనల్ని చేరటానికి వాహిక వాక్యూమ్ ట్యూబ్. ఇక్కడ వాక్యూమ్ అంటే ఈథర్ అనే. ఈ సూర్యద్యుతులు సౌరశక్తి వాహికలుగా మన సహస్రారం ద్వారా దేహాన్ని ప్రాణపదిలం చేస్తాయి. ఈ సూర్యద్యుతులనే యోగ పరిభాషలో ‘సన్ బ్లేజింగ్స్’ అంటాం. అంటే శని వల్ల కలిగే అస్వస్థలను తొలగించేది సూర్యుడన్న మాట. ఇదీ తండ్రీ కొడుకుల వ్యవహార తీరు.
గికంగా ‘సార్యుడు-శని-నేను’లది ట్రయాంగిల్‌లో స్టోరీ. త్రికోణ కార్యకలాపం. విశ్వంలోని ‘అంశ’ మన దేహంలో అసంపూర్ణంగానే క్రియాత్మకమవుతోంది. ఈ అసంపూర్ణ ప్రాణ జీవ కార్యకలాపాలకు మూల కారణం శని.
ఖగోళ ధూళి దూసరిత అంశనే....
నిజానికి ఆత్మగా పరిగణించని ‘అంశ’ స్థితి చాలా సున్నితమైంది. విశ్వం నుండి బయలుదేరినప్పటి ఆది స్థితిలో అంశ సంపూర్ణమే అయినప్పటికీ భౌతిక పరిధులలో మానవ దేహాన్ని సంతరించుకునేప్పటికీ అది ‘అసంపూర్ణం’ అవుతోంది. అందుకే మన దేహంలోని అంశను ‘సెమి’ అంటుంటాం. అంటే పూర్ణం కానిది అని అర్థం. ఇలా ‘అంశ’ పూర్ణం కాకపోవటానికి కారణం ఖగోళ ధూళితో పాటు శని గ్రహ ముసుగులో మానవ దేహాన్ని చేరుకోవటమే. అందుకే మనం మన జీవిత కాలంలో సగ భాగం శని కనుసన్నలలోనే ఉంటాం. అంటే ‘శని’ వల్ల మనం ‘సెమి’ అవుతున్నామన్న మాట.
అసలు మనిషి అంటేనే ప్రాణం. జీవం ఆధారం. మనకు కావల్సిన ప్రాణం అందేది నరాలు, నాడుల ద్వారా, ఈ నర నాడీ వ్యవస్థ శని అధీనంలో ఉంటుంది. మనలో ప్రాణ సంపూర్ణంగా నిలదొక్కుకోకపోవటానికి కారణం శని తొడుగులే. అంటే శని ప్రభావంతో మనకు కావల్సిన ప్రాణ అనేక ఆటంకాలతో మనల్ని ఆశ్రయించుకుని ఉంటోందన్న మాట. దీన్నిబట్టి ప్రాణ కూడా మనకు ‘సెమి’గానే అందుతున్నట్లు. ఈ అర్థ వ్యవస్థ పూర్ణ వ్యవస్థగా రూపొందాలంటే శనితో మన సఖ్యం అవసరం. మనమే కాదు శని కూడా మనతో స్నేహించాలి. ఇలా శనితో మనం ప్రత్యక్షంగా మన బంధాన్ని బలపరచుకోవటానికే మాస్టర్ సి.వి.వి. ‘శాటర్న్ రెగ్యులేషన్స్’ మాస్టర్ మీడియమ్స్ సాధనకు అందించారు. ఈ రెగ్యులేషన్స్ సాధన వల్ల శని ప్రభావంతో ఏర్పడ్డ తొడుగులు తొలగటం జరుగుతుంది. ఈ తొలగటం ‘బోరింగ్స్’ పద్ధతిన జరుగుతుంది. బోరింగ్ అంటే తొలచటం. నరాలను, నాడులను తొలచటం శాటర్న్ రెగ్యులేషన్స్ వర్కింగ్.
శుద్ధత, పారదర్శకతలు తొలి భూమికలు
సౌరశక్తి మనల్ని చేరటానికి పూర్వం విశ్వాన్ని ఆక్రమించి ఉన్న ఈథర్ గుండా చేరవలసి ఉంటుంది. సౌరశక్తి మనల్ని చేరటానికి వాహిక వాక్యూమ్ ట్యూబ్. ఇక్కడ వాక్యూమ్ అంటే ఈథర్ అనే,. మన మాస్టర్ యోగసాధనలో యాస్ట్రల్ ట్రావెల్ కంటే ఈథర్ ట్రావెల్‌దే ప్రధాన భూమిక.
శాటర్న్ బోరింగ్స్ వల్ల, సన్ బ్లేజింగ్స్ వల్ల మన శారీరక వ్యవస్థలోని దోషాలు పరిహరింపబడాలి. అంటే మన దేహానికి అవసరం లేని అవస్థలని తొలగించటం, కరిగించటమే శాటర్న్, సన్ రెగ్యులేషన్స్ చేసే పని. ఒక్క శని, సూర్యులు అనే కాకుండా ప్రతి గ్రహం నుండి సంక్రమించిన ఖగోళ ధూళికి చెందిన మానవ దేహ వ్యవస్థకు అవసరం లేని ప్రతి అంశను ఈ రెగ్యులేషన్స్ సాధనతో పాంచభౌతిక వ్యవస్థ నుండి తొలగించటం జరుగుతుంది. ఇలా అనవసరతలను దేహ వ్యవస్థ నుండి తొలగించటం వల్ల మానవ జన్మకు శుద్ధత, పారదర్శకత సిద్ధిస్తుంది. గిక సిద్ధికి శద్ధత, పారదర్శకతలు తొలి భూమికలు కదా.
వ్యక్తి స్థితి మానవ స్థితి వేరు వేరు
మన ప్రతి ఒక్కరిలో మాన్ ఫార్మ్ అంటే వ్యక్తి స్థితి, హ్యూమన్ ఫార్మ్ అంటే మానవ స్థితి అనే రెండు స్థితులు ఉంటాయి. మానవ స్థితిపైన ఖగోళ ప్రభావాలు ఉంటాయి. ఆ ప్రభావాల నుండి తప్పుకుంటే కానీ వ్యక్తి స్థితి నెలకొనదు. వ్యక్తి స్థితి అన్నది ఎవరిది వారిదే. ఈ ఇరు స్థితులు వ్యక్తి స్థితిలో సమానంగా ఉండవు. కాబట్టి ఉ అన్నది మాన్‌ఫార్మ్, జీఉ అన్నది హ్యూమన్ ఫార్మ్. ప్రతీ సాధకుడు అన్ని ప్లానిటరీ రెగ్యులేషన్స్ సాధన చేస్తేనే ఉ స్థితిని అందుకోగలిగేది. అంటే ఈ వ్యక్తి స్థితి ఎటువంటి ఖగోళ ప్రభావాలు లేని స్థితి అన్న మాట.
దీనే్న మనం యోగ పరిభాషలో ‘న్యూ పిట్యూటరీ’ అంటున్నాం. ప్లానెటరీ రెగ్యులేషన్స్ సాధనా కాలమంతా ఇది ‘న్యూ మోడల్ పిట్యూటరీ’గా మార్గదర్శకత్వం వహించి, సాధన పూర్తయిన తర్వాత ‘న్యూ పిట్యూటరీ’గా మనలో నిలదొక్కుకుని, మన భౌతిక, అధిభౌతిక వ్యవస్థలకు అన్ని విధాలా నూతనత్వాన్ని కలగజేస్తుంది. ఇలా మనం ‘న్యూ మాన్’ అవుతాం.
అశుద్దాంశ శుద్దంగా నిలదొక్కుకోవలసిందే
‘రూప’ జగత్తులోకి వచ్చిన తొలి ‘అంశ’ ప్రామాణికమైంది. శుద్ధమైంది, పారదర్శకమైంది. ఈ ప్రామాణిక అంశనే అంటే ఎటువంటి కలుషితాలు, దోషాలు అంటని తొలి స్థితి మనం ‘మొనాడ్’ అంటున్నాం.
ప్రామాణికమైన ఈ ‘మొనాడ్’ అంశ పరిణమిస్తూ మొదటగా ఎలా కాంతిని, జీవాన్ని ప్రోది చేసుకుందో అలాగే ఖగోళ మండలాలను దాటుతూ ఖగోళ ధూళిని, అక్కడి నుండి భూగోళాన్ని చేరుకుంటూ ఈథర్ అంటే వాయువును, ఎయిర్ అంటే గాలిని సైతం వెంట తెచ్చుకుంటుంది. వీటికి పంచభూతాలు కలవగా ‘మొనాడ్’ అంశ మానవ రూపాన్ని సంతరించుకుంటోంది. తొలుత అంశ ప్రామాణికంగానే తన పరిణామ ప్రయాణాన్ని ప్రారంభించినా మానవ అంశగా రూపుదిద్దుకుని తన ప్రామాణికతకు, శుద్ధత్వానికి, పారదర్శకతకు దూరమై లోప, దోష భూయిష్టమవుతోంది. శాటర్న్, సన్ వంటి ప్లానెటరీ రెగ్యులేషన్స్ సాధన ద్వారా ఎలా ఖగోళ ధూళి నుండి విముక్తమవుతున్నామో అలాగే ఎయిర్ గాలి నుండి, అవసరాన్ని బట్టి ఈథర్ అంటే వాయువు నుండి సైతం విముక్తం కావాలి. అంటే గాలి, వాయువుల ద్వారా సైతం మనలోని కలుషితాలను, దోషాలను వదిలించుకోగలగాలి. శాటర్న్, సన్ రెగ్యులేషన్స్ సాధనతో ఈ దోష రహిత స్థితి సాధ్యమవుతుంది.
అగ్నితత్వంతో కుండలినీ శక్తిచాలనం
‘మొనాడ్’ విశ్వం నుండి సృష్టిలోకి వస్తున్న దిశలో విశ్వంలోని పనె్నండు గ్లోబ్స్ అంటే మండలాలను, వీటివే అయిన ద్వాదశ స్పెసిఫిక్‌లను దాటుకుంటూ వస్తున్న క్రమంలో పదమూడు శక్తి స్థితులను కూడా దాటవలసి ఉంటుంది. ఈ శక్తి స్థితులనే మాస్టర్ యోగంలో ‘్థర్టీన్ ప్లానెటరీ ఫోర్సెస్’ అని అంటున్నాం. వీటితో పాటు ‘సెవెన్ అడ్జస్ట్‌మెంట్స్’, ‘సెవెన్ బోరింగ్స్’ సైతం మానవదేహం దోష రహితం కావటానికి ప్రణాళికా బద్ధ సాధనలో భాగం కావాలి. ఈ క్రమం తప్పని సాధన వల్ల మనం దైనందిన జీవితానికి కొత్తగా జతకూడుతున్న కాలుష్యాలకు దూరం కాగలుగుతాం.
మన కుండలినిలో ఉన్న శక్తి ‘సూక్ష్మ అంశ’గా ఖగోళ, వాయు తదితరాలతో కలిసినటువంటిది. ప్రామాణిక ఆది అంశను మనం ‘సూక్ష్మ అంశ’గాను, మానవ రూపంలోని ఖగోళ ధూళిదూసరిత అంశను ‘స్థూల అంశ’గాను మనం చెప్పుకుంటున్నాం. ఈ నానా కలుషితాల ‘స్థూల అంశ’నే మానవ కుండలిని మూడున్నర చుట్లుగా నిద్రాణ లేదా స్థిబ్ద స్థితిలో ఉన్న అంశ. శాటర్న్ రెగ్యులేషన్స్ సాధన వల్ల మానవ కుండలిని బోర్ అంటే తొలచబడి సన్ రెగ్యులేషన్స్ సాధనతో ప్రజ్వరిల్లుతుంది. అంటే అగ్ని తత్వంతో కుండలినీ శక్తి చైతన్యమై ఊర్థ్వ ప్రయాణం ప్రారంభించి మనలోని ఆరు ప్రధాన శక్తి కేంద్రాలలో శక్తి చాలనమవుతుంది. ఈ ఆరు శక్తిచాలనా కేంద్రాలనే మనం షట్చక్ర స్థానాలంటున్నాం. ఒక్కో కేంద్రాన్ని దాటుతున్నప్పుడు కొన్నికొన్ని దోష ప్రవృత్తుల నుండి మనం విముక్తమవుతుంటాం. అలా విముక్తమవుతూ ఆది అంశ అంటే ‘సూక్ష్మ అంశ’ స్థితికి చేరుకుంటాం. అంటే మన మానవ మనుగడ ప్రామాణికతను సిద్ధింపచేసి, గిక పరిణావానికి సిద్ధ భూమిక అవుతాం.
మనం రహస్య పుట్టలమే
మన భారతీయ పురాణ సాహిత్యం సూర్య శనులను తండ్రీకొడుకులుగా చిత్రిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ఈ రెండు గ్రహాలను విరుద్ధతత్వ గ్రహాలుగా చెబుతోంది. నిజానికి ఈ రెండు గ్రహాలు మనల్ని ఆత్మజీవుల్ని చేస్తున్నాయి... సంకల్ప సిద్ధుల్ని చేస్తున్నాయి. మన ఆథ్యాత్మిక, గిక పరిణావంలో ఈ రెండు గ్రహాల ప్రభావం అధికం. జీవన పాఠాలు చెప్పేది ఈ సూర్య శనులే. ఈ రెండు గ్రహాలలోను సూర్యుడు శక్తి ప్రదాత, యోగ కారకుడు. శని ప్రభావం వల్ల సాధకుడు రహస్య పుట్ట అవుతాడు...రహస్యాలను వెలికి తీయటంలోనూ యోగలు ముందుంటారు. మాస్టర్ సి.వి.వి. ఇలా ఖగోళ రహస్యాలను, సృష్టి రహస్యాలను బహిర్గతం చేసిన మహాయోగి. అందుకే మాస్టర్ యోగం ‘భృక్త రహిత తారకరాజయోగ’మైంది.

-విశ్వర్షి 93939 33946