S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలావుందీ వారం? (మే 1 నుండి 7 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఉత్సాహంతో పనిచేసి పెద్దల, అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అవసరాలకు పైకం అందుతుంది. కుటుంబ సభ్యుల ఆదరణ లనిస్తుంది. యాత్రలకు వెళతారు. ఆస్తి విషయాలందు లౌక్యం అవసరం. వ్యయం అధికం. అనుకోని రీతిలో ఇతరుల పనులు నిర్వహించాల్సి రావచ్చు. సరైన నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. హామీలు ఇవ్వవద్దు. సంఘ కార్యక్రమాలందు మెరుగైన సేవలందిస్తారు. దంపతులు ఒకే మాటపై పనులు నిర్వహించడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

కార్యక్రమాలు పూర్తి చేస్తారు. లోపాలు అధిగమిస్తారు. ముందస్తు పథకాల ద్వారా అన్నింటి సౌలభ్యం పొందుతారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. బంధుమిత్రుల సహకారం అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల వారు ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఉద్యోగులకు పనులు ఒత్తిడి. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)

పనులు పూర్తవుతాయి. అనుకోని విధంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు అనుకూలం. ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల అండదండలుంటాయి. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. వృత్తి, ఉద్యోగులకు మంచి తరుణం. విద్యార్థులకు పోటీ పరీక్షలలో మంచి అవకాశాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అనాలోచిత నిర్ణయాలు వద్దు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

కష్టసాధ్యమైనా పనులు పూర్తి చేస్తారు. జీవన సరళిలో ఆశించిన మార్పులు ఉంటాయి. సాంఘికంగా, వ్యక్తిగతంగా గౌరవ ప్రతిష్టలు మెరుగవుతాయి. బంధు మిత్ర వర్గాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. వాహనం నడపటంలో జాగ్రత్త వహించండి. శుభకార్యాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు అనుకున్నట్లుగా ఊపందుకుంటాయి. ప్రమోషన్లు, బదిలీలు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. కుటుంబంలో స్ర్తిల మాట నెగ్గుతుంది. సంతాన ప్రాప్తి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
చాకచక్యంతో, తెలివితేటలతో ఊహించని సంఘటనలను అనుకూలంగా మార్చుకొంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఇతరుల లోపాలను ఎంచకండి. సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవద్దు. బ్యాంకు లాకర్ల విషయంలో, డబ్బు వ్యవహారాలలోనూ జాగ్రత్త అవసరం. సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలించవు. దంపతులు మాట పట్టింపులకు పోవద్దు. శుభకార్యాలు కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

అశాంతికి తావివ్వకండి. ఆలస్యంగానైనా రావలసిన బకాయిలు అందుకుంటారు. ధైర్యసాహసాలే మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, కళారంగాల వారికి అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. విద్యార్థులు కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ప్రయత్నం చేస్తే అనుకున్నవి సాధిస్తారు. దంపతులు సామరస్యంతో మెలగండి. విలువైన సమాచారం పొందుతారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. లాభకరంగానూ ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఆదాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలందు కృషికి తగిన ఆదాయం. కోర్టు విషయాలు మందకొడిగా సాగినప్పటికీ పరిష్కార మార్గాలు గోచరించవచ్చు. దంపతుల మధ్య అవగాహన కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. సంఘంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం తృప్తికరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

కార్యాలు సానుకూలంగా పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం. ఉద్యోగులకు మంచి సమయం. అధికారుల మన్ననలు పొందుతారు. స్పెక్యులేషన్ లాభదాయకం. ఆగిపోయిన పనులు మీదైన చొరవతో పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలం. పోటీ పరీక్షలకు, ఉద్యోగ ప్రయత్నాలకు మంచి తరుణం. స్ర్తిలు చేసే వ్యాపారాలు ఊపందుకుంటాయి. తప్పని సరైతేనే ప్రయాణాలు చేయండి. అదీ తక్కువ సామానుతో. ఈ వారం అప్రమత్తంగా మెలగాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)

చాకచక్యంతో పనులు పూర్తి చేస్తారు. ఇతరుల మాటలు తూటాలుగా ఉన్నా మీ పనుల పూర్తి విషయంలో ఢోకా లేదు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. లాభకరమైన పనులకు పైకం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు లాభిస్తాయి. మీ మాటలకు అన్నింటా ప్రాధాన్యత లభిస్తుంది. కొన్ని విషయాల్లో జోక్యం కూడదు. పొదుపు అన్నింటా మదుపునకు మార్గాలని గుర్తించండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

వ్యవహారాలు కలసి వస్తాయి. దైనందిన కార్యక్రమాలు మందకొడిగా సాగినా, చివరికి ఇతరుల సాయంతో పూర్తి చేయవలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలవారు కృషికి తగిన లాభాలందుకుంటారు. శుభకార్యాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు ఇష్టపడి చదవాలి. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. స్పెక్యులేషన్ కొంచెంగా అనుకూలిస్తుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ముందస్తు ప్రణాళికలతో పనులు పూర్తి చేస్తారు. కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్య పనులు నిర్వహిస్తారు. బంధుమిత్రులు అవసరానికి సాయపడతారు. గౌరవ మర్యాదలు మెరుగవుతాయి. ఉద్యగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. విద్య, వ్యాపార, వృత్తి రంగాల వారు అనుకున్నవి కృషి మేరకు పొందుతారు. దంపతులు పొరపొచ్చాలు లేకుండా మెలగండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అతి మంచితనం అన్ని విషయాల్లో ఇబ్బందికరం అని గుర్తిస్తారు. కొన్ని వ్యవహారాల్లో చాకచక్యంగా బయటపడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల వారు ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించండి. ప్రయాణాలలోనూ, వాహన వినియోగంలోనూ అప్రమత్తత అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. లౌక్యంగా అన్ని విషయాలలో వ్యవహరించండి.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855