S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీపికా..మజాకా!!

బాలీవుడ్‌లో ఎవ్వరి నోట విన్నా ఒకటే మాట..అదే దీపికా పదుకొనే గురించి. ఆమె వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడూ వార్తల్లోనే వుంటూ తన కెరీర్‌ను కాపాడుకుంటూ వస్తోంది. విభిన్నమైన చిత్రాల్లో వెరైటీ పాత్రలు చేసి అందరి మనసులను కొల్లగొట్టిన ఈ భామ తాజాగా సల్మాన్‌తో చిందేయనుందట. ఇదే ఇప్పుడు బాలీవుడ్ అంతా హాట్ హాట్ టాపిక్‌గా మారిందట. చాలా కాలంగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయాలని పలువురు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు తెగ తాపత్రయ పడుతూనే వున్నారట. గతంలో సల్మాన్‌తో ఓ రెండు చిత్రాల్లో దీపికానే అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇద్దరికీ డేట్స్ కుదరకపోవడం వల్ల అలా జరిగిందట! ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి నటించే సమయం ఆసన్నమైందట. ‘్భజరంగీ భాయిజాన్’ ఫేమ్ కబీర్‌ఖాన్ దర్శకత్వంలో మరోసారి సల్మాన్ నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయిక పాత్రను దీపికా పదుకొనేను అడిగితే ‘సల్మాన్ సినిమా అంటే కాదంటానా?’ అని అంటూనే నా క్యారెక్టర్ బావుంటేనే ఓకే చేస్తానని చెప్పుకొచ్చిందట. అదీ..సంగతీ!! దీపికా..మజాకా మరి!!

-సమీర్