S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిగ్నల్

నేనిపుడు సాహిత్య దిగంబరున్ని
కావాలని ఉంది
సౌందర్యం, నందనవనం, చిరుగాలి, సంగీతం
ఆనందం, అమృతాభిషేకం లేని - దొరుకని
వ్యవస్థలో
ఇంకెందుకు పదాలకు సౌందర్యం
ఇంకెందుకు వాక్యాలకు సుందరమ్
సుందరమ్, అమృతం, నందనం
కవిత్వమని కొందరంటారు కానీ-
ఏదీ ఎక్కడ కనిపిస్తుంది
మనసులో వెనె్నల చిరుగాలులు
వెనె్నల్లో ఆడుకునే ఆడపిల్లలు లేరు
వరదలో పడవలనేసే చిన్నపిల్లలు లేరు
ఇంటి ముందు గంభీరంగా గంటనూపె
గంగిరెద్దు లేదు
గోడమీద పిట్టలు లేవు
వాకిట్లో పావురాలు లేవు
ప్రతిదినం పత్రిక ఆనందాన్ని కాదు
దుఃఖాన్ని మోసుకొస్తుంది
జలపాతం కన్నీళ్లు కారుస్తున్న దృశ్యం
జాబిలి చీకటిని మోస్తున్న చిత్రం
తూర్పు అస్తమయాన్ని కౌగిలించుకొంటున్న కోణం
ఇవేవీ మంచి శకునాలు కావు
సాహిత్యాన్ని దిగంబరం చేయటానికి
సంకేతాలు ఇవి-

-సిహెచ్.మధు 9949486122