కూడు కోసం
Published Monday, 9 May 2016అటు ఇటు కాని
మూడవ జాతిలో వర్ణ రంజితమై
కూసిన కోయిల
బతుకు దారిలో
రైలు పట్టాల మీద అస్తిత్వం కోసమై
దేహాన్ని దేహి అంటూ
బతుకీడస్తుంది!
బతుకు చిత్రం
వీధుల్లో
చించబడితే
ఆకలి
నడిరోడ్డుపై
నృత్యం చేయిస్తుంది.
వాళ్లంతే,
పొట్ట నింపుకోవడానికి
నిఖార్సైన నిజాన్ని
వొంటికి అలుముకొని
సంచరిస్తూ ఉంటారు.