S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రేసులో వెనుకంజ?

అందం, అభినయం, అందాల ఆరబోత..ఇలా అన్నింటికీ ఎంతో ముందున్న బ్యూటీ రెజీనా పరిస్థితి మాత్రం టాలీవుడ్‌లో ఏ మాత్రం ఆశాజనకంగా లేదంటే లేదు. అంతేకాదు, లిప్ టు లిప్, లిప్‌లాక్‌లకు కూడా తలుపులు తెరిచే ఉంది. అయినా కెరీర్‌లో ఎదుగూ బొదుగూ లేకుండాపోయింది. రెజీనా పరిస్థితి చూసిన వారంతా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని భావించారు. తను ఈ విషయంలో ఎన్నో కలలుకన్నది. తనతోపాటే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్‌ప్రీత్‌సింగ్, రాశీఖన్నాలాంటి భామలు రివ్వున దూసుకెళుతుండగా, రెజీనా మాత్రం రేసులో వెనకబడిపోయింది. రెజీనా పరిస్థితి ఇలా కావడానికి కారణం ‘శౌర్య’, ‘సౌఖ్యం’లాంటి సినిమాలే కారణం అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయం గురించి రెజీనాను కదిలిస్తే- ‘‘ఎవ్వరి తలరాత ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. నా మటుకు నా కెరీర్ సాఫీగానే సాగుతోంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. నాతోటి నటీమణులు దూసుకెళుతున్నారంటే నేనేం పట్టించుకోను. ప్రస్తుతం నేను మాత్రం కెరీర్ పరంగా హ్యాపీనే’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..రెజీనా!!

కెరీర్‌పై శ్రద్ధ!

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకుంటోంది. చేసిన చిత్రాల్లో తన పాత్ర తీరుతెన్నుల గురించి బాగా శ్రద్ధ తీసుకోవడం వల్లే మంచి చిత్రాలు..మంచి బ్యానర్లు ఆమెను వరిస్తున్నాయి. అనతి కాలంలోనే సోనాక్షి అగ్రతారగా విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అకిరా’ చిత్రంలో సోనాక్షితో పాటు కొంకాణాసేన్ కూడా నటిస్తున్నారు. వీరిద్దరు కలిసి నటించిన సన్నివేశాలు చిత్రంలో చాలా వున్నాయట. ‘‘కొంకణాసేన్ ఓ అద్భుతమైన నటి. ఆమెతో కలిసి నటించడం మరపురాని అనుభూతి. ఇప్పటి వరకు కొంకణా నటించిన సినిమాలన్నీ చూశాను స్క్రిప్ట్‌ల దగ్గర్నుంచి పాత్రల వరకు ఆమె ఎంపిక చేసుకునే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె నటించిన ప్రతీపాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంటుంది’’అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి. బిజీ..బిజీగా కెరీర్‌ను మలుచుకుంటున్న సోనాక్షి ఇక ముందు కూడా ఇలాగే పరుగులు పెడుతుందని అందరూ భావిస్తున్నారు. అదీ..సంగతీ!!

ఇక బాలీవుడ్‌లోకి...

‘కొత్త బంగారులోకం’ బ్యూటీ శే్వతాబసుప్రసాద్ గుర్తింది కదా. బాలనటిగా జాతీయ పురస్కారం అందుకున్న ఈ అమ్మడు అనుకోకుండా వ్యభిచారం కేసులో పట్టుబడి సంచలనం రేపింది. ఎదుగుతున్న వయస్సులోనే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆమెపై పోలీసులు కేసు పెట్టినప్పుడు టాలీవుడ్ జాలి చూపింది. కానీ ఆమె జాలి వద్దు అవకాశాలు ఇవ్వమని ప్రాధేయపడింది. ఆ సమయంలో చాలా మంది ఆమెకు అవకాశాలు ఇస్తామని హామీలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె వైపునకు చూసిన దాఖలాలే లేవు. ఆ సమయంలోనే ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ తన సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో వున్నాడట. ఆ విధంగా శే్వత ఇక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ తానేంటూ నిరూపించుకోవాలనుకుంటుందిట. త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో శే్వత ముఖ్య భూమికను పోషించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందట. వాహ్..శే్వత ఆల్ ది బెస్ట్!!

-సమీర్