S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అలల కలలు

మా కలలన్నీ అలల్లోనే
మా వలలన్నీ తలల్లోనే
మా బ్రతుకంతా తీరంలోనే
దేశం దశాబ్దాల స్వాతంత్య్ర సంబరాల్లో
మున్గి తేలుతుంటే
మేం కర్రాకుల్లో చేపలెండేస్తుంటాం.

లోకం దీపావళి మతాబుల్లో వెలిగిపోతుంటే
ఎండిన చేపలు తడిశాయని మేం
గుడిసెల్లో నత్తలౌతాం.

చేపలు పడితే సంబరం
వానొచ్చి తడిస్తే విషాదం
ఆనంద విషాదాలు మా బతుకుల్లో
పడుగు పేకలైనాయి.
నాటి చేపల రాశులు ముత్తాతల అనుభవాలై
జేజెమ్మల జ్ఞాపకాల పొరల్నిండా
అనుభవాల స్మృతులైనాయి

నెలకోసారైనా చేపల కూర దొరకని
గడ్డు రోజుల్లో వలల్లో కళ్లు పెట్టి
ఆశగా చకోరాలైనాం.

దోమతెర వలల్తో వేటాడి
కడుపాత్రాన్ని ఆర్చుకుంటున్నామే కానీ
రేపటి తరానికి వారసత్వాన్ని
మిగల్చాలన్న ముందుచూపే కొరవైంది.

అందుకే మా కలలన్నీ అలల్లో కలిసిపోయి
తెల్లని నురగలై తేలిపోతాయి.

ఆడదేనా?
-గార రంగనాథం
9885758123
కన్నవారికి హెచ్చు -పుత్ర ప్రేమ
ఆడకూతురనిన -ఆడపిల్ల
అమ్మ చెట్టుకు తాను -ఎండుకొమ్మ
అత్తవారికి ఆమె -కబాబు పుల్ల
తల్లి పక్షికి లేదు -తారతమ్యము
మనిషికెందుకు రాదు -మంచి మనసు?

మారీచ సుబాహులకు -ఆమ్ల దాడులు చేతకావు
రావణుడెపుడూ సీతను బలాత్కరించ -తలచలేదు
క్రూరమృగాలూ -సామూహిక అత్యాచారం చెయ్యవు
దుష్ట మానవులు ఆమె ఇష్టానికి -విలువివ్వరు
రాక్షస నేరాలకు -కర్కశ శిక్షలే జవాబు.

‘ఒరులేయవి యొనరించిన’ వివరించని పాపం ఇది
తన తల్లిని, తన చెల్లిని చెరిస్తే తెలిసే దుఃఖం ఇది.

నిన్ను భరిస్తానంటాడు
పసుపుతాడుతో -నీ ఊపిరికి ఉరి బిగిస్తాడు
నిన్ను సమిధను చేసి -చలి కాచుకుంటాడు
నీ వొంటి స్తంభంపై -్భగ సౌధం కడతాడు

నిన్ను పునాదిలోనే సమాధి చేస్తాడు
నీవులేని నాడు - మగాడు లేడు
నీవు లేకుంటే - జగానికి మనుగడే లేదు.

అర్ధాంగికి నిచ్చెన కాగలిగిన వారెందరు?
ఇల్లాలిని సిగపువ్వుగ భావించే శివుడెవ్వడు?

హింసాత్మక ప్రవృత్తులకు దూరంగా తొలగిపో
త్యాగధనుల, ప్రేమమయుల రాగంతో శృతి కలుపు
శరీర శక్తుల జ్వలింపజేస్తూ - బుద్ధిజీవిగా బ్రతక నేర్చుకో
వాస్తవ హక్కుల వశం చేసుకో - అచ్ఛపు స్వేచ్ఛతో
ఆనందించు
ఆడున్నా, ఏడున్నా నీ వారికి నీడను కల్పించు
సమాజ పుస్తక ముఖ చిత్రంగా శాశ్వత స్థానం సాధించు.

అనే్వషణ

-కోవూరి నర్సింలు
9676310056

నా హృదయం
నీది కాదు-
మనిద్దరి స్పందన
నా ఎదురుచూపు
నీవు కావు
మనిద్దరి చూపులు కలిసిన
ముందు చూపు.
నా ఆలోచన
నీవు కాదు
మన స్మృతుల్ని తలచిన
అద్భుతమైన ప్రేమ కావ్యం
నా మనసు
నీది కాదు
ప్రాణంలో శ్వాస
మనలో ఊపిరి.

గాధా

-రాపోలు పరమేశ్వరరావు
9951416618

కాషాయం
ధరించిన
గొప్ప వేదాంతి
భార్య టార్చర్

నరకం
అంటే
తెలియని
పిచ్చోడా
చేసుకో
పెళ్లి

బ్రతికి
ఉన్నప్పుడు
భార్య
పోయాక
యముడు
రెండు నరకాలు


కౌంటర్‌లో
వున్నారు
మీరు
ఎన్‌కౌంటర్

సన్యాసిగా
మారడానికి
సహకరించిన
సతీమణి
శాడిస్ట్

మెంటల్
వచ్చింది
అతనికి
కారణం
ఏముంది?
భార్య సైకో
*

-ఆవుల వెంకటరమణ 9494088110