S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవ జీవనం మానసిక క్రీడనే

ఆత్మ అస్తిత్వానికి రెండు ముఖాలు.. ఆత్మ! పరమాత్మ!!
జీవాత్మకు నెలవు దేహం.. పరమాత్మకు నెలవు విశ్వం.
జీవాత్మ చరించేది ప్రవృత్తిలో.. పరమాత్మ వర్తించేది ప్రకృతితో.
ప్రవృత్తి అంటే మానసిక ఆచ్ఛాదనలోని భౌతికత.
ప్రకృతి అంటే సృష్టి విన్యాసానికి చెందిన అధిభౌతికత.
ఆత్మ ‘జననం - మరణం’ అంటూ దేహాన్ని చేరుతుంది... అదే దేహాన్ని వీడుతుంది. ఈ జనన మరణాలు భౌతిక మానసిక క్రీడలు.. అధిభౌతికంగా అతీత మానస ప్రజ్ఞాన వీచికలు.
నిజానికి మనసువల్లే ‘జీవితం’ పురుడు పోసుకుని జీవన యానం సాగిస్తోంది. మనసు వల్లే ‘ఆశ’ పల్లకీ ఎక్కుతోంది.. మనసు కారణంగానే ‘జీవం’ శరీరం నుండి తప్పుకుంటోంది. అంటే స్వంత ఇంటి నుండి ఏదో పనిబడి బయటికొచ్చి మానవ గృహాన్ని చేరి పొద్దుగ్రుంకటంతో అద్దె ఇంటి నుండి స్వగృహాన్ని చేరుకుంటోంది. పనిలో మునకలయినంత కాలం ఆత్మ సైకిక్ బీయింగ్ అవుతోంది. పని ముగించుకున్నాక, పనికి బయలుదేరక పూర్వమూ అది శుద్ధాత్మగానే ఆత్మ సంపన్న. పరిమితులు లేని అపరిమిత శుద్ధాత్మ పరిమితత్వంతో అశాశ్వత వైఖరితో జీవాత్మగా కొంతకాలం చరించటమే మానవజన్మ.
భౌతికంగా ఆత్మ అశుద్ధాత్మ. అధిభౌతికంగా శుద్ధాత్మ. శుద్ధాత్మకు జనన మరణాలతో పనిలేదు... కారణం అవి అశాశ్వతాలు కాబట్టి. అందుకే అనేది ఆత్మకు పుట్టుకా లేదు, చావూ లేదు అని. ఆత్మకు దేహం ఒక తొడుగే అయినా దేహంతోపాటు మనస్సూ పుట్టుకొస్తుంది. అంటే దేహానికీ, మనస్సుకూ ఆత్మ ఆలంబన అవుతూనే ఉంటుంది. దేహంతో మనస్సు పుట్టుకొచ్చినట్టే ఆ దేహ త్యాగంతో మనస్సూ తప్పుకుంటుంది. అంటే ఆత్మ జీవాత్మగా చరిస్తున్నది మానసికంగానే.
మన మానవ జీవనానికి మనస్సే భూమిక.. జీవాత్మకు మనస్సుతో సహచర్యం తప్పనిసరి. ఇలా సైకిక్ బీయింగ్స్‌గా మనగలుగుతున్న మనం జీవాత్మలమే తప్ప మానవ రూపంలో ఉంటూ అరూపం కాగలిగితే శుద్ధాత్మలం అయ్యే తీరతాం. మనస్సు నుండి విడివడిననాడు శుద్ధత్వం అంటే ప్యూరిటీ ప్రకాశిస్తుంది.
సైకిక్ బీయింగ్ అంటే మానసిక స్థితి అనే. అంటే మన మానవ జన్మనే ఒక మానసిక ప్రాంగణం. ఉద్వేగాలన్నీ ఈ మానసిక స్థితి నుండి పుట్టుకొచ్చేవే. మనిషిని పట్టి పీడించేవే... మనసును కుదిపేసి మనిషిని క్రుంగదీసేవే. ఇలా దుఃఖానికి, విషాదానికి మనస్సే ముఖ్య భూమిక అవుతోంది. ఈ మనస్సే జీవాత్మతో క్రీడిస్తోంది. సరిగ్గా ఇలాగే గీతలోని అర్జున ఉద్వేగాలన్నీ మానవ జీవితానికి ఒక విషాద యోగాన్ని అందించాయి.
అసలు ఉద్వేగం అంటేనే మనసు జీవాత్మతో చేసే జిమ్మిక్కు. ఈ జిమ్మిక్కుల నుండి గమ్మత్తుగా బయటపడగలగటానికి మార్గమే యోగ సాధన... సంసార యోగం. అంటే జీవితాన్ని ఉద్వేగాలు వక్రింప జేయకుండా జాగ్రత్త పడగలగాలి. ఉద్వేగాల్ని కౌగిలించుకుంటూ గ్రహాలు వక్రించాయనటం గిక లక్షణం కాద. ఆ గ్రహాలను శుద్ధాత్మగా అధివసించటం యోగ లక్ష్యం. జీవాత్మ భూకక్ష్య నుండి బయటపడి శుద్ధాత్మగా గ్రహ మండలాలలో ఆవాసం సాగించటమూ యోగ సాధనా ఫలితమే! ఈ యోగా రూఢ అంశానే్న గీతాచార్యుడు
‘ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మవసా దయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః’ అని అంటాడు.
మానవ జన్మ సాగేది సంసారం అనే సంద్రంలో. ఈ సంసార సాగరం నుండి ప్రతీ జీవాత్మ తనను తాను ఉద్ధరించుకోవాలి. తన మానస సాగరం నుండి తానే తీరాన్ని చేరుకోవాలి. ఇదే ఆత్మోద్ధరణ. అంతేకానీ అధోగతి పొందటం జీవాత్మ లక్షణం కాదు, లక్ష్యమూ కాదు. నిజానికి ఈ మానవ జన్మలో ఒక విధంగా జీవాత్మ తనకు తానే శత్రువు, ఇంకొక విధంగా తనకు తానే మిత్రువు అంటే బంధువు. మన మానసికాత్మ మనకే శత్రువు కావటం అంటే సంసార యానంలో మన జీవనగతి ఆత్మహత్యా సదృశం కావటమే! అధోగతిపాలు కావటం అంటే ఆత్మహత్య అనే! కాబట్టి జీవాత్మ జితాత్మ కావాలి! అదే ఆత్మోద్ధరణ.
‘ఆత్మనా’ ‘ఆత్మానమ్’ ‘ఉద్ధరేత్’ - ఇదీ ఆత్మోద్ధరణ. అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవటం. ఇలా ఆత్మోద్ధరణకు బీజం పడ్డనాడు మానవ జీవనంలో దివ్య జీవనానికి అవకాశం లభిస్తుంది. మన మానవ జన్మ దివ్యత్వంతో పరిపూర్ణం కావటానికి అంకురార్పణ జరుగుతుంది. అంటే సాంసారికి మాయల నుండి వైదొలగటం ప్రారంభమైనట్లే! ఇలా ప్రాపంచిక తెరలు తొలగుతూ పోతుంటే అంతటా ఆత్మ ప్రకాశనమే! పరిణామంలో ఉన్నత పథాన్ని చేరుకోవటానికి ఆత్మోద్ధరణే ప్రధాన ఉపకరణం.
గికంగా ఈ స్థితి దైహికవైన మానసిక స్థితి నుండి అధ్యాత్మకం కావటం... ఆధ్యాత్మికత్వం నుండి అతీత మానసిక స్థితిని చేరటం. ఈ అతీత మానసమే సూప్రామెంటల్ స్టేట్. నిజానికి మానస, అతీత మానస స్థితుల నడుమ అంతరాత్మ స్థితి ఉంటుంది. అంటే అంతరాత్మకు ఒక ముఖం మానసికాత్మ అయితే మరొక ముఖం పరమాత్మ. మానసిక ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ అంటే విశ్వాత్మ. అంటే జీవాత్మ, పరమాత్మలకు కేంద్రం అంతరాత్మ అన్నమాట.
ఆత్మస్పృహ మానవ జీవనానికి ఎంతో అవసరం. ఈ దశగా స్పష్టమైన అవగాహన లేకుంటే ఎంతలా ఆధ్యాత్మికంగా అడుగులు పడుతున్నా అహంకారంతో మిడిసిపడుతూ దివ్య జీవనాన్ని కోల్పోతూనే ఉంటాం. నిజానికి సాధనా జీవనంలోనైనా మానసిక దౌర్బల్యం నుండి బయటపడగలగటం సాధ్యమే కానీ అహంకార వర్తనంతో హృదయ దౌర్బల్యం నుండి విడివడటం కష్టమే. కాబట్టి హృదయ దౌర్బల్యానికి లోను కాని యోగ సాధనతో మాత్రమే మనం ఉద్ధరింపబడిన ఆత్మలం కాగలం. అసలు కృష్ణుడు ఈ హృదయ దౌర్బల్యాన్ని తొలగించటానికే అర్జునునికి గీతోపదేశం చేసింది. ఈ గీతోపదేశాన్ని అర్జునుడు దృశ్యంగా అందుకుంటే మనం అదృశ్యంగా అందుకుంటున్నాం.. అంతే!

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946