S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిమ్మిక్కులకు దూరంగా...

చాలా మంది బాలీవుడ్ తారలు జిమ్మిక్కులతో కాలం గడిపేస్తుంటారు. అలాంటి జిమ్మిక్కులు వారి కెరీర్‌ను కాపాడతాయని వారి గట్టి నమ్మకం కూడా. ఇలాంటి జిమ్మిక్కుల విషయంలో కంగనా రనౌత్ మాత్రం ఎంతో దూరంగా వుంటుందిట. ‘‘తారల కెరీర్‌కు ఇలాంటి జిమ్మిక్కులు ఏ మాత్రం ఉపయోగపడవు. ఆన్‌లైన్‌లో ఎక్కువ హిట్స్ తెచ్చుకోవడమే ఇప్పుడు సూపర్‌స్టార్ అన్నట్టుగా మారిపోయింది. నేను చేసిన పని ఆధారంగానే పేరుతెచ్చుకుంటానుకానీ, సోషల్ మీడియాలో చేసే జిమ్మిక్కుల ఆధారంగా కాదు. సోషల్ మీడియాలో తన సామర్థ్యంతో ప్రజలను థ్రిల్ చేసేవారు, వారిని వెర్రి వాళ్లను చేసేవారే ఇప్పుడు సూపర్‌స్టార్స్ అవుతున్నారు. నిజ జీవితంలో ఏదైనా సాధించి సమాజానికి సేవ చేసే నిజమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులనే ఆదర్శంగా తీసుకోవాలి’’అంటూ చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.

-సమీర్