S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మధుర బాధ

ఫలాన్ని ఇచ్చే తరువుకే రాయిఘాతం
ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రకృతి మీదే శరాఘాతం
మనిషి ఎదుగుదలలో వైపరీత్య ధోరణి
క్షుద్బాధ తీరేందుకే అవిరళ కృషి
నాడు పొత్తిళ్లలో వొదిగిన పేగుబంధం
క్షీరధారకై కుమ్మిన తరుణం
గులాబీ గుద్దులు విస్మరించింది మాతృత్వం
అనుభూతి మేఘం పిండనిదే వాత్సల్యం వర్షించదు
గోరుముద్దలకై చెలరేగిన చిలిపి గారాబం
ముద్దుగా మారాం చేయడం శైశవత్వం
పంటి మధ్య ఆప్యాయత నలగటం అకృత్యం
అమ్మ చరిచిన ఘటన దిక్కులు పిక్కటిల్లే
లాలపోసినాక జోలాలికే నిద్రాణం
లేదంటే నిర్ణిద్రగానం
కొంగు నడక నేర్పిందంటే బ్రహ్మజ్ఞానం
కొంగు నడత మార్చిందంటే విడ్డూరం
మమకారం పధ్నాలుగు భువన బాంధంబుల కతీతం
కర్కశం జనించి తపన తెరదీసింది
తపన పరిఢవిల్లగా కరడు పురుడు పోసుకుంది
శుష్కించిన అనురాగం ఆశ్రయంగా ఓ ఆశ్రమం
ఎప్పటి పాల ఋణమో ఇప్పటికిది కాలకూట సమం
కన్నీటి పారదర్శకం వెనుక కనికరం
నిర్విరామంగా.. నియంతృత్వంగా.
*

-సయ్యద్ జహీర్ అహ్మద్ 9505152560