S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కవచం

సహకరించని సామాజిక నేపథ్యం
దరిజేరని సహవాసపు భావాంతరాలు
వ్యవస్థీకృతమైన పాలక అవ్యవస్థ
మైలపడిన మానవత్వాలు
నామమాత్రపు ఆలంబనలు
భరోసా లేని బలహీనపు పరిష్వంగాల మధ్య
భయవిహ్వలంబైన జీవన వలయాల నడుమ
* * *
వాడిన పగడపు పూల పెదవులపైన
విచ్చుకొన్న ఓ వసివాడని చిరువసంతం
మూడు శిశిరాల లేతప్రాయంలో
కేరింతలు కొడుతోంది
ఆ చిరుదరహాసపు లోగిళ్లలో
ఆ చిన్మయానందపు నిర్భయలోకంలో
* * *
అక్కడ కాలాలు మూడుకావు
వర్తమానం ఒక్కటే కాలమానం
భూత భవిష్యత్తులు దులిపేసుకొన్న బూజులు
కడుపులో చల్ల, కళ్ల ముందు ఆనందహేల
కొసవేలికో పట్టుకొమ్మ
ప్రవర్థమానం ఒక్కటే అక్కడి కొలమానం
* * *
తనువును మనసును కప్పేసిన
ఆ బాల్యకవచం ఎంతటి దుర్భేద్యమో కదా!
లలితమైన దాని లావణ్యపు నిర్మలతత్వం
ఎంతటి అమోఘమో కదా!
అందుకే అది ఒక
చింతలు లేని చీకట్లు తెలియని క్రాంతిధామం
అవ్యక్తమైన చిద్విలాసపు చిదానందాల పరంధామం

-కె.రవీంద్రబాబు 9052778988