S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆకాశంలో ప్రకృతి చిత్రాలు

నిర్మలమైన నీలాకాశంలో
చెల్లాచెదురుగా మబ్బుల తునకలు
సాగిపోయే మేఘాల అద్భుత దృశ్యాలు
గగనంలో తేలిపోవాలన్న ఉద్వేగం

మేఘాలన్నీ ప్రకృతి ఆకృతులకు ప్రతికృతులే
అవి సేంద్రియ నిరీంద్రియ రూపాలే
అనుభవ వైవిధ్యం పంచుకుందామంటే
కాలయవనికపై అన్నీ అశాశ్విత దృశ్యాలే
ప్రకృతి గీసిన చిత్రాలు క్షణాల్లో అదృశ్యవౌతాయి

మేఘాలంటేనే సుందర చైతన్యాకృతులు
నిరీంద్రియ రూపాలైనా అవి చేతనారూపాలు
రంగురంగుల కలయికతో రమ్యంగా కనిపిస్తాయి
రంగుల కలగలుపుల శాసించేది వాతావరణం
వాతావరణ పరిణామాలే మేఘాల్లో ప్రతిఫలిస్తాయి

వాటి కదలికల కట్టడి చేసే చోదకశక్తి గాలి
ఘీంకారం చేసే ఏనుగులా, ఎగిరే పక్షిలా,
వెంటాడి వేటాడే క్రూరమృగాల్లా
మందలుగా సాగిపోయే జంతుసమూహాల్లా
ఎదురెదురుగా మాట్లాడుకునే మనుషుల్లా
దట్టమైన అడవిలా, కొండల్లా లోయల్లా
నిశ్చల సముద్రంలా, సెలయేరుల్లా
మైదాన ప్రదేశాల్లా గలగల పారే నదిలా
అక్కడక్కడ స్వాగతం పలికే తోరణాల్లా
మేఘాలు గడియ గడియకు రూపాలు మారుస్తూ
రోజూ చూసే మేఘాలే అయినా అన్నీ అపురూపాలే
రూపానికి రూపానికి సారూప్యత బహుదూరం
నిజానికి మేఘాలకు రంగు ఉండదు

కాలుష్యంతో దుమ్ముధూళి చేరిన మేఘాలపై
సూర్యరశ్మి సోకితే వివిధ రంగులు కనిపిస్తాయి
మేఘాలు నీటి నురగలా ఉంటే పొడి వాతావరణం
వర్ష సూచనకు సంకేతం నల్లటి మేఘాలు
గాలివాన అయితే చురుకుగా కదిలే మేఘాలు
సూర్యోదయ సూర్యాస్తమయాల్లో
మేఘాలన్నీ కాషాయ రంగులోనో, ఎరుపు రంగులోనో
పాశ్చాత్య దేశాలలో తరచుగా కనపడే
ఆకుపచ్చని మేఘాలు మనకు కొత్త
అవి సృష్టిస్తాయి ఉగ్రమైన గాలివానను
రంగు ఏదైనా కొన్ని మేఘాలే మెండుగా వర్షిస్తాయి
కొన్ని దాగుడు మూతలాడుతూ స్వల్పంగా వర్షిస్తాయి
కొన్ని అలంకారప్రాయంగా కనపడి అదృశ్యవౌతాయి
మేఘాలు కరుణించి వర్షిస్తే చాలు
రైతుకు వ్యవసాయం వ్యవస్థితమే
సమస్త ప్రాణికోటికి జీవామృతమే

-పసుల వెంకటరెడ్డి 9849695603