S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మన ప్రమేయం లేకుండానే!

నిటారుగ నిలబడ్డ చెట్టొకటి
గట్టిగా వీస్తున్న గాలిదెబ్బకు
తలూపుతూ
కొమ్మల చేతులను ఆడిస్తూ
తన ప్రమేయం లేకుండానే నర్తిస్తుంది
అందమైన దృశ్యాన్నొక దానిని
కళ్ల కెమెరాలు
అసంకల్పిత ప్రతీకార చర్యలాగానే
బంధిస్తాయి!
‘హుద్‌హుద్’ తుఫాను లాంటిదొకటి
విరుచుకుపడి
భవనాల శిథిలాల కింద
మనకు తెలియకుండానే
మనల్ని సమాధి చెయ్యవచ్చు!
ఇంకా మన ప్రమేయం లేకుండా
చాలానే జరగచ్చు
రాజ్యాలేర్పడవచ్చు
కూలచ్చు!
నీకిష్టమున్నా లేకున్నా
ఇట్లాగే బ్రతకమని శాసించవచ్చు
జీవనాధారాల్ని లాగేసుకోవచ్చు
మనకు తెలియకుండానే
కాళ్ల కింద భూమి కదిలిపోవచ్చు
మనిషి పుట్టుక, బ్రతుకు
వృద్ధాప్యం, మరణం.
ఇవేవీ మనం వద్దనుకున్నా
మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నప్పుడు
దేన్నైనా ఎలా తప్పించుకోగలం!
***

గురుదేవో మహేశ్వరః

-మడిపల్లి హరిహరనాథ్
9603577655
అది ఒక
అక్షరాలోచనల అద్భుత ప్రపంచం
జాతి నిర్మాణ ‘కార్ఖానా’
అందులోకి
అద్వితీయమైన ముఖారవిందం
చిరుదరహాసంతో అడుగిడి
తోటమాలిగా...
కంటికి రెప్పలా కాపాడుతూ
లేలేత పూలపాదులకు
జ్ఞానధారతో వికసింపజేసి
విద్యాకుసుమాలుగా
ప్రపంచమంతటా
విరాజిల్లుతుంటే
చెక్కుచెదరని సౌశీల్యం
లోచనాలోచనాల చట్రంపై
మట్టిముద్దలను
సజీవ శిల్పాలుగా తయారుచేసి
నల్లబల్లపై
సుద్దముక్కను ఉపకరణంగా వాడి
నిరంతర సమగ్ర మూల్యాంకనముతో
మూర్తిమత్వాన్ని మధింపుచేసి
పునాదిని పటిష్టం చేసి
పౌష్టికాహారంతో
రెక్కలు బలీయంచేసి
విహంగాల్లా
విద్యా ప్రపంచంలో
ఎగిరేటట్లుగా
సుశిక్షితులుగా తయారుచేసి
నైతిక విలువలను
దార్శనికుల బోధనలను
వివేచన వివేకముతో వివరించి
వ్యక్తిత్వ వికాసాన్ని జాగృతపరచి
ఆత్మవిశ్వాసం ఆలంబనగా చూపి
రుజుమార్గ దిశలో పయనించేట్లు చేసి
తాను
కొవ్వొత్తిలా కరిగిపోతున్నా...
అజ్ఞానాంధకారాలను పారద్రోలి
విద్యార్థి లోకానికి
‘సూర్యుని’గా వెలుగొందుతూ
జ్ఞాన కిరణాలను

నలుదిక్కుల వెదజల్లుతూ
జ్ఞానకాంతులను ఆవిష్కరించి
విద్యాదానం చేసిన
మహిమాన్వితుడు - అపరబ్రహ్మ
గురుదేవో మహేశ్వరః
***

ఋతురాణి
-కె.విల్సన్‌రావు 8985435515

ఒక మహాచిత్రకారుడెవరో గీసిన చిత్రంలా ఆమె
ఒక మహాశిల్పి ఎవరో చెక్కిన శిల్పంలా ఆమె
అందమైన ఆకృతుల అమరికలా ఆమె
చల్లని నీళ్లిచ్చి దాహం తీర్చిన మట్టికుండలా ఆమె...

ఆమె పాదం మోపిన చోటల్లా
ప్రకృతి పరవశం
గడ్డిపూల పరిమళం...

పచ్చని బతుకుని
కలతల్లేని వెనె్నల రాత్రుళ్లని ప్రసాదించి
జీవన ప్రవాహాన్ని శృతిచేసిన
గునుగుపూల గుభాళింపు...

నా తలపై కిరీటంపెట్టి
నన్ను దేవుణ్ని చేసి
విరబూసిన ఋతురాణి...!

మేమిప్పుడు
ఇద్దరం కాదు ఒక్కరమే
చెట్టునంటుకుని విస్తరించిన కొమ్మల్లా...

-నూతలపాటి వెంకటరత నశర్మ 9866376050