S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆకులను కుట్టి గూళ్లు అల్లుకుంటాయ్

ఆసియాలో కన్పించే ఈ పక్షులను ‘టెయిలర్ బర్డ్స్’గా పిలుస్తారు. పొడవైన ముక్కు, ఆకర్షణీయమైన రంగులతో కన్పించే ఈ పక్షులు గూళ్లు అల్లుకునే విధానాన్ని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఆకులకు రెండు అంచులలో చిన్నచిన్న రంధ్రాలు చేసి పీచు, దారాలు చివరకు సాలెపురుగులు అల్లుకునే ‘సిల్క్’ తీగలతో కుట్టి గూళ్లు తయారు చేసుకుంటాయి. ఇవి చేసే రంధ్రాలు చాలా సన్నగా ఉంటాయి. ఆకులు తెగిపోని విధంగా అవి వాటి అంచులను కలుపుతూ కుడతాయి. ఒక దొనె్న లేదా సంచీలా ఆకును తయారు చేసి, వాటిలో మెత్తటి పీచు, పత్తి, గడ్డి వేసి గుడ్లు పెడతాయి. ఈ గూడు అల్లిక, పొదగడం పూర్తిగా ఆడపక్షి బాధ్యత. గుడ్లు పొదిగినప్పుడు దీనికి ఆహారాన్ని అందించే బాధ్యత మగపక్షి తీసుకుంటుంది. పిల్లలను రెండుపక్షులూ కలిపి సాకుతాయి. పది సెంటీమీటర్ల పొడవు, పది గ్రాముల బరువుకు మించని ఈ పక్షుల తోకలు నిలువుగా, పొడవుగా ఉంటాయి. అన్నట్లు ఇవి గూళ్లు అల్లుకునేందుకు సరైన దారం దొరకనప్పుడు మన ఇళ్లలో లభించే దారాన్ని చోరీ చేయడానికి కూడా అవి వెనకాడవు.

ఎస్.కె.కె.రవళి