S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్ట్రాబెర్రి.. ఓ వెర్రి

తియ్యటి రుచి, ఆకట్టుకునే రంగు, మంచి పరిమళంతోకూడిన స్ట్రాబెర్రి నిజానికి బెర్రి జాతికి చెందినది కాదు. అది గులాబి జాతికి చెందిన పండు. ఈ పళ్లంటే కొందరికి తెగ ఇష్టం. వింబుల్డన్‌లో టెన్నిస్ మ్యాచ్‌ల సీజన్‌లో అక్కడివారు 27వేల కిలోల పళ్లు తినేస్తారుట. పండు బయట విత్తనాలుండటం దీని ప్రత్యేకత. ప్రతి పండుకు 200 విత్తనాలుంటాయి. అన్నట్లు బయట కన్పించే ప్రతి విత్తనం అసలుది కాదు. అందులో మళ్లీ అసలు విత్తనాలుంటాయి తెలుసా. అమెరికాలో వీటి ఉత్పత్తి చాలా ఎక్కువ. బెల్జియంలో వీటికోసం ఏకంగా ఓ మ్యూజియం (స్ట్రాబెర్రి మ్యూజియం) ఉంది. అక్కడ స్ట్రాబెర్రి చరిత్ర, ఆధారాలు వివరిస్తారు. ఐదు గదుల ఈ మ్యూజియంలో ఆ పళ్లతో చేసే పదార్థాలు విక్రయిస్తారు. చివరకు స్ట్రాబెర్రి బీర్‌కూడా. ఎర్రగా నవనవలాడుతూ కన్పించే ఈ పళ్లు నిజానికి పసుపు, తెలుపురంగులోనూ లభిస్తాయి.
నీళ్లంటే ఇష్టం... ఈతంటే సరదా
క్యాట్ ఫ్యామిలీకి చెందిన పులి...ఆ జాతిలో అతిపెద్ద జంతువు. పిల్లిజాతి జంతువులకు నీళ్లంటే చికాకు. కానీ పులికి నీళ్లంటే ఇష్టం. ఈతకొట్టడమూ సరదాయే. ఏకబిగిన 6 కిలోమీటర్లవరకు అవి ఈతకొట్టగలవు. నీళ్లలో ఉంటూ వేటాడగలవు. వేడినుంచి ఉపశమనంకోసం నీటిమడుగులు, నదీతీరాలు, చెరువుల్లో సేదదీరుతాయి. ఏ రెండు పులులకూ ఒకేరకం చారలుండవు. 32 అడుగుల దూరాన్ని అవలీలగా దూకగలగడం వీటి ప్రత్యేకత. ఈ ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే జంతువు పులే. దాని తరువాతి స్థానం కుక్క. ఇది నేషనల్ జియాగ్రాఫిక్ ఛానల్ సర్వేలో తేలిన నిజం. అన్నట్లు అడవుల్లో ఉన్న పులుల సంఖ్యకంటే పెంచుకుంటున్న పులుల సంఖ్య ఎక్కువట. అదీ అమెరికాలోనే ఎక్కువమంది వాటిని పెంచుకుంటున్నారు. పులులు గురక పెడతాయని తెలుసా. అయితే మనం ఊపిరి పీల్చి వదిలినప్పుడు గురక పెడతాం. కానీ పులులు ఊపిరి వదిలినప్పుడు మాత్రమే గురకశబ్దం వస్తుంది.
బాక్టీరియాను చంపే వెండి
బంగారంకన్నా వెండికే మెరుపెక్కువ. పాలిష్ చేస్తే తళతళ వస్తుంది. దీనికి పరావర్తన గుణం అధికం. అందుకే అద్దాల పరిశ్రమల్లో వెండిని వాడతారు. మిగతా లోహాలకన్నా ఇది మేలైన ఉష్ణవాహకం. బంగారంకన్నా గట్టిదే అయినా రాగికన్నా మృదువుగా ఉంటుంది. ఒక ఔన్సు వెండితో 8 వేల అడుగుల పొడవైన తీగను రూపొందించించవచ్చు తెలుసా. వెండి ఉత్పత్తిలో మెక్సికో అగ్రస్థానంలో ఉండగా పెరు, చైనా ఆ తరువాత ఉన్నాయి. అద్దాలు, దంత, నాణాలు, ఆభరణాలు, సంగీత పరికరాలు, ఔషధాలు, ఫొటోగ్రఫీ పరిశ్రమల్లో వెండి వాడతారు. అన్నట్లు బ్యాక్టీరియాను సంహరించే గుణం వెండికి ఉంది తెలుసా. అందుకే ఆభరణాలు, వంటసామగ్రి, భోజన పరికరాల తయారీలో వెండిని ఎక్కువగా వాడతారు.
రోజుకు లక్షసార్లు కొట్టుకునే గుండె
మనిషి గుండెకొట్టుకునేటపుడు లబ్‌డబ్ అన్న శబ్దం వస్తుందని అందరికీ తెలుసు. అయితే గుండెలోని కవాటాలు మూసుకున్నప్పుడల్లా ఆ శబ్దం వస్తుందట. అన్నట్లు మన గుండె రోజుకు లక్షసార్లు బీట్ చేస్తుందట తెలుసా. జీవితకాలంలో అది 2.5 బిలియన్లసార్లు అది కొట్టుకుంటుంది. మన వంటింటిలోని కొళాయి విప్పితే 45 ఏళ్లపాటు దాన్లోంచి ఏకధాటిగా ధారపడితే ఎంత పరిమాణంలో నీళ్లు పడతాయో...అంతస్థాయిలో రక్తాన్ని ఓ మనిషి హృదయం పంప్ చేస్తుందట. మనిషి శరీరంలో ఇతర కండరాలకంటే గుండెలోని కండరాల పని ఎక్కువ.

-ఎస్.కె.కె.రవళి