S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ హవా!

సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అందరితోనూ ఆడిపాడిన అందాలభామ నయనతార హవా మళ్లీ ఊపందుకుంది. తమిళంలో అయితే ఎప్పటికప్పుడు తన క్రేజ్‌ని పెంచుకుంటూనే వుంటోంది. టాలీవుడ్‌లో సైతం మంచి ప్రాజెక్టులే చేసి, అగ్రహీరోలందరి సరసన గ్లామర్‌ని చిందించి ప్రేక్షకులను మైమరపింపజేసింది. తాజాగా తెలుగులో ఈ మధ్య చిరంజీవితో నటించే అవకాశం వచ్చినా, డేట్స్ కుదరక ఆ చిత్రానికి దూరమయింది. తన తాజా చిత్రం ‘మాయ’లో మరోసారి విజృంభించింది నయన. అయితే మరోసారి అలాంటి హర్రర్ చిత్రంలో నటించే అవకాశం నయనకు వచ్చిందట. అదీ..లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కే ‘ముని’కి సీక్వెల్ అట. ఇందులో లారెన్స్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ చిత్రంలో ఒక పాత్రకు కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసిన చిత్రం యూనిట్ మరోపాత్రకు నయనతారను సంప్రదిస్తే బాగా డిమాండ్ చేసిందట. అయినా సరే..నయన కావాలని ఒప్పేసుకున్నారట. ఇలా వీరిద్దరు తారలు ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఈ ప్రాజెక్టు క్రేజ్ మరింతగా పెరిగిపోయిందట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. భారీ పారితోషికం డిమాండ్ గురించి నయనను కదిలిస్తే- ‘‘నా పాత్ర అలాంటిది. అంత పవర్‌ఫుల్‌ది. కాబట్టే డిమాండ్ చేయక తప్పలేదు’’అంటూ చెప్పుకొచ్చింది. నయనా..మజాకా మరి!!

-సమీర్