S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమరత్వం చెందిన చెట్టు

ఆ చెట్టు నీడ అమ్మ ఒడిలా ఎంత హాయి
ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా
ఎన్ని ఆనందాల వెల్లువలో ఎన్ని అనుభవాల దొంతరలో
ఆ చెట్టు పూసింది నిలువెల్లా కళలతో పూలతో
పిల్లల్లో పూయించింది చిగురు కలలు
తల్లుల్లో పూయించింది బంగారు కలలు
ప్రేమికుల్లో పుష్పింప జేసింది వేల ఆశల్ని
అందరిలో పరిమళింప జేసింది జీవన సౌరభాల్ని
ఎందరో బహుదూరపు బాటసారుల్ని-
చల్లని నీడతో తడిమింది చెట్టు
పచ్చగా ఉండాలని ఆశీర్వదించింది చెట్టు
ఎనె్నన్నో ఆశలని ఊసులని
బాసలని గుమ్ముగా దాచింది చెట్టు
జడివాన దొంగలా దాడి చేసినప్పుడు
ఎందరికో గొడుగైంది చెట్టు
మండు వేసవిలో బాణుడు రువ్వే నిప్పుల రాళ్లకి
వందల కొమ్మల రెమ్మల
వేల ఆకుల అరచేతుల్ని అడ్డంపెట్టి
నిప్పు కణికల్ని ఉఫ్‌న ఊదేసింది చెట్టు
వౌన రుషిలా మహర్షిలా దివ్యత్వముతో తేజస్సుతో భాసిల్లింది చెట్టు
ఊరుకి అజాత శత్రువుగా నిలిచింది చెట్టు
రోడ్డు వెడల్పు యుద్ధంలో కర్కశ యంత్రాలు రావణ కుంభకర్ణుల్లా
అమానుషంగా దాడి చేసినా
పగతో కసితో తెగ నరుకుతున్న..
అహింసామూర్తి అవతారమెత్తింది చెట్టు
పువ్వులనే నవ్వులు చేసి షిర్డీసాయిలా నిలిచింది చెట్టు
నే పుట్టింది పరోపకారార్థమంటూ నా బతుకంతా
సమాజ హితమంటూ
నేనొక నవ్య దివ్య భవ్య దదీచి నంటూ సందేశమిచ్చి
నేలకొరిగింది వటవృక్షం
ఊరి కళ చెదిరింది చెట్టు ఇహలోక యాత్ర ముగిసింది
ఆ చెట్టు అమరత్వం పొందింది
శివసాయుజ్యం చెందింది.

-గులాబీల మల్లారెడ్డి 9440041351