S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీళ్లపై పరిగెట్టే తొండ

మధ్య అమెరికాలో కన్పించే ఈ తొండలు నీటి ఉపరితలంపై అతివేగంగా పరిగెడతాయి. అదీ వెనుక రెండు కాళ్లతోనే. ఏసుక్రీస్తు నీటిపై నడిచాడన్న విశ్వాసం మేరకు వీటినీ ‘జీసస్ క్రైస్ట్ లిజార్డ్’గా పిలుస్తారు. శత్రువునుంచి ముప్పు ఉంది అన్నప్పుడు మాత్రమే ఇవి అలా నీళ్లపై పరుగులుతీస్తాయి. నిమిషంలో 30 మీటర్ల దూరం ఇవి అలా ప్రయాణించగలవు. పిల్లలైతే మరీ వేగంగా నీటిపై ప్రయాణిస్తాయి. ముదురు జేగురు, ఆకుపచ్చటి రంగుల్లో కన్పించే వీటి శరీరంలో 70శాతం తోక ఉంటుంది. వీపుపై మూపురం, పదునైన పళ్లు, కాళ్లకు ప్రత్యేకమైన వేళ్లు ఉంటాయి. అతి తేలికగా ఉండటం వల్ల ఇది అతివేగంగా నీటిపై తేలుతూ వెళ్లిపోతుంది. ఆకులకింద చాలాకాలం ఇవి బతికేయగలవు. నిజానికి ఇవి ఎక్కువసేపు నీళ్లలో ఉండవు.